Mahi v raghav: నేనేమీ 100 ఎకరాలు అడగలేదే.. విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన యాత్ర డైరెక్టర్?

Mahi v raghav: మహీ వి రాఘవన్ ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున వార్తలలో నిలిచారు .తాజాగా ఈయన దర్శకత్వం వహించినటువంటి యాత్ర 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. వైయస్సార్ మరణం తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర రాజకీయ ప్రవేశం గురించి ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు డైరెక్టర్ మహి.

ఇక ఈయన యాత్ర సినిమాకు అంతంత మాత్రమే ఆదరణ వస్తుంది కేవలం వైఎస్ అభిమానులు మాత్రమే ఈ సినిమాని చూస్తున్నారు. ఇక ఈ సినిమా పక్కన పెడితే డైరెక్టర్ మాత్రం పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఈ సినిమా చేసినందుకుగాను ఈయన ఏపీ ప్రభుత్వం నుంచి రెండు ఎకరాల స్థలాన్ని కానుకగా తీసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి.. అయితే గతంలోనే డైరెక్టర్ హార్స్లీ హిల్స్ ప్రాంతంలో స్టూడియో నిర్మాణం కోసం తనకు రెండు ఎకరాల స్థలం కావాలి అంటూ సీఎంని కోరిన సంగతి తెలిసిందే.

ఇలా జగన్ యాత్ర సినిమా చేసినందుకు గాను డైరెక్టర్ కు కోట్లు విలువైన ప్రభుత్వ స్థలాన్ని రాసిచ్చారు అంటూ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నటువంటి తరుణంలో ఈ వార్తలపై డైరెక్టర్ స్పందించారు. ఈ సందర్భంగా మహి ఈ విషయం గురించి మాట్లాడుతూ తాను మదనపల్లిలో పుట్టి పెరిగాను ఇక్కడే చదువుకున్నాను. తాను ఇండస్ట్రీలోకి వచ్చి 16 సంవత్సరాలు అయింది అని తెలిపారు.

రాయలసీమకు చేసిందేమీ లేదు…

ఇక తెలుగు చిత్ర పరిశ్రమ కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నప్పటికీ రాయలసీమకు మాత్రం ఏ చిన్న సహాయం చేయలేకపోయిందని తెలిపారు. అందుకే నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతోనే హార్స్లీ హిల్స్లో రెండు ఎకరాల స్థలం అడిగానని తెలిపారు. అందరిలా నేను ఏ 100 ఎకరాలు 50 ఎకరాలు స్థలం అడగలేదు ఇక్కడ ఓ మినీ స్టూడియో కట్టడం కోసం కేవలం రెండు ఎకరాలు మాత్రమే అడిగానని గత ప్రభుత్వాలు వాళ్ల వారికి ఇచ్చిన విధంగా నేనేమి అడగలేదు అంటూ ఈయన ఈ వార్తలపై ఘాటుగా స్పందిస్తూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.