Featured
లిరిక్ రైటర్ చంద్రబోస్ భార్య గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా..?
Published
4 years agoon
By
TD Adminతెలుగు సినిమాల్లో సాహిత్యానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికి తెలిసిందే. కేవలం సాహిత్యం కోసమే పాటలు వినే ప్రేక్షకులు ఉంటారని చెప్పనవసరం లేదు.. ఆకాలం నుంచి సాహిత్య విలువలని పెంచుతూ వస్తున్నారు ఎంతోమంది గీత రచయితలు.. ఈ తరం గీతరచయితలు కూడా అవే సాహిత్య విలువలు పెంచుతూ ముందుకు వెళ్తున్నారు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, చంద్రబోస్ లాంటి వారు తెలుగు సాహిత్యాన్ని మరోమెట్టు పెంచుతూ పోతున్నారు..
ఇక చంద్రబోస్ గురించి చెప్పాలంటే సుప్రసిద్ధమైన సాహిత్యానికి, ఈ తరానికి తగట్లు పాటలు రాయగల గీత రచయిత గ చంద్రబోస్ ఎల్లప్పుడూ ముందు ఉంటారు..తాజ్ మహల్ సినిమాకి తొలుత పాట రాసే అవకాశం దక్కించుకున్న చంద్రబోస్ ఆ తర్వాత ఎనుతిరిగి చూసుకోలేదు.. సరళమైన పదాలతో, ప్రేక్షకులను నాది తెలుసుకుని పాట రాయడం అయన స్పెషాలిటీ.. అందుకే అయన వెంట దర్శక నిర్మాతలు కోకొల్లలుగా తమ పాటలు రాయమని వెంటపడుతుంటారు. అలాంటి అయన ప్రొఫెషనల్ కెరీర్ గురించి అందరికి తెలిసిందే అయినా పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీ లో పనిచేసే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి దాకా వెళ్లిన జంటలు చాలానే ఉన్నాయి.
అలాంటి వారిలో ఒకరు చంద్రబోస్, సుచిత్ర జంట.. కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర గారిని చంద్రబోస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాఘవేంద్ర రావు గారు తీసిన ఆఖరిపోరాటం సినిమాతో కొరియోగ్రాఫర్ గా మారిన సుచిత్ర గారిని చంద్రబోస్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఆఖరి పోరాటం సినిమా తర్వాత ఆవిడ చైతన్య,మనీ,గాండీవం, వినోదం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి చాలా సినిమాలకి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు.అలాగే కొరియోగ్రాఫర్ గా కూడా ఆమె చాలా అవార్డ్స్ అందుకున్నారు.రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా పరిచయం చేస్తూ రతి ఆర్ముగం హీరోయిన్ గా పరిచయం అవుతూ చేసిన పల్లకిలో పెళ్లికూతురు సినిమాకి సుచిత్ర గారే దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సుచిత్రా సినిమాలలో కొరియోగ్రఫీ చేస్తూ బిజీగా ఉంటున్నారు.
You may like
Featured
Sobhita: పెళ్లి కాకుండానే.. నాగ్ మామకు షాకింగ్ కండిషన్ పెట్టిన కోడలు పిల్ల శోభిత!
Published
42 mins agoon
4 December 2024By
lakshanaSobhita: మరి కొన్ని గంటలలో శోభిత నాగచైతన్యల వివాహం జరగబోతుంది. ఈ క్రమంలోనే ఏర్పాట్లు అన్నీ కూడా పూర్తి అయ్యాయి. అలాగే వీరి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ అన్నీ కూడా పూర్తి అయ్యాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు మూడుముళ్ల బంధంతో నాగచైతన్య శోభిత ఒకటి కాబోతున్నారు. ఈ తరుణంలోని వీరికి సంబంధించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ క్రమంలోనే శోభితకు సంబంధించి ఒక వార్త వైరల్ అవుతుంది. ఈమె అక్కినేని ఇంట్లో కోడలుగా అడుగుపెట్టే సమయానికి అక్కినేని ఇంట్లో ఉన్నటువంటి నాగేశ్వరరావు ఫోటోని తీసేయాలని కండిషన్ పెట్టారట. ఇలా నాగేశ్వరరావు ఫోటోని తీసేయమని కండిషన్ పెట్టడం ఏంటి అనే విషయానికి వస్తే .. అక్కినేని నాగేశ్వరరావు గారు చివరిగా నటించిన మనం సినిమాలోని ఒక ఫోటోని నాగేశ్వరరావు ఇంటి ఎంట్రన్స్ లోనే పెద్దగా పెట్టించారట.
