Featured
ప్రజలకు శుభవార్త.. వాళ్లకు వ్యాక్సిన్ అవసరం లేదట..?
Published
4 years agoon
By
lakshanaకరోనా వైరస్ గురించి శాస్త్రవేత్తలు చేస్తున్న పరిశోధనల్లో వైరస్ కు, వ్యాక్సిన్ కు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. శాస్త్రవేత్తలు కరోనా విషయంలో పరిశోధనలు చేసి ఇప్పటికే వైరస్ బారిన పడి కోలుకున్న వాళ్లకు వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో సంవత్సరాల తరబడి ఇమ్యూనిటీ పవర్ ఉంటుందని అందువల్ల వారికి వ్యాక్సిన్ అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో వైరస్ నుంచి రక్షణ కల్పించే యాంటీబాడీలు ఉంటాయని అందువల్ల వీళ్లు రీఇన్ఫెక్షన్కు గురయ్యే అవకాశం తక్కువని వెల్లడించారు. అధ్యయనకారులు వీళ్లకు కరోనా వ్యాక్సిన్ ఇవ్వాల్సిన అవసరం ఉండదని చెప్పారు. 19 నుంచి 81 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న కరోనా నుంచి కోలుకున్న వారిపై పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.
కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో వైరస్ నుంచి సమర్థవంతంగా పోరాడే బీ, టీ లింఫోసైట్ కణాలు పెరిగినట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. బీ, టీ లింఫోసైట్ కణాలు కరోనా నుంచి కోలుకున్న వాళ్లకు మళ్లీ రీ ఇన్ఫెక్షన్ సోకకుండా రక్షిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వాళ్లలో యాంటీబాడీలు ఆలస్యంగా అంతరిస్తున్నట్టు గుర్తించామని అందువల్ల వీళ్లు వైరస్ బారిన పడే అవకాశాలు ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
శరీరంలోని ఇమ్యూనిటీ సిస్టమ్ కరోనా వైరస్ ను సంవత్సరాల తరబడి గుర్తు పెట్టుకుంటుందని.. వైరస్ ఎప్పుడు శరీరంలోకి ప్రవేశించినా సమర్థవంతంగా పోరాడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అధ్యయనకారులు శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ వల్ల భవిష్యత్తులో కరోనా కేసులు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
You may like
Covid Vaccination: ఇకపై కరోనా వ్యాక్సిన్ కు వారందరూ కూడా అర్హులే.. కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం!
Omicron Virus: ఒమిక్రాన్ వైరస్ మనిషి శరీరంపై ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా..?
Telangana Government: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయం..ఇక అన్ని పాఠశాలల్లో అది తప్పని సరి..!
Covaxin : కో వ్యాక్సిన్ టీకా వేయించుకున్న వారు ఈ మందులు వాడనవసరం లేదు..!
శివ శంకర్ మాస్టర్ కు ఆర్థిక సహాయం చేసిన మెగాస్టార్..!
వ్యాక్సిన్ వేసుకున్న మాస్క్ తప్పనిసరి.. డబ్ల్యూహెచ్ వో డైరెక్ట్
Featured
Rashmika: ఆ నొప్పిని భరిస్తేనే హీరోయిన్స్ అవుతాం.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్!
Published
17 mins agoon
18 October 2024By
lakshanaRashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈమె చివరిగా యానిమల్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అప్పటి నుంచి ఎలాంటి సినిమాలు విడుదల కాలేదు కానీ ప్రస్తుతం ఈమె నటిస్తున్న సినిమాలన్నీ కూడా షూటింగ్ దశలో ఉన్నాయి.
ఇక త్వరలోనే ఈమె నటించిన పుష్ప 2 సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక పుష్ప సినిమాలో రష్మిక డీ గ్లామర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. అయితే గతంలో ఈమె తన పాత్ర గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
డీ గ్లామర్ పాత్రలో నటించాలి అంటే మామూలు విషయం కాదు. మేకప్ వేయటం కోసమే ఎన్నో గంటల సమయం పడుతుంది. అయితే ఇలాంటి పాత్రలో నటించడం కోసం రష్మిక చాలా ఇబ్బందులు పడినట్లు ఈమె తెలిపారు.. మేకప్ కోసం గంటలు కూర్చుని వేయించుకోవాలని మేకప్ ఎక్కడ చెరిగిపోతుందోనని కొన్నిసార్లు మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా కేవలం లిప్స్ ఒక్కటే క్లియర్ చేసుకొని జ్యూస్ మాత్రమే తాగేదానినని తెలిపారు.
