Home Remedies For Cough: కఫం సమస్యతో బాధపడుతున్నారా… ఈ ఇంటి చిట్కాలతో విముక్తి పొందండి!

Home Remedies For Cough: కఫం సమస్యతో బాధపడుతున్నారా… ఈ ఇంటి చిట్కాలతో విముక్తి పొందండి!

Home Remedies For Cough: వాతావరణం కొంచెం చల్లబడినా చాలు జలుబు దగ్గు మనల్ని చికాకుపెట్టేస్తాయి. ఈ కరోనా కాలంలో జలుబు, దగ్గు వంటివి ఆందోళనకు కారణమవుతాయి.ముఖ్యంగా దగ్గు చాలా ఇబ్బంది పెడుతుంది. సీజన్ చేంజ్ వల్ల ప్రస్తుతం అందరు జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు.ఇందులోను కఫంతో కూడుకున్న దగ్గుతో ఎక్కువగా బాధపడుతున్నారు.
ఈ సమస్య మొదలవుతూనే పరిష్కార మార్గాలు వెతుకుతాం. కఫం తొలగించడానికి మన వంటింటి చిట్కాలు చాలానే ఉన్నాయి అవేంటో చూద్దాం.

Home Remedies For Cough: కఫం సమస్యతో బాధపడుతున్నారా… ఈ ఇంటి చిట్కాలతో విముక్తి పొందండి!
Home Remedies For Cough: కఫం సమస్యతో బాధపడుతున్నారా… ఈ ఇంటి చిట్కాలతో విముక్తి పొందండి!

తిప్ప తీగ రసం: దగ్గు ఎక్కువగా ఉంటే 2 చెంచాల తిప్ప తీగ రసం నీళ్లలో కలిపి దగ్గు తగ్గే వరకు ప్రతిరోజు ఉదయాన్నే తాగాలి. ఇది రోగనిరోధక శక్తిని పెంచి అల్లర్జీ వ్యతిరేక గుణాలు ఉండటంతో పొగ, కాలుష్యం, పుప్పొడి వల్ల వచ్చే దగ్గును తగ్గిస్తుంది.

Home Remedies For Cough: కఫం సమస్యతో బాధపడుతున్నారా… ఈ ఇంటి చిట్కాలతో విముక్తి పొందండి!

నల్లమిరియాలు: దగ్గుకు మాములుగా మిరియాల కషాయం మందు.1/2 చెంచా నల్లగా మిరియాలు పొడి దేశవాళీ నెయ్యితో కలిపి కడుపు నిండుగా ఉన్నపుడు తీసుకుంటే ఫలితం ఉంటుంది.

మసాలా టీ:
వేడి వేడి మసాలా టీ కాస్త గొంతు గర గర అన్న కూడా తీసుకుంటూంటాము. మసాలా టీ కోసం ½ చెంచా అల్లం పొడి, చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొన్ని లవంగాలు టీ కి జత చేయాలి. మసాలా టీ వల్ల ఉపశమనము లభిస్తుంది.

తలకింద ఎత్తు పెట్టుకొని పడుకోవాలి…

దానిమ్మ రసం ½ కప్పు, చిటికెడు అల్లం పొడి, అలాగే పిప్పాలి పొడి కలిపి ఇస్తే ఫలితం కనిపిస్తుంది.దానిమ్మ లోని విటమిన్ ఎ,సీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అల్లము శరీర వేడిని పెంచి కఫంను తగ్గిస్తుంది. ఇక్కడ అల్లము బదులుగా నల్లమిరియాలు వాడవచ్చు.
ఇవే కాకుండా దగ్గు ఎక్కువగా రాత్రి పడుకున్నప్పుడు ఎక్కువగా వస్తుంది. కారణం కఫం ముక్కు నుండి గొంతు లోకి జారడం వల్ల ఆ సమయం లో ఎక్కువగా దగ్గు వస్తుంది కాబట్టి పడుకున్నప్పుడు ఎత్తుగా దిండు తలకింద పెట్టుకుంటే సరిపోతుంది. దగ్గు ఎక్కువగా కాలం బాధిస్తున్నా, ఛాతీ నొప్పి దగ్గడం వల్ల ఎక్కువైనా డాక్టర్ ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాలి.