Connect with us

Political News

వైయస్ వివేకా కేసులో మరో ట్విస్ట్!

Published

on

మాజీ మంత్రి వైయస్ వివేకా కూతురు సునీత కడప ఎస్పీ కి లేఖ రాశారు. పులివెందులలో తమ ఇంటి వద్ద మణికంఠ రెడ్డి అనే వ్యక్తి రెక్కీ నిర్వహించాడని లేఖలో పేర్కొంది. తమ కుటుంబానికి ప్రాణహాని ముప్పు పొంచి ఉందని సునీత పేర్కొన్నారు.

మరో వైపు సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో అనుమానితులను విచారిస్తున్న సమయంలో సునీత లేఖ రాయడం పలు అనుమానితులను దారితీస్తోంది. రెక్కి నిర్వహించిన మణికంఠ రెడ్డి అనే వ్యక్తి.. వైకాపా నాయకుడు దేవిరెడ్డి శంకర్రెడ్డి అనుచరుడని సునీత తెలిపారు.

Advertisement

Featured

Pitapuram: ఒక్క పిఠాపురంలోని 500 కోట్ల బెట్టింగ్.. ఉత్కంఠత రేపుతున్న ఎన్నికల ఫలితాలు!

Published

on

Pitapuram: దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికల ఫలితాలు అందరిలోనూ ఎంతో ఆసక్తిని కలిగిస్తున్నాయి ఎప్పుడు లేని విధంగా ఈసారి ఏకంగా 81.86% పోలింగ్ నమోదు కావడంతో ఈ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలోనే జూన్ నాల్గవ తేదీ వెలవడే ఫలితాల కోసం అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎన్నికలలో భాగంగా పిఠాపురం మంగళగిరి కుప్పం ఈ మూడు నియోజకవర్గాలపైనే అందరి ఫోకస్ ఉంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ఫలితాలపై రాజకీయ నాయకులు అటు సినీ సెలబ్రిటీలు కూడా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ దిగగా ఈయనకు ప్రత్యర్థిగా వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి అదే కాపు సామాజిక వర్గానికి చెందిన వంగ గీత ఎన్నికల బరిలోకి దిగారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు జనసైనికులు. మరోవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి వంగా గీత గెలిస్తే తనుకు డిప్యూటీ సీఎం గా పదవి ఇస్తానని చెప్పారు దీంతో ఈమె గెలుపు పై కూడా ఆసక్తి నెలకొంది.

Advertisement

ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠత..
ఈ క్రమంలోనే వంగా గీత గెలుస్తారని గెలుస్తారు అంటూ రెండు పార్టీల నేతలు పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నారు. అయితే కేవలం పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి పై మాత్రమే కాకుండా పార్లమెంట్ అభ్యర్థిపై కూడా సుమారు 500 కోట్ల వరకు బెట్టింగ్ జరిగిందని తెలుస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బెట్టింగులు కడుతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికల ఫలితాలపై తీవ్ర ఉత్కంఠత నెలకొంది.

Advertisement
Continue Reading

Featured

AP Politics: కుప్పం ఫలితం పై తీవ్ర ఉత్కంఠత.. భారీగా నడుస్తున్న బెట్టింగులు?

Published

on

AP Politics: ఎప్పుడు లేని విధంగా ఏపీ రాష్ట్ర రాజకీయాలు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతున్నాయి. మే 13వ తేదీ ఎన్నికలు పూర్తి అయ్యాయి. ఎన్నికల ఫలితాలను జూన్ 4వ తేదీ విడుదల చేయనున్న నేపథ్యంలో అందరి ఆసక్తి ఏపీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. పెరిగిన ఓటింగ్ శాతంతో కూటమి నేతలు తమదే విజయం అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ నేతలు సైతం జగన్ పరిపాలన నచ్చి ప్రజలందరూ మరోసారి ఆయనకు పట్టం కట్టడానికే ఓట్లు వేయడానికి ముందుకు వచ్చారని చెబుతున్నారు.

ఈ విధంగా రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో ఉత్కంఠత నెలకొన్నటువంటి సమయంలో రాష్ట్ర ప్రజలందరి చూపు కుప్పం నియోజకవర్గ పైనే ఉంది. కుప్పం నియోజకవర్గంలో నుంచి ఇప్పటివరకు ఏడుసార్లు పోటీ చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు ఏడుసార్లు అఖండమైన మెజారిటీతో గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. ఇక ఎనిమిదో సారి కూడా అదే మెజారిటీ సాధించాలనే దిశగా ఆయన ప్రయత్నాలు చేశారు.

