ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ రెండవ దశ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. 45 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే వాక్సిన్ వేయించుకోవడానికి ప్రజలు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. మన దేశంలో భారత్ బయోటెక్ రూపొందించిన కోవాక్సిన్, సీరం ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇస్తున్నారు.
ఈ రెండు వ్యాక్సిన్లు అన్ని భద్రతా చర్యలు తీసుకున్న తర్వాతే ప్రవేశపెట్టినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. అయితే దేశ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ కోట్ల మంది ప్రజలు తీసుకుంటున్నారు. కానీ కొన్ని చోట్ల మాత్రమే ఈ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల కొందరిలో రియాక్షన్స్ వస్తున్నాయి. దీంతో కొందరు వ్యాక్సిన్ వేసుకోవడానికి ముందుకు రావడం లేదు. అయితే ఇవన్నీ కేవలం అపోహలు లేనని, వాక్సిన్ తీసుకోవడం ఎంతో సురక్షితం అంటూ అధికారులు తెలియజేస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కొన్ని జాగ్రత్తలను పాటిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోవని అధికారులు తెలియజేస్తున్నారు.
కరోనా టీకా వేయించుకోవడం వల్ల కలిగే తేలికపాటి దుష్ప్రభావాలు: సాధారణంగా ఎటువంటి వ్యాక్సిన్ తీసుకున్న వ్యాక్సిన్ ద్వారా కొద్దిపాటి లక్షణాలు బయటపడతాయి. ఈ క్రమంలోనే కరోనా వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల టీకా వేసిన ప్రాంతంలో కొద్దిగా నొప్పిగా ఉండి వాపు వస్తుంది. అదే విధంగా కొందరిలో తలనొప్పి, అలసట, నీరసం, జ్వరం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తే ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఇవన్నీ కూడా సర్వసాధారణమైన లక్షణాలేనని అధికారులు చెబుతున్నారు.
Advertisement
ఈ విధమైనటువంటి లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా డాక్టర్ల సలహాలు తీసుకొని ఆ సూచనలను పాటించాలి. ఈ విధమైనటువంటి నొప్పులు ఒకటి లేదా రెండు రోజుల పాటు ఉంటాయి. అంతకన్నా ఎక్కువగా ఉంటే డాక్టర్ ని సంప్రదించి వారి సూచనలను పాటించాలి.వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందు లేదా తర్వాత ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు సూచిస్తున్నారు.
YS Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో అధికార పక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు ఈయన ప్రెస్ మీట్ కార్యక్రమం ద్వారా సమాధానాలు చెప్పడమే కాకుండా అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గురించి మాట్లాడుతూ ఎంతో మంచి పనులు చేస్తున్న చంద్రబాబు నాయుడు మరో 10 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు.
Advertisement
ఒక రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి బాటలో నడవాలి అంటే అనుభవం ఉన్న నాయకులు ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ తెలిపారు ఇలా ఎంతో అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలలోనూ అభివృద్ధి చెందుతుంది. ఇలా అనుభవం కలిగిన నాయకుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం అదృష్టం. మరో పదేళ్లు బాబుగారే సీఎం అంటూ పవన్ తెలిపారు.
ఇక ఈ విషయం గురించి ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించడం వైయస్ జగన్ కి ఒక రిపోర్టర్ నుంచి ప్రశ్న ఎదురయింది. పవన్ కళ్యాణ్ బాబు గారే మరో 10 సంవత్సరాల పాటు సీఎం అంటూ కామెంట్లు చేస్తున్నారు దానిపై స్పందన ఏంటి అనే ప్రశ్న ఎదురవుగా జగన్ సమాధానం చెబుతూ…
YS Jagan: మంచి చేసిన వారే సీఎం..
ఒక రాష్ట్రానికి ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటారు అనే విషయాన్ని ప్రజలు నిర్ణయిస్తారని తెలిపారు. సీఎం ఎవరు అనేది వారు చేసిన మంచి పనుల బట్టే ఉంటుందని మంచి పనులు చేసిన వారిని ప్రజలు ఆశీర్వదిస్తారని జగన్ చెప్పారు. దీంతో కొంతమంది మీరు మంచి చేయలేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని కాదని చంద్రబాబుకు అధికారం ఇచ్చారా.. అంటూ కామెంట్లు చేయగా మరికొందరు జగన్ కి మద్దతు తెలియజేస్తున్నారు.
