ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు…. తెలుగు సినీ పరిశ్రమలో అని తెలియని నటుడు ఉండకపోవచ్చు. ఎందుకంటే క్రితం జనరేషన్లో ఈయన కూడా గొప్ప నటుడు కాబట్టి. కృష్ణం రాజు గారు జనవరి 20, 1940 సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు గ్రామంలో జన్మించారు. వీరు క్షత్రియ రాజుల వంశస్తులు… విజయనగర సామ్రాజ్యం వారసులు. అయితే ఈయన కేవలం సినీ పరిశ్రమలోనే కాకుండా రాజకీయాల్లో కూడా ప్రముఖ పాత్ర పోషించారు. భారతీయ జనతా పార్టీ తరఫున 12 వ లోక్ సభ ఎన్నికల్లో కాకినాడ నియోజకవర్గం నుండి ఆయన గెలుపొందారు. ఆ తర్వాత మరోసారి నర్సాపురం లోక్ సభ నుండి ఎన్నిక కావడంతో అటల్ బిహారీ వాజ్ పై ప్రభుత్వంలో ఆయన కేంద్రమంత్రిగా పని చేశారు. ఆ తర్వాత 2009 వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీని వీడి చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అయితే ఆ తర్వాత రాజమండ్రి నుంచి ఎన్నికల్లో నిలబడగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత నుంచి కాస్త రాజకీయాలకు దూరంగానే ఉన్నారు అని చెప్పవచ్చు.

ఆయన చిన్నప్పటి విషయాలు ఒక కార్యక్రమంలో తెలుపుతూ… నా చిన్నతనంలో నేను ఇంట్లో ఉన్నప్పుడు మా నాన్న గారిని కలవడానికి ఒక పెద్దమనిషి ఇంటికి వచ్చాడని ఆ సమయంలో నేను వారు వచ్చిన కానీ నేను సోఫాలో కాళ్లు జాపుకొని ఉన్నాను. ఇలా ఆ పెద్దమనిషి మా ఇంట్లో ఉన్నంతసేపు నేను అలాగే ఉన్నాను. ఆ తర్వాత ఆయన వెళ్లిపోయిన తర్వాత మా నాన్నగారు నా దగ్గరికి వచ్చి మా ఇంట్లో ఉన్న ఒక కొరడా నాచేతుల తోనే తెప్పించి ఆయన చేతిలోకి తీసుకున్నాడు. అప్పటి వరకు నాకు అర్థం కాలేదు అసలు ఏమి జరగబోతుందో. కానీ ఆ తర్వాత ఆ కొరడా తీసుకొని మా నాన్న నన్ను బాగా దెబ్బలు వేశారు. ఎవరైనా పెద్దవారు ఇంటికి వచ్చినప్పుడు అలా చేయకుండా వారికి మర్యాదలు చేయాలని ఆ తర్వాత నింపాదిగా చెప్పాడు. దీనితో ఆ రోజు నుంచి ఎవరైనా తన ఇంటికి వస్తే ముందుగా వారికి ఆదిత్యం ఇచ్చిన తర్వాత వారిని పలకరిస్తూ వారికీ ఎలాంటి సహాయం చేయగలనో చేస్తాని అని తెలియజేశారు రెబల్ స్టార్ కృష్ణంరాజు.

కృష్ణంరాజు 1966వ సంవత్సరంలో చిలకా గోరింక అనే సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. 1970 – 1980 దశకాల్లో ఈయన తిరుగులేని నటుడిగా తెలుగు చిత్రసీమలో స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఆయన మొత్తంగా తెలుగులో 183 సినిమాలను నటించాడు. ఈయన పలు చిత్రాలకు నంది అవార్డు కూడా గెలుచుకున్నారు. నిజానికి కృష్ణంరాజు గారి నటనా శైలి మిగతా హీరోలతో పోలిస్తే చాలా విభిన్నం. ఆయనను ఎవరన్నా కలవడానికి వెళ్ళినప్పుడు కూడా వారితో ఎంతో మర్యాదపూర్వకంగా వారిని పలకరించి వారికి ఏమి కావాలో కనుక్కొని సహాయం చేసే మంచి మనిషి ఈయన. అయితే తన నటనా జీవితంలో ఉన్నప్పుడు ఒకసారి కొందరు మిమిక్రీ ఆర్టిస్టులు జరిగిన సమావేశంలో మిమ్మల్ని మేము ఎలా అలంకరించాలో మాకు అర్థం కావట్లేదు, మీరు ప్రతి సినిమాలో… ఒక క్యారెక్టర్ ఒక్కొక్కలాగా చేస్తున్నారు అని చెప్పగా నటుడు కృష్ణం రాజు దానికి నవ్వి ఊరుకున్నారు.

అయితే ఇటు సినిమాల పరంగా అటు రాజకీయాల పరంగా ఎనలేని కీర్తిని అందుకున్న కృష్ణంరాజుగారు ఆయన ఒక విషయంలో మాత్రం చాలా బాధకు గురి అయ్యారు. అదేమిటంటే తన భార్య ఆలపాటి శ్యామల దేవిని కార్ యాక్సిడెంట్ లో పోగొట్టుకోవడం. ఆమె మరణించిన తర్వాత ఆయన సినిమాలలో నటించడం చాలా తక్కువ అయింది. ఇకపోతే ఈ దంపతులకు ముగ్గురు కుమార్తెలు. వారి పేరు ప్రసిద్ధి, ప్రదీప్తి, ప్రకీర్తి… ఇక ఈయన అన్నకొడుకు ప్రస్తుత టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఆయన చదువుకున్న పది రోజులలో రాజమండ్రి లోని YN కాలేజీ లో తన విద్యను అభ్యసించారు. ఇక తన భార్య జ్ఞాపకార్థం ఆ కాలేజీలో ఒక బ్లాకు కట్టించి తన స్మృతిగా ఆ కాలేజీలో సేవలందించడానికి కృష్ణం రాజు గారు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణం రాజు గారికి 80 సంవత్సరాలు. అయినా సరే ఆయన చాలా చురుకుగా ఉంటూ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఇప్పటికి.



