ఇకపోతే అధికార వైసిపి పార్టీ కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓటమి లక్ష్యంగా పనిచేస్తుంది. గత చంద్రబాబు నాయుడు పాలనలో ఎప్పుడు కూడా కుప్పానికి చేయని అభివృద్ధి సంక్షేమం జగన్ సమక్షంలో జరిగింది. దీంతో ఈసారి కుప్పం ప్రజలందరూ కూడా వైసీపీకే పట్టం కట్టాలని భావిస్తున్నారు. ఈ తరుణంలోనే కుప్పం ఫలితాలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

Advertisement

బాబు ఓటమి లక్ష్యంగా..
కుప్పంలో వైసిపి తరఫున పోటీ చేసిన ఎమ్మెల్సీ భరత్ గెలుస్తారని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. మరోవైపు చంద్రబాబు గెలుస్తారని ప్రతిపక్ష పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ క్రమంలోనే బెట్టింగులు కూడా భారీ స్థాయిలో నడుస్తున్నాయి. బాబు లక్ష మెజారిటీతో గెలుస్తారని బెట్టింగులు కట్టగా బాబు ఓటమి లక్ష్యంగా మరోవైపు బెట్టింగులు నడుస్తున్నాయి. ఇలా మొత్తానికి కోట్లలో బెట్టింగులు నడవడంతో అందరి ఆసక్తి కుప్పం పైన ఉందని చెప్పాలి.

Advertisement
Continue Reading

Featured

Tadipatri: తాడిపత్రిని వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయిన జేసీ దివాకర్ రెడ్డి.. గొడవలే కారణమా?

Published

on

Tadipatri: తాడిపత్రి కేరాఫ్ జేసీ బ్రదర్స్ అనే విధంగా ఇన్ని రోజులు ఉండేది. అక్కడ వారు చెప్పిన మాటే శాసనం అయితే గత ఐదు సంవత్సరాలుగా వీరి మాటకు విలువ లేకుండా పోయింది. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేసీ బ్రదర్స్ అరాచకాలు పూర్తిగా తగ్గిపోయాయి. అయితే గత ఎన్నికలలో భాగంగా జేసీ వర్గీయులు అలాగే పెద్దారెడ్డి వర్గీయుల మద్యం పెద్ద ఎత్తున గొడవలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఈ గొడవలలో భాగంగా ఇరువురి అనుచరులు రాళ్లదాడి బాంబుల దాడి చేసుకున్నారు అయితే ఈ గొడవలను సర్దుమనగడం కోసం పోలీసులు దివాకర్ రెడ్డి ఇంట్లో పని చేస్తున్నటువంటి పని వాళ్ళను కూడా అరెస్టు చేశారు అయితే దివాకర్ రెడ్డి భార్యతో పాటు తన అక్క కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మంచంపై ఉన్నారు కనీసం వారికి తిండి పెట్టి మందులు ఇచ్చేవారు కూడా లేకపోవడంతో జెసి పవన్ రంగంలోకి దిగారు.

ఈ క్రమంలోనే పోలీసులతో ఆయన మాట్లాడి వారి ఇంట్లో పని చేసే వారిని విడిపించాలని కోరారు. అది కుదరదని పోలీసులు చెప్పారు మీరు కూడా బయటకు రాకూడదని ఒకవేళ తిరిగితే చర్యలు తీసుకోక తప్పదని పోలీసులు హెచ్చరించడంతో చేసేదేమీ లేక జెసి దివాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల మొత్తం తాడిపత్రి వదిలి హైదరాబాద్ వెళ్ళిపోయారు.

Advertisement

144 సెక్షన్ అమలు…

ఇలా తాడిపత్రిలో చోటు చేసుకున్నటువంటి గొడవల కారణంగానే వీరు చివరికి తాడిపత్రి వదిలి వెళ్లాల్సిన పరిస్థితులు ఎదురయ్యాయి. ఇకపోతే జేసీ దివాకర్ రెడ్డి వర్గీయులు మాత్రం తాడిపత్రిలో పూర్తిగా రెచ్చిపోయి దాడులకు పాల్పడటంతో తాడిపత్రి పట్టణం మొత్తం 144 సెక్షన్ అమలు చేశారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!