A.R Rahaman: ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ తన 29 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. 29 సంవత్సరాల పాటు సైరా బాను అనే మహిళతో వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడిపిన ఈ దంపతులు ఇటీవల విడాకులు తీసుకుని విడిపోయారు. వీరి విడాకుల ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
Advertisement
ఇలా రెహమాన్ తన భార్య నుంచి విడాకులు తీసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయంపై కూడా చర్చలు మొదలయ్యాయి. వీరి విడాకులకు ఇదే కారణం అంటూ ఎన్నో రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కెరలు కొడుతున్న తరుణంలోనే సైరా బాను లాయర్ వీరి విడాకులకు గల కారణాలను బయట పెట్టడంతో ఈ విషయం కాస్త సంచలనంగా మారింది.
ఈ సందర్భంగా లాయర్ వందన షా మీడియాతో మాట్లాడుతూ.. రెహమాన్ దంపతులు విడిపోవడానికి.. అతని అసిస్టెంట్ మోహిని విడాకులు తీసుకోవడానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. రెహమాన్ సైరా బాను ఇద్దరు కూడా వారి పరస్పర అంగీకారంతోనే కేవలం వ్యక్తిగత కారణాలవల్లే విడాకులు తీసుకొని విడిపోయారే తప్ప ఎలాంటి ఎఫైర్లు కాదని, తన విడాకుల గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా అవాస్తవమని తెలిపారు.
A.R Rahaman: వ్యక్తిగత విషయాలే కారణం..
ఈ విధంగా రెహమాన్ సైరా భాను విడాకులు తీసుకొని విడిపోవడం ఎంతో బాధ కలిగించే విషయం ఈ విషయాన్ని ఎవరు ఇష్టపడరని అలాగే ఎవరు సెలబ్రేట్ కూడా చేసుకోరని లాయర్ వందన షా తెలియజేశారు. ఇక వీరి విడాకులకు వారి వ్యక్తిగత విషయాలే కారణం. వారి వ్యక్తిగత స్వేచ్ఛ మేరకే ఆ విషయాలను బయట పెట్టలేదని తెలిపారు.
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో 150 రోజుల కూటమి పాలన గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలని బయటపెట్టారు. ఈ సందర్భంగా కూటమి పాలన గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఈ 150 రోజుల కాలంలో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందని తెలిపారు. ఇక కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కీలక నిర్ణయాలు ఎంతో సంతోషాన్ని కలిగిస్తున్నాయని తెలిపారు.
Advertisement
ముఖ్యంగా పాఠశాలలలో మధ్యాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ గారి పేరును పెట్టడంతో చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్ చేతులు జోడించి మరి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం కలిగిన నాయకుడు రాష్ట్రానికి ఎంతో అవసరం అని తెలిపారు. ఇలాంటి అనుభవం కలిగిన వారు అధికారంలో ఉంటేనే రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.
ఇటీవల విజయవాడలో వరదలు రావడంతో చంద్రబాబు నాయుడు ఆఫీసులో కూర్చుని అధికారులకు ఆదేశాలు ఇచ్చి పనులు చేయించుకోవచ్చు కానీ ఆయన అలా చేయలేదు ప్రజల ముందుకు వచ్చి నేనున్నాను ఎవరు భయపడొద్దు అంటూ ప్రజలకు భరోసా కల్పించి బురదలో కూడా ఈయన పర్యటనలు చేశారు.
Pawan Kalyan: అనుభవం ఉన్న నాయకుడు..
గత ప్రభుత్వ హయామంలో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడు ఎవరు కూడా చేపట్టలేదని అందుకే రాష్ట్రానికి అనుభవం కలిగిన నాయకుడు ఎంతో అవసరమని పవన్ తెలిపారు. ఇలా చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ కార్యక్రమాలను కనుక చూస్తే మరో 10 సంవత్సరాల పాటు మన బాబు గారే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఇలా బాబు గురించి పవన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.