Connect with us

Featured

Pawan Kalyan: నాకు ఈ లైఫ్ ఇచ్చింది అల్లు అరవింద్ గారే… డిప్యూటీ సీఎం కామెంట్స్ వైరల్!

Published

on

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ కు మెగా కుటుంబ సభ్యులతో పాటు సినిమా ఇండస్ట్రీ మొత్తం మద్దతు తెలుపుతూ ఆయన విజయానికి కారణమయ్యారు. కానీ అల్లు అర్జున్ మాత్రం పవన్ కళ్యాణ్ కే కాకుండా వైకాపా నాయకుడు తన స్నేహితుడికి మద్దతు తెలిపారు. దీంతో ఇరువురి మధ్య తారాస్థాయికి విభేదాలు చేరుకున్నాయి.

Advertisement

ఇలా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య విభేదాలు రావడంతో మెగా అభిమానులు సైతం అల్లు అర్జున్ పట్ల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక చిరంజీవి లేకపోతే అల్లుఅర్జున్ అనే వ్యక్తి లేడు అంటూ మెగా అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు అసలు అల్లు రామలింగయ్య అనే వ్యక్తి లేకపోతే చిరంజీవి ఎక్కడో ఉండేవారు అంటూ కూడా ఘాటుగానే తిరిగి సమాధానం ఇస్తున్నారు.

ఇలా ఈ రెండు కుటుంబాల మధ్య రోజు రోజుకు తారా స్థాయిలో వివాదాలు ముదిరిపోతున్న తరుణంలోనే అల్లు అర్జున్ అభిమానులు గతంలో పవన్ కళ్యాణ్ అల్లు అరవింద్ గురించి మాట్లాడిన వ్యాఖ్యలకు సంబంధించిన ఒక వీడియోని వైరల్ చేస్తున్నారు. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తనకు ఇంత మంచి జీవితాన్ని కల్పించిన వారిలో ముఖ్యంగా తన తల్లిదండ్రులు కీలకపాత్ర పోషించారని అలాగే తన అన్నయ్య కూడా కారణమని తెలిపారు.

అల్లు అరవింద్ గారు అవకాశం ఇచ్చారు..
వీరి తర్వాత అల్లు అరవింద్ గారు వల్లే తన జీవితం ఇలా ఉందని తెలిపారు. ఆయన రెండు సినిమాలలో నాకు అవకాశం కల్పించారు అంటూ అల్లు అరవింద్ గురించి గొప్పగా మాట్లాడుతున్న వీడియోని వైరల్ చేస్తున్నారు. మరి ఈ వీడియో పై మెగా ఫాన్స్ రియాక్షన్ ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Featured

Samantha: పెళ్లి ఫోటోలను షేర్ చేస్తూ షాక్ ఇచ్చిన సమంత.. పెళ్లి ఎవరిదో తెలుసా?

Published

on

Samantha: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో నటి సమంత ఒకరు. ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతూ ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను అభిమానులను సొంతం చేసుకున్న ఈమె నటుడు నాగచైతన్యను ప్రేమించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరి వైవాహిక జీవితం కొద్దిరోజుల పాటు ఎంతో సంతోషంగా సాగింది.

Advertisement

నాగచైతన్యతో మూడు సంవత్సరాలు పాటు ఎంతో సంతోషంగా ఉన్న సమంత వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకుని దాదాపు మూడు సంవత్సరాలు అవుతుంది అయితే నాగ చైతన్య మాత్రం మరోసారి పెళ్లికి సిద్ధమయ్యారు ఈయన నటి శోభితతో పెళ్లికి సిద్ధమయ్యారు ఇప్పటికే వీరిద్దరి నిశ్చితార్థం కూడా జరిగింది కానీ సమంత మాత్రం ఇప్పటికే సింగిల్గానే ఉన్నారు.

సమంత ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచించకుండా పూర్తిగా కెరియర్ పైన ఫోకస్ పెట్టారు. ఇక సమంత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ నిత్యం తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈమె తాజాగా తన ఇంట జరిగిన పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు.
సమంత సోదరుడు..
సమంత అన్నయ్య డేవిడ్ వివాహం నికోలయ్ అనే విదేశీ యువతితో ఎంతో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన అన్నయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ పెళ్లి వేడుకలలో సమంత చాలా స్టైలిష్ లుక్ లో కనిపించి సందడి చేశారు. ఇక ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Pawan Kalyan: తిరుపతి లడ్డు అపవిత్రం…11 రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్షలో పవన్ కళ్యాణ్!

