నటి హేమకు కౌంటర్ ఇచ్చిన ‘మా’ అధ్యక్షుడు నరేష్.. చర్యలు తీసుకుంటామంటూ?

సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్ట్ గా కొనసాగిన నటి హేమ “మా”నిధులను దుర్వినియోగం చేశారంటూ మా అధ్యక్షుడు పై ఆరోపణలు చేశారు.కావాలనే మా అధ్యక్షుడిగా మరికొన్ని రోజులు కొనసాగాలనే ఉద్దేశంతోనే మా ఎన్నికలు జరగడం లేదంటూ నటి ఆరోపణలపై తాజాగా మా అధ్యక్షుడు నరేష్, జీవిత స్పందిస్తూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే సోమవారం మీడియా ముందు మాట్లాడిన నరేష్ నటి హేమ వ్యాఖ్యలపై ఈ విధంగా స్పందించారు..

గత రెండు సంవత్సరాల నుంచి “మా” లో ఏం జరిగింది అనే విషయాలను గురించి నరేష్ మీడియా ముందు సవివరంగా వివరించారు. ఈ క్రమంలోనే నటి హేమ అసోసియేషన్ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడారని, ఆమె మాట్లాడిన మాటలు అందరినీ ఎంతో ఆశ్చర్యానికి గురి చేశాయని తెలిపారు. మా డబ్బులను గోల్ మాల్ చేశామని నటి ఆరోపించడంతో స్పందించిన నరేష్ “మా”డబ్బులలో ఎలాంటి గోల్ మాల్ జరగలేదని ఇప్పటికీ “మా”లో సరిపడే డబ్బులు ఉన్నాయని తెలిపారు.

కరోనా విపత్కర పరిస్థితులలో సినీ కార్మికుల కోసం పలువురు సెలబ్రిటీలు డొనేట్ చేసిన డబ్బులు కూడా భద్రంగా ఉన్నాయని ఈ సందర్భంగా నరేష్ వివరించారు.ప్రస్తుతం మా ఎలక్షన్స్ జరగాల్సి ఉండగా కరోనా పరిస్థితుల వల్ల ఈ ఎలక్షలను వాయిదా వేస్తున్నారు.ఈ క్రమంలోనే పరిస్థితులు చక్కబడ్డాక తప్పకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా మా అధ్యక్షుడు నరేష్ మీడియా ముందు వెల్లడించారు.

ఈ క్రమంలోనే నటి జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ హేమ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుత వుండే ఈ కరోనా పరిస్థితులలో ఎవరిని ఫండ్ అడుగుతామని ఆమె నిలదీశారు.గతంలో కొత్త కమిటీ ఏర్పడినప్పుడు పెద్ద హీరోలు అందరూ వారి రెమ్యూనరేషన్ లో కొంత శాతం మా అసోసియేషన్ కి ఇస్తామని తెలిపారు. అయితే ప్రస్తుతం వారిని డబ్బులు అడుగలేని పరిస్థితిలో ఉన్నామని జీవిత తెలియజేశారు. ఇకపోతే ఆగస్టు 22వ తేదీ ఏజీఎం నడుపుతామని, ఆ రోజు సభ్యులంతా ఎలక్షన్లు ఎప్పుడు జరపాలి అనే విషయం గురించి నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా జీవిత వెల్లడించారు.