Connect with us

Featured

Ramcharan: కూతురిని ముద్దాడుతున్న చరణ్… బెస్ట్ డాడ్ అంటూ సంతోషపడుతున్న ఉపాసన?

Published

on

Ramcharan: ఉపాసన కొణిదెల పరిచయం అవసరం లేని పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్యగా ఈమె అందరికీ ఎంతో సుపరిచితమే. ఉపాసన రాంచరణ్ ల వివాహం 11 సంవత్సరాల క్రితం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇలా వీరి వివాహం జరిగి ఇన్ని సంవత్సరాలు అవుతున్న ఇప్పటివరకు ఈ జంట పిల్లల గురించి ఆలోచించలేదు.

ఇటీవల ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఉపాసన రాంచరణ్ కుమార్తె క్లిన్ కారా ఆరు నెలలను పూర్తి చేసుకున్నారు. ఇలా తమ చిన్నారికి ఆరు నెలలు పూర్తి అయినప్పటికీ ఇప్పటివరకు తాను ఎలా ఉంటుంది అనే విషయాన్ని మాత్రం అభిమానులకు చూపించలేదు దీంతో అభిమానులు మెగా వారసురాలని ఎప్పుడు చూస్తామా అన్న ఆత్రుత కనబరుస్తున్నారు.

ఇకపోతే క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని మేక కుటుంబంలో పెద్ద ఎత్తున క్రిస్మస్ వేడుకలను జరుపుకున్న సంగతి తెలిసిందే తాజాగా ఈ క్రిస్మస్ వేడుకలకు సంబంధించినటువంటి ఫోటోలను ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో భాగంగా తన కుమార్తెకు కూడా ఎరుపు రంగు డ్రెస్ వేసి శాంటా క్లాస్ లాగా తయారు చేశారు.

Advertisement

బెస్ట్ డాడ్…

తన కూతుర్ని ఎత్తుకొని రాంచరణ్ తనని ముద్దాడుతూ ఉండగా పక్కనే ఉన్నటువంటి ఉపాసన తండ్రి కూతురు మధ్య అనుబంధం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఫోటోని ఉపాసన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ బెస్ట్ డాడ్ అంటూ ఈ ఫోటోకి క్యాప్షన్ ఇచ్చారు ఇలా రాంచరణ్ తన కూతురితో ఉన్న ఫోటో వైరల్ గా మారడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు కానీ పాప ఫేస్ చూపించకపోవడంతో చిన్న పాటి నిరుత్సాహం కూడా వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Featured

Wedding Card: వామ్మో అనంత్ అంబానీ వెడ్డింగ్ కార్డు ధర అన్ని లక్షలా.. కార్డ్ స్పెషల్ ఏంటంటే?

Published

on

Wedding Card: ప్రముఖ దిగ్గజ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి వేడుకలు మొదలయ్యాయి. ముఖేష్ అంబానీ, నీత అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు జరగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిపై వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా ఎంతో ఘనంగా జరిగాయి. ఇకపోతే జూలై 12వ తేదీ వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరగబోతోంది.

ఇక వీరి వివాహపు తేదీ దగ్గర పడుతున్న తరుణంలో పెళ్లి వేడుకలు కూడా శర వేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ఇటీవల అనంత్ అంబానీ రాధిక మర్చంట్ వివాహపు వేడుకలలో భాగంగా వారి మొదటి వివాహ పత్రికను నీతా అంబానీ స్వయంగా శ్రీ కాశి విశ్వనాధుని సన్నిధి ఉంచి ప్రత్యేక పూజలు చేయించిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే వీరి వెడ్డింగ్ కార్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వెడ్డింగ్ కార్డులో సుమారు మూడు కిలోలు వెండితో చిన్న మందిరం ఏర్పాటు చేయడమే కాకుండా అందులో విష్ణువు, లక్ష్మి వినాయకుడి బంగారు ప్రతిమలను తయారు చేసి పెట్టారని తెలుస్తోంది. ఇక ఈ వెడ్డింగ్ కార్డ్ ఓపెన్ చేయగానే ఓం అంటూ మంత్రోచ్ఛారణ వినిపిస్తుంది.

