Prabhas: ప్రభాస్ కి తన లెవెల్ ఏంటో తెలీదు.. పృథ్వీ రాజ్ సుకుమారన్ కామెంట్స్ వైరల్!

Prabhas: ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఈయన సలార్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ సినిమా ఎంతో అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర తర్వాత అదే స్థాయిలో హైలైట్ అయిన పాత్ర ఏదైనా ఉంది అంటే అది వరదరాజ మన్నార్ పాత్ర అని చెప్పాలి.

ఈ పాత్రలో నటుడు పృథ్వీ రాజ్ సుకుమారన్ నటించారు.ఈ సినిమాలో వీరిద్దరూ కూడా రానా స్నేహితులుగా కనిపించి సందడి చేశారు. అయితే ఈ సినిమా తర్వాత వీరిద్దరూ నిజ జీవితంలో కూడా అదే స్నేహ బంధంతో కొనసాగుతున్నారు ఇక వీరి మధ్య ఏర్పడినటువంటి ఈ స్నేహం గురించి పృథ్వీ రాజ్ పలు సందర్భాలలో వెల్లడించారు.

ఇకపోతే ఈయన నటించిన ఆడు జీవితం అనే సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మరోసారి ప్రభాస్ తో తనకు ఉన్నటువంటి స్నేహబంధం గురించి తెలియజేశారు. తనకు సలార్ సినిమా చేసిన తర్వాతనే ప్రభాస్ తో మంచి స్నేహబంధం ఏర్పడిందని ఈయన తెలియజేశారు.

స్నేహం చేయకుండా ఉండలేరు..
తాను ఒక విషయాన్ని కచ్చితంగా చెప్పగలను ప్రభాస్ గురించి తెలిసిన వారు ఆయనతో స్నేహం చేయకుండా ఉండటం అసాధ్యమని తెలియజేశారు. ఇక ప్రభాస్ నుంచి నేను నేర్చుకున్నది ఏదైనా ఉంది అంటే దేశంలోనే బిగ్గెస్ట్ స్టార్స్ లో ప్రభాస్ ఒకరు. కానీ ఆయన మాత్రం ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరని, నిజానికి తన లెవెల్ ఏంటి అనేది ప్రభాస్ కి ఏమాత్రం తెలియదు అంటూ ఈ సందర్భంగా ప్రభాస్ మంచితనం గురించి పృథ్వీ రాజ్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.