ఇక ఈ ఫోటోలో నాగేశ్వరరావుతో పాటు మనం సినిమాలో నటించిన వారందరూ కూడా ఉన్నారు. అందులో నాగార్జున నాగచైతన్య సమంత కూడా ఉండటం విశేషం. ఈ ఫోటో నాగేశ్వరరావుకి ఎంతో ఇష్టమైనది. అయితే ఈ ఫోటోలో సమంత ఉండటంతో ఈ ఫోటోని తీసేయాలని శోభిత చెప్పారట. ఇక నాగార్జునకు ఈ ఫోటో తీసేయడం ఇష్టం లేకపోయినప్పటికీ తప్పనిసరి పరిస్థితులలో అందుకు ఒప్పుకున్నారని తెలుస్తుంది.
Sobhita: సమంత ఉండటం..
ఇక ఈ ఫోటో తీసేయకపోతే తిరిగి నాగ చైతన్య శోభిత మధ్య కూడా భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకనే నాగార్జునకు ఇష్టం లేకపోయిన శోభిత చెప్పిన విధంగానే ఈ ఫోటోని తీసేయడానికి నాగార్జున ఒప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందనేది తెలియాల్సి ఉంది.
Featured
Anasuya: పుష్ప 2 విడుదల… సంచలన పోస్ట్ చేసిన అనసూయ…. ఆ హీరోని టార్గెట్ చేస్తుందా?
Published
1 hour agoon
4 December 2024By
lakshanaAnasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో బుల్లితెర యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న అనసూయ ప్రస్తుతం వెండితెరపై ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఈమె వరస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలోనే అనసూయ నటించిన పుష్ప 2 సినిమా విడుదల కానుంది ఈ క్రమంలోనే ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు సంచలనగా మారింది.
తాజగా హైదరాబాద్లో జరిగిన ఈ సినిమా వేడుకలో ఎంతో సరదాగా యాక్టివ్గా అనసూయ కనిపించారు. ఈ కార్యక్రమంలో ఈమె రష్మిక తో పాటు ఇతర సినిమా బృందంతో చాలా సంతోషంగా గడిపారు. అయితే ఈ వేడుక పూర్తి కాగానే అనసూయ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ సంచలనగా మారింది.
ఈమె సోషల్ మీడియా వేదికగా దూరపు కొండలు నునుపు అనే ఒక్క పోస్ట్ మాత్రమే చేసింది. అయితే ఈ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో సంచలనగా మారడమే కాకుండా మరోసారి విజయ్ దేవరకొండ అభిమానులకు అనసూయకు మధ్య వివాదాన్ని రాజేచేసింది. ఇలా అనసూయ దూరపు కొండలు అనే పదంలో కొండలు అనే పదాన్ని మాత్రమే అభిమానులు గుర్తిస్తూ తప్పకుండా ఈ కౌంటర్ విజయ్ దేవరకొండను ఉద్దేశించి చేశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Anasuya: విజయ్ దేవరకొండ..
ఇక మరి కొంతమంది అభిమానులైతే రష్మికని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారని భావిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీ నుంచి హీరోయిన్గా సక్సెస్ అయిన రష్మిక ఇలా విజయ్ దేవరకొండను ప్రేమిస్తున్న నేపథ్యంలో దూరపు కొండలు నునుపు అనే ఉద్దేశంతోనే ఈమె ఈ పోస్ట్ చేశారని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క పోస్టుతో రష్మిక మరోసారి వార్తల్లో ట్రెండ్ అవుతున్నారు.
Featured
Allu Arjun: అల్లు అర్జున్ ఏడాదికి ఇన్కమ్ టాక్స్ ఎన్ని కోట్లు చెల్లిస్తారు తెలుసా?
Published
2 hours agoon
4 December 2024By
lakshanaAllu Arjun: అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. ఇక ఇప్పటికే అభిమానులు థియేటర్ల వద్ద పెద్ద ఎత్తున హంగామా చేస్తున్నారు. ఇక థియేటర్లను ఎంతో అందంగా ముస్తాబు కూడా చేశారు. ఇక ఈ సినిమా ప్రీమియర్ షో పూర్తి కాగానే అభిమానులు సంబరాలు చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నారు.
