Featured
టీకా వేసుకోలేదా..? అయితే జీతాలు కట్!
Published
3 years agoon
By
lakshanaప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనాను కట్టడి చేయడం కోసం మన ముందున్న ఒకే ఒక మార్గం వ్యాక్సిన్. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా బారిన పడినప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం ఉండదని అధికారులు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రజలలో ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.సాధారణ ప్రజలను అలా ఉంచితే ప్రభుత్వ ఉద్యోగులు సైతం కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకు రావడం లేదని, ఈ క్రమంలోనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కీలక నిర్ణయాన్ని పాకిస్తాన్ లోని సింధ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మురాద్అలీ షా ఉపక్రమించారు.
రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఉద్యోగి అయితే కరోనా వ్యాక్సిన్ వేయించుకోకుండా ఉంటారో అలాంటి వారికి వచ్చే నెల నుంచి జీతాలు కట్ చేయనున్నట్లు మురాద్అలీ షా ఆదేశాలు జారీ చేశారు. ప్రజలలో వ్యాక్సిన్ పట్ల అవగాహన కల్పించాల్సిన ప్రభుత్వ అధికారులు వెనకడుగు వేయడంతో ముఖ్యమంత్రి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
సింధ్ ప్రావిన్సుల కోవిడ్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలోనే సీఎం ఈ ప్రకటన చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ప్రధాన కార్యదర్శి, వైద్య నిపుణులు, ఇతర ఉన్నతాధికారులు హాజరుకాగా ప్రభుత్వ ఉద్యోగులు టీకా వేయించుకోవడానికి ఒక నెల సమయం ఇచ్చారు. ఈ లోగ వ్యాక్సిన్ వేయించుకోకపోతే వారికి జీతాలు కట్ చేయాల్సిందిగా ఆర్థిక శాఖకి ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 7వ తేదీ నుంచి పాఠశాలలో తిరిగి ప్రారంభం కానున్న నేపథ్యంలో జూన్ 5వ తేదీలోగా ఉపాధ్యాయులు అందరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలని సింధ్ సర్కారు ఆదేశించింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,550,553 మందికి టీకా వేయగా.. 4,29,000 మంది రెండు డోసుల వేయించుకున్నారు.ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగించడం కోసం అదనంగా మూడు వందల వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు,అదేవిధంగా ఒక్కో తాలూకాకు 5 మొబైల్ వ్యాక్సిన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
You may like
Covid Vaccine: భారత్ బయోటెక్ చుక్కల మందు టీకాకు డీసీజీఐ ఆమోదం..!
కోవిడ్ టీకా గర్భధారణపై ప్రభావం చూపుతుందా..? నిపుణులు ఏమంటున్నారు..?
వ్యాక్సిన్ తీసుకున్నారా.. అయితే ఈ బంపర్ ఆఫర్లు మీకోసమే..
రెండు నెలలో 25 కోట్ల వ్యాక్సిన్లు టార్గెట్: కేంద్రం?
ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ అందుకున్న వ్యక్తి మృతి.. కాకపోతే?
వ్యాక్సిన్ కొనడంలో కేంద్రం తప్పు చేసింది.. సంచలన వ్యాఖ్యలు చేసిన టాప్ వైరాలిజిస్ట్..?
Featured
Keerthy Suresh: డిసెంబర్ 11న కీర్తి సురేష్ వివాహం..అధికారికంగా ప్రకటించిన కీర్తి సురేష్ తండ్రి!
Published
4 hours agoon
22 November 2024By
lakshanaKeerthy Suresh: సినీనటి కీర్తి సురేష్ వివాహం జరగబోతోంది అంటూ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా ఎన్నో వార్తలు వినిపించాయి.
ఈ విధంగా కీర్తి సురేష్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఆమె ఈ వార్తలపై స్పందించి ఈ వార్తలను ఖండించారు. ఒకానొక సమయంలో కీర్తి సురేష్ తండ్రి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. కీర్తి సురేష్ పెళ్లి గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని ఒకవేళ అలా తన పెళ్లి చేసుకుంటే కనుక ముందుగా ఈ విషయాన్ని నేనే మీకు తెలియజేస్తానని తెలిపారు.
అప్పటినుంచి ఈ వార్తలకు కాస్త పులి స్టాప్ పడినా, గత మూడు రోజులుగా ఈ పెళ్లి గురించి మరోసారి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ మాట్లాడుతూ కీర్తి సురేష్ వివాహం తనకు 15 సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి ఆంటోని తట్టిల్ తో డిసెంబర్ నెల 11వ తేదీ గోవాలోని ఒక రిసార్ట్ లో జరగబోతుందని తెలిపారు.
