Yandamuri Veerendhranath : అశ్విని దత్ కు ఒక పిచ్చి ఉంది… శక్తి సినిమాలో అది మార్చమని చెప్పినా వినకుండా అలానే తీసాడు : యండమూరి

Yandamuri Veerendhranath : నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ గారు తన నవలల ద్వారా తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్. తన నవలలు చాలా సినిమాలుగా వచ్చి అలరించాయి కూడా. ఛాలెంజ్, అభిలాష వంటి సినిమాలు చిరంజీవి కెరీర్ ను మలుపు తిప్పాయి. ఇక ఈయన రచనలకు ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి. అంతే కాకుండా ఈయన రాసిన ‘విజయానికి ఐదు మెట్లు’ పుస్తకం ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా అమ్ముడుబోయిన పుస్తకాల్లో ఒకటి. ఇక ఈయనకు చిరంజీవి, అశ్వినిదత్ వంటి వారితో స్నేహం ఉంది. ఆయన నవలలో కథానాయకుడి పాత్రను చిరంజీవి ని ఉహించుకునే రాసుకుంటాను అని చాలా సందర్భాల్లో ఆయన చెబుతుంటారు. ఇక ఏ సినిమా తీసినా అశ్వినిదత్ మొదట కథ యండమూరి గారికి చెబుతారట.

శక్తి లో ఆ మార్పు చేయమంటే వినలేదు…

అశ్విని దత్ కు నుమరాలజీ మీద నమ్మకం ఎక్కువ అందువల్ల ఏ సినిమా టైటిల్ పెట్టినా నాకో ఫోన్ చేసి అడుగుతాడు. ఇక సినిమా కథ కూడా ఖచ్చితంగా చెబుతాడు. అలా శక్తి సినిమా కోసం చేసినపుడు కథ విని కథలో హోమ్ మినిస్టర్ కూతురు హీరోయిన్ ఆమెను సేవ్ చేయడానికి హీరో వెళ్తాడు అంతా బాగా ఉన్నా హీరో తండ్రి పాత్ర మూసగా ఉంది అది నచ్చలేదు జనాలకు బోర్ కొడుతుంది మార్చమని చెప్పాను.

అయితే కథలో ఏ మార్పు చేయకుండా అలానే సినిమా తీశారు. మొన్నా ఈ మధ్య విడుదల అయిన ‘సీతారామం’ సినిమా కథ కూడా చెప్పాడు టైటిల్ కూడా సంఖ్యశాస్త్రం ప్రకారం అడిగి వెళ్ళాడు. ఇక చిరంజీవి చాలా ఏళ్ల నుండి అనుబంధం ఉంది. తన కొడుకు చరన్ ఆపరేషన్ చేయించుకున్నాడని చెప్పినందుకు వాళ్ళు అంత రియాక్ట్ అవుతారని అనుకోలేదు. అంతకుముందు శ్రేదేవి లాంటి అగ్ర హీరోయిన్లు కూడా ముక్కు సర్జరీ చేయించుకున్నారు కదా అది పేపర్ లోనే వచ్చింది బహిరంగంగానే ఆ విషయంలో తెలుసు దాంట్లో ఏముంది అన్న ధోరణిలో నేను చెప్పాను వాళ్లకు నచ్చలేదు దానికి నేనేం చేయలేను.