Connect with us

Featured

Sreeja: ప్రేమ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రీజ కొణిదెల… వైరల్ అవుతున్న పోస్ట్!

Published

on

Sreeja: శ్రీజ కొణిదెల నిత్యం తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. మెగా డాటర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఈమె తన ప్రేమ పెళ్లి విడాకులు గురించి తరచు వార్తలలో నిలుస్తూ ఉన్నారు.శ్రీజ ఇదివరకు ఒక వివాహం చేసుకొని ఒక బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తనతో విడాకులు తీసుకొని రెండో వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్న శ్రీజ అనంతరం మరొక బిడ్డకు జన్మనిచ్చారు. అయితే గత కొంతకాలంగా శ్రీజ కళ్యాణ్ దేవ్ ఇద్దరూ కూడా దూరంగా ఉంటున్నారు.ఇలా వీరిద్దరూ దూరంగా ఉండడంతో విడాకులు తీసుకున్నారని అందరూ భావించారు. అయితే వీరు విడాకులు తీసుకున్నారని కానీ ఈ విషయాన్ని ఎక్కడ అధికారకంగా ప్రకటించలేదని తెలుస్తోంది.

ఇక సోషల్ మీడియా వేదికగా వీరు చేసే పోస్టులు కనుక చూస్తే వీరు తప్పనిసరిగా విడిపోయారని అర్థమవుతుంది ఇక వాలెంటైన్స్ డే సందర్భంగా వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ప్రేమ గురించి చేసినటువంటి పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.కళ్యాణ్ దేవ్ వాలంటైన్స్ డే పురస్కరించుకొని ఇతరులు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారనేది ముఖ్యం కాదు వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారనేదే ముఖ్యం అంటూ ఈయన పోస్ట్ చేశారు.

Advertisement

Sreeja: ఉన్న ప్రేమను గుర్తించాలి…


ఇక శ్రీజ సైతం సోషల్ మీడియా వేదికగా ప్రేమ గురించి పోస్ట్ చేస్తూ ప్రేమ అంటే నీతో ప్రేమలో పడేసుకోవడం కాదు తనతో తానే ప్రేమలో పడేలా చేసుకోవాలి. ఉన్న ప్రేమను గుర్తించాలి… ప్రేమ కోసం ఎక్కడో వెతక్కూడదు అంటూ ఆమె ప్రేమ గురించి చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ గా మారింది. దీంతో అసలు వీరిద్దరూ ఇలా దూరంగా ఉండడానికి వీరి మధ్య ఈ గ్యాప్ ఏర్పడడానికి గల కారణం ఏంటి అని అందరూ ఆరా తీస్తున్నారు. వీరు మాత్రం ఈ విషయంపై అస్సలు స్పందించడం లేదు.

Featured

Kakli: కల్కి సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్ కదా.. ఆ హీరో సజెస్ట్ చేస్తేనే ప్రభాస్ వరకు వచ్చిందా?

Published

on

Kakli: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి. ఈ సినిమా జూన్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ వారు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.

ఇక ఈ సినిమా జూన్ 27వ తేదీ విడుదల అయ్యి ఎంతో అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకోవడమే కాకుండా భారీ స్థాయిలో కలెక్షన్లను రాబడుతుంది. ఇక ఈ సినిమా ఇంత మంచి సక్సెస్ అయిన నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ప్రభాస్ భైరవ పాత్రలో నటించిన సంగతి మనకు తెలిసిందే.

నిజానికి ఈ సినిమాలో ముందుగా ప్రభాస్ ను అనుకోలేదట డైరెక్టర్ అయితే ఒక స్టార్ హీరో ఈ సినిమాని రిజెక్ట్ చేయడంతోనే ప్రభాస్ వరకు వచ్చిందని తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం సిద్ధం చేసుకున్న తర్వాత డైరెక్టర్ నాగ్ అశ్విన్ మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లి ఈ సినిమా కథను వివరించారట ఈ సినిమా కథ విన్న చిరంజీవి సినిమా చాలా అద్భుతంగా ఉంది కచ్చితంగా సక్సెస్ అవుతుందని తెలియజేశారట.

