భారత్ కి థర్డ్ వేవ్ ముప్పు.. ప్రజలు జాగ్రత్తలు పాటించలేదని నిపుణులు ఆందోళన!

దేశంలో కరోనా రెండవ దశ ఎంతటి స్థాయిలో విజృంభించి దేశాన్ని.వణికించిందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే రోజుకు లక్షల్లో కేసులు నమోదవగా వేలల్లో మృత్యువాతపడ్డారు. అయితే ఇండియా ఇప్పుడిప్పుడే కరోనా రెండవ దశ నుంచి క్రమంగా కోలుకుంటోంది. ఈ క్రమంలోనే అన్ని రాష్ట్రాలలో లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో ప్రజలు పెద్ద ఎత్తున పర్యాటక ప్రదేశాలకు వెళ్తున్నారు.ఈ క్రమంలోనే ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించక పోవడంతో నిపుణులు భారత్ కి థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇండియాలో కరోనా రెండవ దశ పూర్తిగా తొలగి పోకముందే మూడవ దశ ప్రారంభం అవుతుందని ఆందోళనలో నిపుణులు ఉన్నారు. ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నారు. కేసులు తగ్గుముఖం పట్టడంతో పలు రాష్ట్రాలలో లాక్ డౌన్ తొలగించారు ఈక్రమంలోనే ప్రజలు గుంపులు గుంపులుగా, ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా రోడ్లపైకి వస్తున్నారు.

మరి కొన్ని రాష్ట్రాలలో ప్రజలు ఎక్కువగా పర్యాటక ప్రదేశాలకు వెళ్లడమే కాకుండా అక్కడ కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా ప్రజలు కనీస జాగ్రత్తలు పాటించకుండా తిరగడం వల్ల కరోనా మూడవ దశ వ్యాప్తి చెందడానికి కారణం అవుతున్నారని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే పర్యాటక శాఖ మరి కొద్ది రోజుల పాటు టూరిజం వాయిదా ఆ వేసుకోవడం మంచిదని నిపుణులు సూచించారు.