మేకప్ రిమూవ్..
ఇక ఇలాంటి మేకప్ వేసుకున్న తర్వాత దానిని రిమూవ్ చేయాలంటే ఎంతో నొప్పిగా ఉండేది అలాంటి నొప్పిని మనం భరించినప్పుడే హీరోయిన్స్ గా సక్సెస్ అవుతాము అంటూ రష్మిక పుష్ప సినిమాలోని డీ గ్లామర్ పాత్ర గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Featured
Nagachaitanya: ఆ కారణంతోనే రేస్ కార్ల జోలికి వెళ్ళలేదు…చైతన్య కామెంట్స్ వైరల్!
Published
19 mins agoon
18 October 2024By
lakshanaNagachaitanya: సినీ నటుడు నాగచైతన్య ప్రస్తుతం కెరియర్ పై ఫోకస్ పెట్టారు. ఈయన డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా దాదాపు 80% షూటింగ్ పూర్తి చేసుకుంది. సుమారు 80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ప్రస్తుతం నాగచైతన్య ఈ సినిమా పనులలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా నాగచైతన్య తాజాగా తనకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పటినుంచి కూడా నాగచైతన్యకు రేసింగ్ అంటే చాలా ఇష్టం అనే సంగతి పలు సందర్భాలలో వెల్లడించారు. తనకు ఏదైనా కొత్త రకం బైక్ లేదా కారు కనిపిస్తే అసలు ఆగలేనని వెంటనే డ్రైవ్ చేస్తానని నాగచైతన్య తెలిపారు.
ఇటీవల కాలంలో తాను కార్ రేసింగ్ జోలికి వెళ్లలేదని ఈయన తెలిపారు. ప్రస్తుతం ఒకవైపు సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉండటం వల్ల కుదరలేదని అదేవిధంగా నా స్నేహితులు తాను ఈ అలవాటు మానుకుంటే మంచిదని చెప్పడంతో ఈ అలవాటును కాస్త తగ్గించుకుంటున్నానని తెలిపారు. తాను రేస్ వెళ్లేటప్పుడు చాలా వేగంగా వెళ్తాను అందుకే ఈ అలవాటు మానుకోమని తన స్నేహితులు చెప్పారని చైతన్య వెల్లడించారు.
జాలరి నేపథ్యంలో..
ఇక తండేల్ సినిమా విషయానికి వస్తే నిజ జీవిత కథ ఆధారంగా ఓ జాలరి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో లవ్ స్టోరీ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత నాగచైతన్య పలు సినిమాలలో నటించిన సక్సెస్ అందుకోలేకపోయారు.
Featured
Allu Aravind: చరణ్ ను టార్గెట్ చేసిన అల్లు అరవింద్… అల్లుడికి పోటీగా రానున్న తండేల్!
Published
23 mins agoon
18 October 2024By
lakshanaAllu Aravind: సినీ ఇండస్ట్రీలో స్టార్ ఫ్యామిలీలుగా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన మెగా ,అల్లు ఫ్యామిలీ మధ్య గత కొంతకాలంగా బేదాభిప్రాయాలు ఉన్నాయనే మాట వాస్తవమే అని తెలుస్తోంది. ఎప్పుడైతే అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వచ్చారో అప్పటినుంచి ఈ రెండు కుటుంబాల మధ్య దూరం పెరిగిపోయింది. ఈ ఘటన తర్వాత ఎన్నో వేడుకలు జరిగినప్పటికీ ఈ రెండు కుటుంబాలు కలిసి కనిపించలేదు.