Advertisement

చిరు రిజెక్ట్ చేశారా..
ఇలా తనకు కథ చెప్పిన తర్వాత ఇందులో భైరవ పాత్రలో మీరు నటించాలని కోరుకుంటున్నాను అని చెప్పడంతో వెంటనే చిరంజీవి ఈ సినిమాలో భైరవ పాత్రలో నేను నటిస్తే ఆ పాత్రకు పూర్తిగా న్యాయం జరగదు. ఈ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతారని ఆయనే ప్రభాస్ పేరును సజెస్ట్ చేశారని తెలుస్తోంది. ఇలా చిరంజీవి కాదంటేనే కల్కి సినిమా కథ ప్రభాస్ వరకు వచ్చిందని, చిరు కారణంగానే ప్రభాస్ మరో హిట్ సినిమాని అందుకున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

NTR: చిరంజీవి ఇచ్చిన అవార్డును ఆ హీరో ఇంటికి పంపిన తారక్.. ఏమైందంటే?

Published

on

NTR: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటుడు ఎన్టీఆర్. ఈయన బాల నటుడి గానే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అతి చిన్న వయసులోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా హీరోగా ఇండస్ట్రీలో ఎంతో సక్సెస్ అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

ఇలా వరుస సినిమాలలో నటిస్తున్న తారక్ గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది. ఎన్టీఆర్ హీరోగా నటించిన యమదొంగ సినిమా ఎలాంటి సక్సెస్ అయ్యిందో మనకు తెలిసిందే .ఈ సినిమాకు గాను ఈయనకు స్టార్ మా అవార్డు అందుకున్నారు అయితే ఈ అవార్డు ప్రముఖ నటుడు చిరంజీవి నాగార్జున చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. అయితే ఈ అవార్డును తీసుకున్న తారక్ ఇంట్లో పెట్టుకోకుండా వేరే హీరోకి పంపించారని తెలుస్తోంది.

ఇలా స్టార్ హీరో చిరంజీవి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకున్నటువంటి ఈయన వేదికపై మాట్లాడుతూ తాను చిన్నప్పటినుంచి చిరంజీవి గారు నాగార్జున బాబాయ్ సినిమాలను చూస్తూ తాను పెరిగానని తెలిపారు. ఇక ఈవెంట్ జరుగుతున్న నేపథ్యంలో సీనియర్ నటుడు శోభన్ బాబు మరణించారనే వార్త తెలియడంతో తనకు వచ్చిన ఈ అవార్డు శోభన్ బాబు గారి ఇంట్లో ఉండాలని నిర్ణయం తీసుకున్న ఎన్టీఆర్ ఆ అవార్డును తన ఇంటికి పంపించారు.

Advertisement

శోభన్ బాబు ఇంటికి..
ఆ క్షణం ఎన్టీఆర్ తీసుకున్న ఆ నిర్ణయానికి చిరంజీవి సైతం ఫిదా అవ్వడమే కాకుండా ఎన్టీఆర్ పై ప్రశంశల వర్షం కురిపించారు. ఇక ఎన్టీఆర్ ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ఈయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Advertisement
Continue Reading

Featured

YS Sharmila: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన షర్మిల.. కారణం అదేనా?

Published

on

YS Sharmila: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల కలిశారు. ఇటీవల హైదరాబాద్ లోనే ఉంటున్న ఈమె తెలంగాణ ముఖ్యమంత్రిని కలవడమే కాకుండా తన తండ్రి జయంతి వేడుకలకు హాజరు కావాల్సిందిగా ఆమె తనకు ఆహ్వానం అందజేశారు. జులై 8వ తేదీ దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి అనే సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈసారి వైయస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించబోతున్నట్లు తెలుస్తుంది. ఇన్ని రోజులపాటు జగన్మోహన్ రెడ్డి షర్మిల ఎవరికి వారు వైయస్సార్ ఘాట్ వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేసి తన తండ్రికి నివాళులు అర్పించేవారు.

ఇటీవల జగన్మోహన్ రెడ్డి నుంచి షర్మిల దూరంగా వెళ్లడమే కాకుండా ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడంతో ఈసారి జరగబోయే జయంతి వేడుకలను షర్మిల ఘనంగా జరిపించడమే కాకుండా కాంగ్రెస్ పెద్దలను కూడా ఆహ్వానిస్తున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి జూలై 8వ తేది విజయవాడలోని CK కన్వెన్షన్ సెంటర్ లో జరిగే రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలకు హాజరుకావాలని ఆహ్వానించారు.

Advertisement

ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు..

జులై 8వ తేదీ జరగబోయే ఈ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ , లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ , జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్, ఇతర AICC పెద్దలతో పాటు .. ఏపి, తెలంగాణ,కర్ణాటక రాష్ట్రాల నాయకులు, ప్రముఖులు హాజరు కానున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!