Singer Mangli: సింగర్ మంగ్లీనీ కీలక పదవిలో కూర్చోబెట్టిన జగన్ సర్కార్!

Singer Mangli: ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం తన పార్టీ కోసం కృషి చేసిన వారందరి సేవలను మర్చిపోకుండా వారి సేవలకు సరైన ప్రతిఫలాన్ని అందిస్తోంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందినటువంటి పలువురు గత ఎన్నికలలో భాగంగా వైయస్సార్సీపి పార్టీకి మద్దతు తెలిపారు. ఈ క్రమంలోనే వారి సేవలను గుర్తించిన ఏపీ ప్రభుత్వం వారికి కీలకమైన పదవులను కట్టబెడుతుంది.

ఈ క్రమంలోనే తాజాగా సింగర్ మంగ్లీకి సైతం జగన్ సర్కార్ కీలకమైన పదవిని అప్పజెప్పింది. తెలంగాణ బోనాల పాటలను పాడుతూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మంగ్లీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో సింగర్ గా కొనసాగుతున్నారు. ఇక ఈమె కూడా ఎన్నికలలో భాగంగా పార్టీ తరపున ప్రచారాలను నిర్వహించారు.

ఈ క్రమంలోనే మంగ్లీ సేవలను గుర్తించిన ఏపీ సర్కార్ ఆమెకు ఏకంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ బోర్డు అడ్వైజర్ గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా ఈమెకు ఈ పదవి అప్ప చెప్పడమే కాకుండా నెలకు లక్ష రూపాయలు చొప్పున శాలరీ ఇవ్వడమే కాకుండా రెండు సంవత్సరాలుగా భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా కొనసాగుతారని ఉత్తర్వులు జారీ చేశారు.

భక్తి ఛానల్ బోర్డ్ అడ్వైజర్ గా మంగ్లీ…

ఈ విధంగా ఏపీ ప్రభుత్వంలో మంగ్లీకి ఇలాంటి పదవి రావడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇదివరకే కమెడియన్ ఆలీకి సైతం ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించారు. అదేవిధంగా పోసాని కృష్ణ మురళికి సైతం ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.ఇలా వీరిద్దరి తర్వాత సింగర్ మంగ్లీకి జగన్ ప్రభుత్వంలో అవకాశం లభించింది.