ఆయన ఓ సినీ కళా కార్మికుడు, తన లక్ష్య సాధనలో నిర్విరామ మేధోమదనం తో విజయాలను తను అందుకోవడమే కాక సినీ నటులను విజయ శిఖరాలను అంచులకు తీసుకువెళ్లి తాను తీసిన చిత్రాలలో 90% విజయవంతమైన చిత్రాలను రూపొందించి, సినీ దర్శకునిగా మకుటం లేని మహారాజుగా ఎదిగారు. ఒక్క ఎన్.టి. రామారావు మినహా ఆ తరం నుంచి ఈ తరం వరకూ అందరితో సినిమాలు తీశాడు.
Advertisement
నాగేశ్వరరావు, కృష్ణంరాజు, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి హీరోలతో హిట్టు, సూపర్ హిట్ లను తీసిన అగ్ర దర్శకుడు కోదండరామిరెడ్డి. అక్కినేని నాగేశ్వరరావు-శ్రీదేవి లతో శ్రీరంగనీతులు…శ్రీరంగనీతులు సినిమా షూటింగ్ లో సంబంధించిన నటుడు రాకపోవడం మూలాన కోదండరామిరెడ్డి ఓ చిన్న పాత్రను వేయడం జరిగింది. రాధిక ఏ.ఎన్నార్ తో అనుబంధం సినిమా, కృష్ణం రాజు-జయప్రదల తో ప్రళయ రుద్రుడు, కృష్ణ-శ్రీదేవి కాంబినేషన్ లో కిరాయి కోటిగాడు, రామరాజ్యంలో భీమరాజు, ఆ తర్వాత శోభన్ బాబు-లక్ష్మీ కాంబినేషన్లో ప్రేమ మూర్తులు అలాగే శోభన్ బాబు-సుహాసిని కాంబినేషన్ లో బావ మరదలు, ఇల్లాలు ప్రియురాలు వంటి సినిమాలను రూపొందించారు.
ఆ తర్వాత తరం హీరోలయిన చిరంజీవితో అనేక సినిమాలను రూపొందించారు. ఒక విధంగా చిరంజీవికి మాస్ ఇమేజ్ తీసుకొచ్చిన ఖైదీ సినిమా కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చింది. చిరంజీవి రాధిక కాంబినేషన్లో న్యాయం కావాలి, అభిలాష, దొంగ మొగుడు, చిరంజీవి -విజయశాంతి కాంబినేషన్లో చాలెంజ్, అత్తకి యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం, చిరంజీవి-సుహాసిని కాంబినేషన్ లో రాక్షసుడు, బాలకృష్ణ-విజయశాంతి కాంబినేషన్ లో భానుమతి గారి అల్లుడు, భార్గవ రాముడు, భలే దొంగ.
నాగార్జున-జుహీచావ్లా కాంబినేషన్లో విక్కీ దాదా, నాగార్జున-మీనా కాంబినేషన్ లో ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, బొబ్బిలి సింహం,వెంకటేష్-విజయశాంతి కాంబినేషన్ లో సూర్య ఐపిఎస్ మోహన్ బాబు-దివ్యభారతి కాంబినేషన్ లో చిట్టెమ్మ మొగుడు, రాజశేఖర్ తో రౌడీయిజం నశించాలి మొరటోడు నా మొగుడు వంటి దాదాపు 93 సినిమాలను ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించి హీరోల సక్సెస్ రేటును పెంచిన ఈ దర్శకుడు సెంచరీకి చేరువలో రనౌట్ అయ్యారు.
Keerthy Suresh: సినీనటి కీర్తి సురేష్ వివాహం జరగబోతోంది అంటూ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా ఎన్నో వార్తలు వినిపించాయి.
Advertisement
ఈ విధంగా కీర్తి సురేష్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఆమె ఈ వార్తలపై స్పందించి ఈ వార్తలను ఖండించారు. ఒకానొక సమయంలో కీర్తి సురేష్ తండ్రి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. కీర్తి సురేష్ పెళ్లి గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని ఒకవేళ అలా తన పెళ్లి చేసుకుంటే కనుక ముందుగా ఈ విషయాన్ని నేనే మీకు తెలియజేస్తానని తెలిపారు.
అప్పటినుంచి ఈ వార్తలకు కాస్త పులి స్టాప్ పడినా, గత మూడు రోజులుగా ఈ పెళ్లి గురించి మరోసారి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ మాట్లాడుతూ కీర్తి సురేష్ వివాహం తనకు 15 సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి ఆంటోని తట్టిల్ తో డిసెంబర్ నెల 11వ తేదీ గోవాలోని ఒక రిసార్ట్ లో జరగబోతుందని తెలిపారు.
Keerthy Suresh:
ఈ విధంగా ఈయన తన కుమార్తె పెళ్లి గురించి అధికారకంగా ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కీర్తి ఆంటోని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. ఇక ఆంటోనీ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
YS sharmila: వైయస్ షర్మిల తనకు ప్రభాస్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో ఏ ప్రభుత్వంలో మహిళలు గురించి తప్పుగా మాట్లాడారనే విషయం గురించి ప్రస్తావనకు రావడంతో వైఎస్ షర్మిల గురించి గతంలో బాలకృష్ణ తన ఇంట్లో చేసిన ఆరోపణల గురించి మాట్లాడారు.
Advertisement
ఈ క్రమంలోనే వైయస్ షర్మిల ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభాస్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదని తెలిపారు. ఈ వ్యాఖ్యలు బాలకృష్ణ గారు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయించారు అంటూ మండిపడ్డారు.
YS sharmila: ఒక్కసారి కూడా చూడలేదు..
నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్న అప్పుడు ఇప్పుడు నేను ఒకే మాట చెబుతున్న ప్రభాస్ అనే వ్యక్తి ఎవడో నాకు ఇప్పటికీ తెలియదు.ఆయనని నేరుగా నేను ఒక్కసారి కూడా చూడలేదు అంటూ షర్మిల ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో ఈమె ఇదే విషయం గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడిన ఒక వీడియోని కూడా వైకాపా కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఎవరు ఎవరిని కించపరిచారో ఒక్కసారి చూడు షర్మిల అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Roja: వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి ఈ బియ్యం టాంపరింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికలలో భాగంగా కూటమీ ప్రభుత్వానికి ఏకంగా 164 స్థానాల విజయం సాధించింది. వైకాపా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ ఎన్నికల ఫలితాలపై ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి.
Advertisement
ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయి అంటూ వైకాపా నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వివి ప్యాట్లనులెక్క పెట్టాలి అంటూ కొంతమంది వైకాపా నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే వివి ప్యాట్లను లెక్క పెట్టాలని చెప్పినప్పటికీ అప్పటికే వివి ప్యాట్లను నాశనం చేశారని ఎన్నికల కమిషన్ చెప్పారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా సంచలన విషయాలను బయటపెట్టారు. సాధారణంగా ఎన్నికలు జరిగినా 6 నెలల వరకు ఈ వివి ప్యాట్లను కూడా జాగ్రత్తగా భద్రపరచాలి కానీ ఎన్నికలు జరిగినా నెలలోపు ఈ వివి ప్యాట్లను నాశనం చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద కుట్ర జరిగిందోనని ఈమె తెలిపారు.
Roja: ఈవీఎం మాయ..
ఇకపోతే ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే విషయాలు రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో కూడా అదే ఓట్లు తేలాల్సి ఉంటుంది కానీ ఎన్నికల సమయంలో ఏకంగా 45 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ 45 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తుంటేనే ఇది ఈవీఎం ప్రభుత్వమని అర్థమవుతుంది అంటూ రోజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.