Published

on

Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ మరోసారి దీక్ష తీసుకున్నారు. ఈయన 11 రోజులపాటు ఈ ప్రాయశ్చిత్త దీక్షలో ఉండబోతున్నారని తెలుస్తుంది. నేడు ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలోని అర్చకుల సమక్షంలో ఈయన దీక్ష తీసుకున్నారు.

Advertisement

ఆలయ అర్చకులు ఈయన చేతికి దీక్షా కంకణం కట్టి దీక్షను ప్రారంభించారు. పవన్ కళ్యాణ్ ఈ దీక్షను 11 రోజులపాటు చేయబోతున్నారని తెలుస్తుంది. ఇలా 11 రోజుల తర్వాత ఈ దీక్షను విరమించబోతున్నారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ దీక్ష తీసుకోవడానికి గల కారణం తిరుపతి లడ్డు అపవిత్రం కావడమేనని తెలుస్తోంది.

గత ప్రభుత్వం తిరుపతి లడ్డు తయారీలో ఆవు నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు నుంచే ఉపయోగించిన నూనేను కలిపి ప్రసాదంగా తయారు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా ఈ విషయంపై ప్రస్తుత ప్రభుత్వం తీవ్రస్థాయిలో మండిపడుతూ వైకాపా నేతలపై వైకాపా ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వారాహి అమ్మవారి దీక్ష..
ఇలా నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన నూనె ఉపయోగించడంతో తిరుమల లడ్డు అపవిత్రం అయిందని, అందుకే పవన్ కళ్యాణ్ ప్రాయశ్చితం దీక్ష కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. 11 రోజులపాటు ఈ దీక్ష పూర్తి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకోబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఇలా దీక్ష తీసుకోవడం సర్వసాధారణం. ఈయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. ప్రస్తుతం మరోసారి దీక్ష కొనసాగిస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్..హింట్ ఇచ్చిన తమన్ సంతోషంలో అభిమానులు!

Published

on

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ (Ramcharan Tej) చివరిగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్టార్ హీరోగా పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఈ సినిమా తర్వాత ఈయన మరో స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) డైరెక్షన్లో పాన్ ఇండియా సినిమాకు కమిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అంతేకాకుండా ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి అప్డేట్స్ లేకపోవడంతో అభిమానులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు.

Advertisement

ఎన్నో సందర్భాలలో దర్శక నిర్మాతలను ట్యాగ్ చేస్తూ అభిమానులు ఈ సినిమా గురించి అప్డేట్స్ అడిగినప్పటికీ ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే తాజాగా డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్(SS Thaman) రామ్ చరణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ సినిమా విడుదల గురించి క్లారిటీ ఇవ్వడమే కాకుండా సినిమాకు సంబంధించిన వరుస ఈవెంట్స్ జరుగుతాయని అభిమానులు రెడీగా ఉండాలి అంటూ ఈయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.

గేమ్ ఛేంజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వర్క్ అక్టోబర్ 1 నుంచి మొదలు కానుంది. సినిమా డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. వచ్చే వారం నుంచి డిసెంబర్ 20 వరకు గేమ్ ఛేంజర్ సినిమాకు వరుసగా ఈవెంట్స్, సినిమా నుంచి వరుసగా అప్డేట్స్ ఉంటాయి. రెడీ గా ఉండండి. వచ్చేవారమే ఈ సినిమా నుంచి మరో అప్డేట్ రాబోతుంది అంటూ ఈయన వెల్లడించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా నిర్మాత దిల్ రాజు(Dil Raju) క్రిస్మస్ పండుగ సందర్భంగా ఈ సినిమా విడుదలవుతుందని చెప్పిన తేదీ మాత్రం చెప్పలేదు. కానీ తమన్ మాత్రం 20వ తేదీ విడుదల కాబోతుందని చెప్పకనే చెప్పారు అయితే ఈ విడుదల తేదీ గురించి త్వరలోనే అధికారక ప్రకటన ఇవ్వనున్నారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!