తల్లిదండ్రులకు ఫోన్ చేసిన ఆర్యన్ ఖాన్.. వెంటనే డబ్బులు పంపిన షారుక్ ఖాన్?

ఇటీవల బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ చేసులో చిక్కుకొని ప్రస్తుతం జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో అధికారులు 20 మందిని అరెస్టు చేశారు. జైలు నుంచే తన తల్లిదండ్రులకు ఆర్యన్ వీడియో కాల్ చేసి మాట్లాడినట్లు సీనియర్ అధికారులు తెలుపుతున్నారు.

అరెస్టయిన 12 రోజుల తర్వాత అతడు తన తల్లిదండ్రులతో మాట్లాడారు. దానికి అధికారులు అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. కరోనా కేసులు అక్కడ ఇంకా తగ్గకపోవడంతో ప్రత్యక్షంగా కలవడానికి ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదు. దీంతో అధికారులు ఇలా వీడియో కాల్ చేయడానికి అనుమతి ఇచ్చారు. జైలులోని వారు నెలలో రెండు లేదా మూడు సార్లు వీడియోకాల్ చేసుకునేందుకు అవకాశమిస్తున్నారు.

ఆర్యన్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని తన తండ్రి షారూఖ్ ఖాన్, తన తల్లి గౌరీ ఖాన్‌లకు వీడియోకాల్ చేసి దాదాపుగా 10నిమిషాలు మాట్లాడారు. అతడు ఫోన్ మాట్లాడుతున్నసేపు వెక్కివెక్కి ఏడ్చాడని జైలు అధికారులు తెలుపుతున్నారు. అయితే ఆర్యన్ ఖాన్ కుసుకు సంబంధించి అక్టోబర్ 20 న విచారణకు రానుందని అధికారులు తెలియజేశారు. ఇక ఇంటి నుంచి వచ్చే భోజనాన్ని వద్దని.. జైలు భోజనాన్నే ఆర్యన్ ఖాన్ స్వీకరిస్తున్నాడని తెలిపారు.

జైలు నిబంధనల ప్రకారం ఆర్యన్‌కు రూ.4,500 మనీ ఆర్డర్ తన తల్లిదండ్రుల నుంచి వచ్చింది. జైలు క్యాంటిన్లో చిరుతిండ్లు, జ్యూస్ సహా ఇతర ఆహార పదార్థాలను కొనుక్కునేందుకు ఆర్యన్ వీటిని వినియోగించుకోవచ్చు. అక్టోబర్ 3న రేవ్ పార్టీ జరుగుతున్న క్రూయిజ్‌షిప్‌పై ఎన్సీబీ అధికారులు దాడి చేసి ఆర్యన్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.