Connect with us

Featured

Indraja : పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లాగా కూర్చోవడం అంటే నాకు ఇష్టం.. కానీ అక్కడ అలా కూర్చోకూడదన్నారు. : ఇంద్రజ

Published

on

Indraja : కర్ణాటక సంగీత విద్వాంసులు కుటుంబములో పుట్టిన ఇంద్రజ మంచి గాయని కూడా.ఈమె ముగ్గురు అక్క చెళ్లెల్లలో పెద్దది. భారతి, శోభ ఈమె చెల్లెళ్లు. ఆమె అసలు పేరు రజతి. పాఠశాలలో కూడా రజతి అనేక సంగీత, నాటక పోటీలలో పాల్గొని బహుమతులు అందుకొన్నది. శాస్త్రీయ నాట్యములో శిక్షణ పొందిన ఈమె మాధవపెద్ది మూర్తి వద్ద కూచిపూడి నృత్యరీతులు అభ్యసించింది. ఈమె మూర్తి బృందముతో పాటు పర్యటించి విదేశాలలో ప్రదర్శనలు ఇచ్చింది.

Advertisement

ఇంద్రజ తొలిసినిమా జంతర్ మంతర్ అయితే యస్వీ కృష్ణారెడ్డి ఆలీ హీరోగా తీసిన యమలీల ముందుగా విడుదలై పెద్ద విజయం సాధించింది. యమలీల తర్వాత ఇంద్రజ రెండు సంవత్సరాల్లో 30కి పైగా సినిమాలలో హీరోయిన్ గా నటించింది. గుణశేఖర్ తీసిన “సొగసు చూడతరమా” సినిమాలో ఇంద్రజ నటన పలువురు విమర్శకుల ప్రశంసలందుకున్నది. ఈమె మలయాళ చిత్రరంగములో అనేక అగ్రశ్రేణి కథానాయకుల సరసన నటించి పేరు తెచ్చుకున్నది.

అయితే ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇంద్రజ మాట్లాడుతూ.. యమలీల చిత్రం విజయవంతం తర్వాత ‘అమ్మ దొంగా’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. అలా సెట్ లోకి వెళ్ళినప్పుడు దర్శకుడు సాగర్ ఓ ఈ అమ్మాయా చాలా చిన్న వయసు అని అన్నారు. ఏంటో నాకు అర్థం కాలేదు. అలా అనడంతో.. తిరిగి ఇంటికి వెళ్లి పోయాను. మళ్ళీ ఆ బ్యానర్ నుంచి ఫోన్ వచ్చింది. నాకు హీరోయిన్ గా ఆ సినిమాలో అవకాశం ఉందని సంతోషపడ్డాను. ఆ క్రమంలో నేను చెన్నై క్రిస్టియన్ స్కూల్లో చదవడం మూలంగా కాలు మీద కాలు వేసుకోవడం అలవాటు అయిపోయింది. అప్పుడు అమ్మ దొంగా సినిమా షూటింగ్ విరామంలో.. కాలు మీద కాలు వేసుకుంటే అలా వేయకూడదని అనేవారు.

కానీ హీరో కృష్ణ నేను కాలు మీద కాలు వేసుకున్న, నేను ఎలా కూర్చున్న ఆయన ఏమనేవారు కాదు. నేను గుడ్ మార్నింగ్ చెప్పిన, గుడ్ ఈవినింగ్ చెప్పిన ఆయన తల ఊపేవారు కానీ ఏం మాట్లాడేవారు కాదు, నా యాక్టింగ్ బాగోలేదని ఆయన అలా అంటున్నారని నేను అనుకున్నాను. షూటింగ్ అయిపోయి ఇంటికెల్లాకా బాగా ఏడ్చాను. సెట్ లో కృష్ణ గారు అలానే ఉంటారని అందరూ అనేవారు. అలా మెల్లిగా షూటింగ్ కు వెళుతుండడంతో.. ఆయన గురించి అర్థమైంది. హీ ఈజ్ సచ్ ఏ నైస్ పర్సన్ అని ఇంద్రజ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Venu Swamy: మళ్లీ మొదలుపెట్టిన వేణు స్వామి.. అల్లు అర్జున్ జాతకం పై సంచలన వ్యాఖ్యలు!

Published

on

Venu Swamy: ప్రముఖ సినీ నటుడు అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా చూసిన అనంతరం వేణు స్వామి మరోసారి అల్లు అర్జున్ జాతకం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వరుసగా సెలబ్రిటీల గురించి వారి జాతకాలను చెబుతూ సోషల్ మీడియా వార్తలలో సంచలనగా మారిన వేణు స్వామి గత కొద్ది రోజులుగా సెలబ్రిటీల జాతకాలను చెప్పడం పూర్తిగా మానేశారు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈయన ఎలాంటి వీడియోలను షేర్ చేయలేదు.

Advertisement

వేణు స్వామి ఇటీవల కాలంలో చెప్పిన జాతకాలు నిజం కాకపోవడంతో ఈయన పై భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి అలాగే నాగచైతన్య శోభిత విషయంలో ఈయన చెప్పిన జాతకం కారణంగా ఎన్నో వివాదాలు చోటు చేసుకోవడంతో వేణు స్వామి సెలబ్రిటీల జాతకాలను చెప్పడం మానేశారు .అయితే మరోసారి ఈయన సెలెబ్రెటీల జాతకాలని చెబుతూ వార్తలలో నిలిచారు.