Keerthy Suresh:
ఈ విధంగా ఈయన తన కుమార్తె పెళ్లి గురించి అధికారకంగా ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కీర్తి ఆంటోని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. ఇక ఆంటోనీ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
Featured
YS sharmila: ప్రభాస్ ఎవడో నాకు ఇప్పటికీ తెలియదు.. వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు?
Published
5 hours agoon
22 November 2024By
lakshanaYS sharmila: వైయస్ షర్మిల తనకు ప్రభాస్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో ఏ ప్రభుత్వంలో మహిళలు గురించి తప్పుగా మాట్లాడారనే విషయం గురించి ప్రస్తావనకు రావడంతో వైఎస్ షర్మిల గురించి గతంలో బాలకృష్ణ తన ఇంట్లో చేసిన ఆరోపణల గురించి మాట్లాడారు.
ఈ క్రమంలోనే వైయస్ షర్మిల ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభాస్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదని తెలిపారు. ఈ వ్యాఖ్యలు బాలకృష్ణ గారు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయించారు అంటూ మండిపడ్డారు.
YS sharmila: ఒక్కసారి కూడా చూడలేదు..
నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్న అప్పుడు ఇప్పుడు నేను ఒకే మాట చెబుతున్న ప్రభాస్ అనే వ్యక్తి ఎవడో నాకు ఇప్పటికీ తెలియదు.ఆయనని నేరుగా నేను ఒక్కసారి కూడా చూడలేదు అంటూ షర్మిల ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో ఈమె ఇదే విషయం గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడిన ఒక వీడియోని కూడా వైకాపా కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఎవరు ఎవరిని కించపరిచారో ఒక్కసారి చూడు షర్మిల అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Featured
Roja: ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు!
Published
5 hours agoon
22 November 2024By
lakshanaRoja: వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి ఈ బియ్యం టాంపరింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికలలో భాగంగా కూటమీ ప్రభుత్వానికి ఏకంగా 164 స్థానాల విజయం సాధించింది. వైకాపా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ ఎన్నికల ఫలితాలపై ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి.
ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయి అంటూ వైకాపా నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వివి ప్యాట్లనులెక్క పెట్టాలి అంటూ కొంతమంది వైకాపా నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే వివి ప్యాట్లను లెక్క పెట్టాలని చెప్పినప్పటికీ అప్పటికే వివి ప్యాట్లను నాశనం చేశారని ఎన్నికల కమిషన్ చెప్పారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా సంచలన విషయాలను బయటపెట్టారు. సాధారణంగా ఎన్నికలు జరిగినా 6 నెలల వరకు ఈ వివి ప్యాట్లను కూడా జాగ్రత్తగా భద్రపరచాలి కానీ ఎన్నికలు జరిగినా నెలలోపు ఈ వివి ప్యాట్లను నాశనం చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద కుట్ర జరిగిందోనని ఈమె తెలిపారు.
Roja: ఈవీఎం మాయ..
ఇకపోతే ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే విషయాలు రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో కూడా అదే ఓట్లు తేలాల్సి ఉంటుంది కానీ ఎన్నికల సమయంలో ఏకంగా 45 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ 45 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తుంటేనే ఇది ఈవీఎం ప్రభుత్వమని అర్థమవుతుంది అంటూ రోజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh: డిసెంబర్ 11న కీర్తి సురేష్ వివాహం..అధికారికంగా ప్రకటించిన కీర్తి సురేష్ తండ్రి!
YS sharmila: ప్రభాస్ ఎవడో నాకు ఇప్పటికీ తెలియదు.. వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు?
Roja: ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు!
ABV: జగన్ నోరు అదుపులో పెట్టుకో… నేనేంటో నీకు పూర్తిగా తెలుసు: ఏబీ వెంకటేశ్వరరావు!
Garikapati: తగ్గేదేలే అంటావా… నువ్వేమైనా హరిశ్చంద్రుడివా.. పుష్ప 2 పై గరికపాటి షాకింగ్ కామెంట్స్!
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Trending
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured4 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?
- devotional2 weeks ago
Koti Deepotsavam: ముస్తాబైన ఎన్టీఆర్ స్టేడియం.. కోటి దీపోత్సవ కార్యక్రమానికి సర్వం సిద్ధం!
- Featured2 weeks ago
YS Vijayamma: ఫేక్ లెటర్ పై స్పందించిన వైయస్ విజయమ్మ… వీడియో వైరల్!