Advertisement

మూడు కిలోల వెండి మందిరం..
ఇలా చాలా స్పెషల్ గా ఈ వెడ్డింగ్ కార్డ్ డిజైన్ చేయించారని చెప్పాలి. మరి ఇన్ని ప్రత్యేకతలతో కూడిన ఈ వెడ్డింగ్ కార్డ్ ఖరీదు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. ఒక్కొక్క వెడ్డింగ్ కార్డ్ సుమారు 6.5 లక్షల రూపాయల విలువ చేస్తుందని తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అయితే గతంలో కూడా ఈయన తన కుమార్తె ఈశా అంబానీ పెళ్లి వేడుకలలో కూడా ఇలా ఖరీదైన పెళ్లి పత్రికను తయారు చేయించారు ఇక ప్రస్తుతం అనంత్ రాధిక వెడ్డింగ్ కార్డ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Vijay Devarakonda: మనమందరం వెళ్లిపోయిన కల్కి గుర్తుండిపోతుంది: విజయ్ దేవరకొండ

Published

on

Vijay Devarakonda: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన కల్కి సినిమా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్నో అంచనాలను ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా వైజయంతి మూవీస్ బ్యానర్ వారు సుమారు 600 కోట్ల ఖర్చుతో నిర్మించారు.

ప్రభాస్ దీపికా పదుకొనే కమల్ హాసన్ అమితాబ్ వంటి ప్రధాన నటులు మాత్రమే కాకుండా దుల్కర్ సల్మాన్ విజయ్ దేవరకొండ వంటి సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో నటించిన సంగతి మనకు తెలిసిందే ఇక ఇందులో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి పాత్రలో నటించినట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయం అందుకోవడంతో ఈ సినిమాలో ఓ పాత్రలో నటించిన నటుడు విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ సినిమా ఫలితం పై స్పందిస్తూ చేసినటువంటి పోస్ట్ వైరల్ అవుతుంది. నాగీ, ప్రభాస్ అన్నా, వైజయంతి ఫిల్మ్.. ఈ ప్రేమ విజయానికి మీరు అర్హులు.

Advertisement

చాలా కాలం గుర్తుంటుంది..

మీ అందరి పట్ల చాలా సంతోషంగా ఉంది ..గాడ్ బ్లెస్స్ యు. కమల్ అమితాబ్ దీపిక వంటివారు లేకపోతే కల్కి సినిమా లేదు. మనమందరం వెళ్లిపోయాక కూడా ఈ సినిమా చాలా కాలం పాటు గుర్తుండిపోతుంది అంటూ విజయ్ దేవరకొండ కల్కి సినిమా గురించి స్పందిస్తూ చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Advertisement
Continue Reading

Featured

Prabhas: పేరు మార్చుకున్న ప్రభాస్.. ఇకపై అలా పిలవాల్సిందేనా?

Published

on

Prabhas: కృష్ణంరాజు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు నటుడు ప్రభాస్. 2002వ సంవత్సరంలో ఈశ్వర్ సినిమా ద్వారా హీరోగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈయన సినీ ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదుగుతూ నేడు పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు.

ఇక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొద్ది రోజులకి ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ అనే బిరుదును సొంతం చేసుకున్నారు. ఇలా తన పెదనాన్న కృష్ణంరాజు రెబల్ స్టార్ గా కొనసాగుతూ ఉండగా ప్రభాస్ యంగ్ రెబల్ స్టార్ అనే పేరుతో కొనసాగారు. ఇక సినిమా టైటిల్స్ ముందు కూడా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అని వచ్చేది.

ఇక బాహుబలి సినిమా చేసిన తర్వాత ప్రభాస్ పేరు ముందు పాన్ ఇండియా స్టార్ అంటూ పేరు వచ్చేది కానీ ఇటీవల విడుదలైన కల్కి సినిమా టైటిల్స్ లో ప్రభాస్ పేరు మారిపోయింది. ఈయన పేరు ముందు రెబెల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ కాకుండా శ్రీ అని రావడంతో ప్రభాస్ పేరు మారింది అంటూ ఈ వార్తలను కూడా వైరల్ చేస్తున్నారు.

Advertisement

శ్రీ ప్రభాస్..
కల్కి సినిమా టైటిల్స్ లో ప్రభాస్ పేరుకు ముందు శ్రీ ప్రభాస్ అని పెట్టడంతో ప్రభాస్ తన పేరును కావాలనే మార్చుకున్నారా లేకపోతే ఎవరైనా మార్చారా అని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇకపై ప్రభాస్ ను మనం పిలవాలంటే రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ కాదండోయ్ శ్రీ ప్రభాస్ అని పిలవాల్సిందే. ఇలా ప్రభాస్ పేరు మారడంతో అభిమానులు కూడా ఇలా పేరు మార్చుకోవడం వెనక కారణాలు ఏంటని ఆరాతీస్తున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!