ఇదిలా ఉండగా పుష్ప సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ కి సంబంధించి మరిన్ని వివరాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాధారణంగా మనం సంపాదించే సంపాదన బట్టి ప్రభుత్వానికి టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో సెలబ్రిటీలు భారీ స్థాయిలోనే టాక్సులు చెల్లిస్తూ ఉంటారని మనకు తెలిసిందే. అయితే తాజాగా అల్లు అర్జున్ ఏడాదికి చెల్లించే టాక్స్ కి సంబంధించి ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.
ఫార్చ్యూన్ ఇండియా భారతదేశంలో అత్యధిక పన్ను చెల్లించే సినీ ప్రముఖుల జాబితాను ప్రకటించింది. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యధికంగా టాక్స్ చెల్లించే హీరోల జాబితాలో అల్లు అర్జున్ మాత్రమే ఉండటం గమనార్హం. తాజాగా ఈ జాబితాలో టాప్ 20 సెలెబ్రిటీలను విడుదల చేశారు. ఇందులో అల్లు అర్జున్ 16 వ స్థానంలో ఉండటం విశేషం.
Allu Arjun: 16వ స్థానం..
2023- 24 సంవత్సరానికి గాను అల్లు అర్జున్ ఏకంగా రూ.14 కోట్ల మేర అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించినట్లు ఫార్చూన్ ఇండియా నివేదిక తెలిపింది. దీంతో ఈయన భారీ స్థాయిలోనే టాక్స్ పే చేస్తున్నారని చెప్పాలి. ఇక మరో ఆసక్తి కరమైన విషయం ఏంటంటే ఈ టాప్ 20 జాబితాలో అల్లు అర్జున్ పేరు మినహా రామ్ చరణ్ ఎన్టీఆర్ ప్రభాస్ వంటి వారి పేర్లు లేకపోవటం గమనార్హం.
Sobhita: పెళ్లి కాకుండానే.. నాగ్ మామకు షాకింగ్ కండిషన్ పెట్టిన కోడలు పిల్ల శోభిత!
Anasuya: పుష్ప 2 విడుదల… సంచలన పోస్ట్ చేసిన అనసూయ…. ఆ హీరోని టార్గెట్ చేస్తుందా?
Allu Arjun: అల్లు అర్జున్ ఏడాదికి ఇన్కమ్ టాక్స్ ఎన్ని కోట్లు చెల్లిస్తారు తెలుసా?
Allu Arjun: మొన్న అన్ ఫాలో.. నేడు పుష్ప సినిమాకు విషెష్ చెప్పిన మెగా హీరో.. పోస్ట్ వైరల్!
Allu Arjun: పుష్ప 2 సినిమాని అడ్డుకుంటాము.. బన్నీకి వార్నింగ్ ఇచ్చిన జనసేన నేత?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!
Keerthy Suresh: ప్రియుడితో ఏడడుగులు నడవబోతున్న కీర్తి సురేష్.. డిసెంబర్లోనే పెళ్లి?
Hyper Aadi: రోజా గారిని ఎప్పుడూ అలా మాట్లాడలేదు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!
Trending
- Featured4 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured4 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- devotional4 weeks ago
Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!
- Featured2 weeks ago
Keerthy Suresh: ప్రియుడితో ఏడడుగులు నడవబోతున్న కీర్తి సురేష్.. డిసెంబర్లోనే పెళ్లి?
- Featured2 weeks ago
Hyper Aadi: రోజా గారిని ఎప్పుడూ అలా మాట్లాడలేదు… హైపర్ ఆది షాకింగ్ కామెంట్స్!
- Featured2 weeks ago
Rocking Rakesh: అర్ధరాత్రి రోడ్లపై తిరుగుతూ తన సినిమా పోస్టర్లను అంటిస్తున్న రాకేష్..ఫోటోలు వైరల్!
- Featured1 week ago
Prabhas Fans: ప్రభాస్ ఎవడు నీకు తెలియదా.. గతాన్ని తవ్వి మరి షర్మిలకు కౌంటర్ ఇస్తున్న ఫ్యాన్స్?
- Featured2 weeks ago
Garikapati: తగ్గేదేలే అంటావా… నువ్వేమైనా హరిశ్చంద్రుడివా.. పుష్ప 2 పై గరికపాటి షాకింగ్ కామెంట్స్!