Ramya Krishna: ఆ హీరోతో రమ్యకృష్ణ ఎఫైర్స్ కొనసాగించిందా.. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారా?

Ramya Krishna: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు గురించి పెద్ద ఎత్తున వార్తలు రావడం సర్వసాధారణం.ముఖ్యంగా ఒక హీరో హీరోయిన్ కలసి రెండు మూడు సినిమాలలో కనుక నటించారు అంటే ఇక వారి మధ్య ఏదో ఉంది అంటూ వార్తలు పుట్టిస్తారు. ఇప్పుడైతే సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ప్రతి ఒక్క హీరో హీరోయిన్ గురించి ఇలాంటి వార్తలు వింటూ ఉన్నాం.

అప్పట్లో సోషల్ మీడియా ఇంతగా అభివృద్ధి చెందలేదు కనుక మెయిన్ మీడియా ఏది చెబితే అదే నిజమని నమ్మేవారు ఇలా అప్పట్లో సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా ఈ విధమైనటువంటి ఎఫైర్ వార్తలను ఎదుర్కొన్నారని తెలుస్తోంది. ఈమె స్టార్ హీరోయిన్ గా అప్పట్లో టాలీవుడ్ బాలీవుడ్ స్టార్ హీరోలు అందరి సరసన నటించారు.

ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈమె అక్కినేని నాగార్జునతో కలిసి సుమారు పది సినిమాలకు పైగా నటించారు. ఇలా వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలన్నీ కూడా సూపర్ హిట్ కావడంతో వీరి మధ్య ఏదో ఉందంటూ అప్పట్లో వార్తలు సృష్టించారు.ఇక వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారని నాగార్జున సైతం అమలకు విడాకులు ఇచ్చి రమ్యకృష్ణని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి.

Ramya Krishna:ఎఫైర్ వార్తల పై స్పందించని రమ్యకృష్ణ…

ఇలా రమ్యకృష్ణ నాగార్జున గురించి ఈ విధమైనటువంటి వార్తలు వచ్చినప్పటికీ వీరిద్దరూ కూడా ఈ వార్తలపై స్పందించకపోవడం గమనార్హం.అయితే 2003వ సంవత్సరంలో రమ్యకృష్ణ డైరెక్టర్ కృష్ణ వంశీని పెళ్లి చేసుకోవడంతో ఒక్కసారిగా ఈ వార్తలకు చెక్ పడింది. అయితే సాధారణంగా ఇలాంటి వార్తలు కనుక వస్తే చాలామంది సెలబ్రిటీలు రియాక్ట్ అవుతూ ఆ వార్తలను ఖండిస్తూ ఉంటారు. మరి కొందరు పెద్దగా పట్టించుకోరు అయితే నాగార్జున రమ్యకృష్ణ కూడా ఈ వార్తలను పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.