ఈ క్రమంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయి అంటూ సోషల్ మీడియాలో కూడా ఎన్నో వార్తలు వినిపించిన వాటిని ఖండిస్తూ ఇటు మెగా ఫ్యామిలీ గాని అటు అల్లు ఫ్యామిలీ గాని క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు నిజమేనని అందరికీ స్పష్టత వచ్చింది. అయితే తాజాగా మరో ఘటన కూడా వీరి మధ్య భేదాభిప్రాయాలు నిజమైనని రుజువు చేస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ శంకర్ డైరెక్షన్లో నటించిన గేమ్ ఛేంజర్ సినిమా డిసెంబర్లోనే విడుదల కావలసి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడింది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 10వ తేదీ విడుదల చేయాలని దిల్ రాజు భావించారు. అదే రోజు చిరంజీవి విశ్వంభర కూడా విడుదల కాబోతున్న నేపథ్యంలో చిరంజీవిని బ్రతిమలాడి అదే రోజుకు రాంచరణ్ సినిమాని విడుదల చేస్తున్నారు.
రామ్ చరణ్ కు పోటీగా చైతన్య..
ఇలా రామ్ చరణ్ అల్లు అర్జున్ పుష్ప సినిమాకు పోటీగా ఉండకుండా సంక్రాంతి బరిలో దిగగా అల్లు అరవింద్ మాత్రం తన అల్లుడు రామ్ చరణ్ ను టార్గెట్ చేశారని తెలుస్తుంది. అల్లు అరవింద్ నిర్మాతగా చందు మొండేటి దర్శకత్వంలో సాయి పల్లవి నాగచైతన్య జంటగా నటిస్తున్న తండేల్ సినిమాని చరణ్ సినిమాకు పోటీగా విడుదల చేయటానికి సిద్ధమయ్యారు. ఈ సినిమాని జనవరి 14వ తేదీ విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలబడునుంది. ఇలా అల్లుడు పోటీగా మామ బరిలోకి దిగడంతో ఈ రెండు కుటుంబాల మధ్య భేదాభిప్రాయాలు నిజమేనని అభిమానులు భావిస్తున్నారు.
Rashmika: ఆ నొప్పిని భరిస్తేనే హీరోయిన్స్ అవుతాం.. రష్మిక సెన్సేషనల్ కామెంట్స్!
Nagachaitanya: ఆ కారణంతోనే రేస్ కార్ల జోలికి వెళ్ళలేదు…చైతన్య కామెంట్స్ వైరల్!
Allu Aravind: చరణ్ ను టార్గెట్ చేసిన అల్లు అరవింద్… అల్లుడికి పోటీగా రానున్న తండేల్!
Samantha: కొండా సురేఖ వ్యాఖ్యలపై మరోసారి స్పందించిన సమంత…అండగా నిలిచారంటూ?
Samantha: నాగచైతన్య ప్రతి జ్ఞాపకాన్ని కాల్చేసిన సమంత.. ఆ ఒక్కటి భద్రంగా ఉంచుకుందా?
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
Samantha: నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు.. మెగా హీరో పై సమంత కామెంట్స్!
Tirupathi Laddu: తిరుపతి లడ్డు వివాదం.. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్?
Roja: తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: రోజా
Chandra Babu: హిందువులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే.. ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్!
Trending
- Featured4 weeks ago
Abhay Naveen: బిగ్ బాస్ ను అందుకే తిట్టాను… అసలు కారణం బయటపెట్టిన అభయ్ నవీన్!
- Featured2 weeks ago
Samantha: నిన్ను ఎవరు మ్యాచ్ చేయలేరు.. మెగా హీరో పై సమంత కామెంట్స్!
- Featured2 weeks ago
Tirupathi Laddu: తిరుపతి లడ్డు వివాదం.. పవన్ కళ్యాణ్ వర్సెస్ ప్రకాష్ రాజ్?
- Featured2 weeks ago
Roja: తిరుపతి లడ్డు వ్యవహారంలో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు: రోజా
- Featured2 weeks ago
Chandra Babu: హిందువులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే.. ట్రెండ్ అవుతున్న హ్యాష్ టాగ్!
- Featured4 weeks ago
గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్..హింట్ ఇచ్చిన తమన్ సంతోషంలో అభిమానులు!
- Featured3 weeks ago
Anasuya: ఆ విషయంలో ఆ హీరో బాగా ఒత్తిడి చేశాడు… సంచలన వ్యాఖ్యలు చేసిన అనసూయ!
- Featured4 weeks ago
Kumari Aunty: వరద బాధితులకు అండగా కుమారి ఆంటీ.. ఎంత సాయం చేశారో తెలుసా?