వైఫై స్పీడ్ పెరగాలంటే ఈ టిప్స్ పాటించాల్సిందే!

గత ఏడాది నుంచి కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉండటంతో పలు సాఫ్ట్ వేర్ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రొం హోమ్ సదుపాయాన్ని కల్పించింది.అయితే ఇంటి నుంచి పని చేసుకోవాలంటే మనకు ముఖ్యంగా ఉండాల్సింది ఇంటర్నెట్. మన వర్క్ స్పీడ్ పెరగాలంటే నెట్ స్పీడ్, వైఫై స్పీడ్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. మీ ఇంట్లో వాడే వైఫై స్పీడ్ స్లోగా ఉందా? మరి వైఫై స్పీడ్ పెంచుకోవాలంటే తప్పకుండా ఈ క్రింది టిప్స్ ఫాలో కావాల్సిందే..

  • వైఫై రూటర్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి:
    మన ఇంట్లో రూటర్ వైఫై స్పీడ్ పెంచాలంటే రూటర్ స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయాలి. రూటర్ టర్న్ ఆఫ్ చేసి మోడమ్ కనెక్షన్ తొలగించి మళ్లీ కనెక్ట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంటర్నెట్ సిగ్నల్స్, హోం నెట్ వర్క్, ఐసీపీ మధ్య సిగ్నల్స్ కలుపుతుంది. వైఫై స్పీడ్ స్లోగా ఉంటే.. మోడమ్ రీసెట్ చేస్తే చాలు.. వైఫై స్పీడ్ కూడా పెరుగుతుంది.
  • రూటర్ అమర్చిన చోటును మార్చండి:
    వైఫై స్పీడ్ స్లో గా ఉంటే రూటర్ అమర్చిన చోటు నుంచి మరొక చోటుకు మార్చాలి. రూటర్ ఎక్కడపడితే అక్కడ మార్చడం వల్ల మన ఇంట్లో ఉన్న వస్తువుల కారణంగా కొన్ని సార్లు సిగ్నల్స్ అందకపోవచ్చు. కనుక రూటర్ అమర్చిన చోటును మార్చడం వల్ల వైఫై స్పీడ్ పెరుగుతుంది.
  • రూటర్ ఎక్విప్మెంట్ రీప్లేస్ చేయడం:
    మన ఇంట్లో వైఫై కనెక్షన్ స్లోగా ఉంటే అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. అందులో మోడమ్ ఎక్విప్మెంట్ ఒకటి. ఈ ఎక్విప్మెంట్ పాతదైన లేక అవుట్ డేట్ అయినా మనకు సిగ్నల్స్ అందవు. కనుక అప్పుడప్పుడు రూటర్ ఎక్విప్మెంట్ రీప్లేస్ చేసుకోవాలి.
  • రూటర్ యాంటీనా సెట్ చేయాలి:
    మనకు వైఫై సిగ్నల్ సరిగ్గా అందాలంటే యాంటీనా సరైన క్రమంలో ఉండాలి. కొన్ని సార్లు భవనాల ఎత్తు అధికంగా ఉండటం వల్ల సిగ్నల్స్ సరిగ్గా అందవు అలాంటప్పుడు వైఫై స్లో అవుతుంది. కనక వైఫై సిగ్నల్స్ అందేవిధంగా యాంటీనా సరి చేసుకోవాలి.