రాజ్యసభలో జరిగిన దాడి గురించి చైర్మన్ వెంకయ్య నాయుడు ఎంపీలపై త్వరలో చర్యలు తీసుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అంతేకాక గత సంఘటన దృష్టిలో పెట్టుకొని చర్యల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ బాధ్యతను ప్రివిలేజ్ కమిటీ అప్పగిస్తారని తెలుస్తోంది. మీడియా ప్రతినిధులకు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ చైర్మన్ వెంకయ్య నాయుడు ఈ విషయాన్ని ప్రస్తావించారు.
కాగా ఉపరాష్ట్రపతిగా అధికార పార్టీతో పాటు విపక్షాల సమానంగా చూస్తానని.. రెండు కూడా తన కళ్ళ లాంటివని వెంకయ్య నాయుడు తెలిపారు. అంతేకాక సభా సజావుగా జరగడానికి ఇరు పక్షాలు సమిష్టి బాధ్యత వ్యవహరించాలని రాజ్యసభ చైర్మన్ పేర్కొన్నారు.
ABV: ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పై విశ్రాంత ఐఏఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇటీవల జగన్ నిర్వహించిన ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీరు గురించి విమర్శలు వర్షం కురిపించారు. సీఎం చంద్రబాబు కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్టు చేసేలా పోలీస్ శాఖను ప్రయోగిస్తున్నారన్నారు.
Advertisement
అరెస్టులపై సీఎం చంద్రబాబుకు సలహాలు ఇచ్చేందుకు ముగ్గురు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులు, నియమించారని ఈ సందర్భంగా జగన్ తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అధికారులైన ఏబీ వెంకటేశ్వరరావు, ఆర్పీ ఠాకూర్, యోగానంద్ పేర్లను ఉచ్చరించి ఏక వచనంతో జగన్ సంభోదించారు.
ఈ ముగ్గురు అధికారులు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నేతల చిట్టాను ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా తెప్పించుకుని పక్కా ప్రణాళికతో అరెస్టుల పర్వం సాగిస్తున్నట్లు ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఏబీ వెంకటేశ్వరరావు స్పందించి సోషల్ మీడియా వేదికగా జగన్ కి వార్నింగ్ ఇచ్చారు. మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో.. ముందు మీ మాట మీ భాష సరి చేసుకో. ఒకసారి ప్రజలలో విశ్వాసం కోల్పోయిన మాట జారిన వెనక్కి తిరిగి తీసుకురాలేము.
ABV: సంస్కారం లేకుండా..
నీలాగా సంస్కారం లేకుండా నేను మాట్లాడలేను నేనేంటి అనేది గత ఐదు సంవత్సరాల కాలంలో నువ్వు చూసావు. బి కేర్ఫుల్ అంటూ ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు ట్వీట్ చేశారు. మీరూ నన్ను ఉద్దేశిస్తూ చేసిన వ్యాఖ్యలలో ఏమాత్రం నిజం లేదని అది పూర్తిగా అబద్ధం అంటూ ఈయన క్లారిటీ ఇచ్చారు.
Posani: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంతో మంది వైకాపా కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తూ ఇతర పార్టీలలోకి వెళ్తున్న విషయం మనకు తెలిసిందే. ఇక కొంతమంది మాత్రం శాశ్వతంగా రాజకీయాలకు దూరంగా ఉండబోతున్నామని ప్రకటిస్తున్నారు. తాజాగా సినీ నటుడు రచయిత దర్శకుడు పోసాని కృష్ణమురళి సైతం రాజకీయాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసారు.
Advertisement
సినీ ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు తెలపడమే కాకుండా పార్టీ కార్యకలాపాలలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి ఈయనకి తెలుగు ఫిలిం డెవలప్మెంట్ చైర్మన్ గా బాధ్యతలను అప్పజెప్పారు. ఈ విధంగా ఈయన వైసీపీ పార్టీలో కొనసాగుతూ పవన్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పవన్ ఫాన్స్ ఏకంగా ఈయన ఇంటిపై కూడా దాడి చేశారు.
ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి పై చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోసానిపై కూడా కేసు నమోదు కావడంతో ఈయన స్పందించారు. తాను అనవసరంగా ఎవరిని తిట్టలేదు పవన్ కళ్యాణ్ అభిమానులు తన కుటుంబం పై దాడి చేయడంతోనే నేను కూడా విమర్శలు చేశాను అంటూ ఈయన చెప్పారు.
Posani: సినిమాలలో కొనసాగుతా..
ఇక తాజాగా తాను ఈ రాజకీయాలలో కొనసాగలేనని అందుకే తాను ఏ పార్టీలకు మద్దతు తెలియజేయకుండా పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని వెల్లడించారు. ఇక తాను ఇండస్ట్రీలో నటుడిగా దర్శకుడిగా రచయితగా కూడా కొనసాగాను. ఇకపై సినిమాలలో అవకాశాలు వస్తే నటిస్తానని లేకపోతే నేనే సినిమాలు చేస్తాను అంటూ కూడా ఈ సందర్భంగా పోసాని జగన్మోహన్ రెడ్డికి క్షమాపణలు చెబుతూ ఈయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు.
AnilKumar: ఏపీలో వైసీపీ ఘోరంగా ఓటమి పాలు కావడంతో ఎంతోమంది కీలక నేతలు అరెస్టుల భయంతో వైకాపా పార్టీ నుంచి బయటకు వస్తూ టిడిపి జనసేన పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే ఎంతోమంది కీలక నేతలు జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పేసారు. అయితే త్వరలోనే మరో మాజీ మంత్రి కూడా జగన్ కి షాక్ ఇవ్వబోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.
Advertisement
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా వైసీపీ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని ఈయన జనసేన పార్టీలో చేరబోతున్నారంటూ వార్తలు వస్తున్న తరుణంలో ఆయన స్పందించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వారి వ్యూస్ కోసం వారి ఛానల్ సక్సెస్ కోసం నా గురించి ఎన్నో రకాల వార్తలు రాశారో ఆ వార్తలపై నాకు ఎలాంటి అభ్యంతరం లేదు.
ఇలాంటి వార్తలు రాయటం వల్ల మీకు ఉపాధి కలుగుతుంది మీకు మంచి ఉద్యోగం వస్తుంది లేదా కొన్ని డబ్బులు వస్తాయి అనుకుంటే ఎలాంటి అభ్యంతరం లేకుండా వార్తలు రాసేసుకోండి. నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇక నేను జనసేనలోకి వస్తున్నానని వార్తలు రాసిన నాకు జనసేన నుంచి ఏ ఒక్కరు ఫోన్ చేయలేదు ఎందుకంటే వారికి తెలుసు. నేను ఏ పార్టీ మారనని.
ఇక తాను వైసీపీ పార్టీ కూడా కాదు. నేను మా బాస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. ఆయన ఏ పార్టీలో ఉంటే నేను కూడా అదే పార్టీలో ఉంటాను. ఎప్పుడూ ఆయన వెంటే నేనని తెలిపారు. ఇక ఈ ఐదు నెలల కాలంలో నేను మీడియా ముందుకు రాకపోవడానికి పూర్తిగా నా వ్యక్తిగత విషయాలే కారణమని తెలిపారు ఆ పనులలో ఉండటం వల్ల నేను బయటకు రాలేకపోయాను ఇప్పటినుంచి పార్టీ కార్యకలాపాలలో కొనసాగుతానని తెలిపారు.
Advertisement
AnilKumar: అరెస్టుకు భయపడేది లేదు..
ఇక కొంతమంది స్థానిక నేతలు నన్ను అరెస్టు చేయాలని ఎంతో ఎదురు చూస్తున్నారు. ఒక్కసారైనా తనని అరెస్టు చేస్తే శునకానందం పొందాలని భావిస్తున్నారు. నన్ను ఒక్కరోజు కాదు మీకు ఇష్టం వచ్చినన్ని రోజులు జైల్లో పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు. ముఖ్యమంత్రులే జైలుకు వెళ్లి వస్తున్నారు. నేనెంత అంటూ అనిల్ ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.