పుష్ప 2 సినిమాని తాను చూసి వచ్చానని ముఖ్యంగా జాతర సీన్లు అల్లు అర్జున్ చాలా అద్భుతంగా నటించారు అంటూ వేణు స్వామి తెలిపారు. అయితే గతంలో తాను అల్లు అర్జున్ జాతకం గురించి పలు ఇంటర్వ్యూలలో పలు యూట్యూబ్ ఛానల్ వీడియోలలో చెప్పిన వ్యాఖ్యలకు సంబంధించిన కొన్ని క్లిప్స్ కూడా షేర్ చేశారు అయితే ఈ వీడియోలలో ఈయన అల్లు అర్జున్ జాతకం ఎంతో అద్భుతంగా ఉందని తెలిపారు.

Venu Swamy: పదేళ్లు తిరుగులేదు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ హీరోగా అల్లు అర్జున్ పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకుంటారని మరో పదేళ్లపాటు ఈయనకు ఇండస్ట్రీలో తిరుగులేదని ఈయన తెలియజేశారు. ఇక అల్లు అర్జున్ సినిమాలను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు కానీ అలాగే ఈయనతో సినిమాలు చేసిన నిర్మాతలు కానీ ఎవరు నష్టపోరని వేణు స్వామి గతంలో అల్లు అర్జున్ జాతకం గురించి చెప్పిన వీడియోలు షేర్ చేయడంతో ఇవి కాస్త సంచలనంగా మారాయి. ఇలా అల్లు అర్జున్ జాతకం మంచిగా ఉందని చెప్పడంతో అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Continue Reading

Featured

Pushpa 2: పుష్ప 2 సినిమా చూసిన వేణు స్వామి భార్య వీణవాణి.. ఆమె రియాక్షన్ ఏంటో తెలుసా?

Published

on

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా మూడు రోజులకు గాను 600కు పైగా కలెక్షన్స్ రాబట్టినట్టు ఇటీవల మేకర్స్ అధికారక పోస్టర్ వెల్లడించారు. ఇకపోతే ఈ సినిమా కోసం అభిమానుల నుంచి మొదలుకొని ఎంతోమంది సినీ సెలెబ్రిటీలు క్యూ కడుతున్న విషయం తెలిసిందే.

Advertisement

ఈ క్రమంలోనే ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి సతీమణి వీణా వాణి కూడా ఈ సినిమాని చూశారు ఇక ఈ సినిమా చూసిన ఈమె తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. ఈ సందర్భంగా వీణా వాణి ఒక వీడియోని విడుదల చేస్తూ తాను ఇప్పుడే పుష్ప 2 సినిమా చూసి వచ్చానని తెలిపారు.

ఆ ట్రాన్స్ లో ఉన్నప్పుడు మాట్లాడితేనే మాటలు బాగా వస్తాయి. నాకు ఏదైనా నచ్చిన నచ్చకపోయినా సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకోవడం అలవాటు.కళామతల్లి ఆశీస్సులు అల్లు అర్జున్ పై ఉన్నాయి. ఈ సినిమాలో నేను ఆయన నటన విశ్వరూపం చూశాను కళామతల్లి ఆశీస్సులు ఉంటే తప్ప ఇలాంటిది సాధ్యం కాదు అల్లు అర్జున్ గారు మీకు తిరుగులేదు.

Pushpa 2: దిష్టి తీయించుకోండి..

ఒక 100 గుమ్మడికాయల దిష్టి తీయించుకోండి అంటూ ఏమీ అల్లు అర్జున్ నటించిన కురిపించారు. ఇక సుకుమార్ గురించి కూడా ఈమె తెలియజేశారు. సుకుమార్ గారు.. అంత సింపుల్ గా, ఇన్నోసెంట్ గా ఉండి.. ఎలా తీశారు ఈ మూవీని. ఆ ట్విస్టులు.. ఆ సీక్వెన్సులు.. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అన్న మాట మీలాంటి వారిని చూసే అంటారేమో! నా జీవితంలో మొదటిసారి అప్పుడే అయిపోయిందా? అనిపించింది. ఇంకా చూడాలనిపించింది. అల్లు అర్జున్ గారు రెండో నేషనల్ అవార్డు అందుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి అంటూ ఈమె చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading

Featured

Mohan Babu: మంచు మనోజ్ పై దాడి చేసిన మోహన్ బాబు.. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు!

Published

on

Mohan Babu: మంచు కుటుంబంలో ఆస్తి వివాదాలు చోటుచేసుకున్నాయి అంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆస్తి విషయంలో మోహన్ బాబు తన పెద్ద కుమారుడు మంచు విష్ణుకు సపోర్టుగా ఉన్నారని ఈ విషయంలో మంచు విష్ణు మనోజ్ మధ్య తరచూ విభేదాలు కూడా ఉన్నాయి అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

Advertisement

ఇలా మంచి విష్ణు మనోజ్ మధ్య ఆస్తి విషయంలో గతంలో ఓసారి బహిరంగంగా కొట్టుకున్న విషయం మనకు తెలిసిందే .ఇలా వీరిద్దరూ గొడవ పడటంతో ఇది కాస్త సినీ ఇండస్ట్రీలో చర్చలకు కారణం కావడంతో మంచు విష్ణు మాత్రం ఇది ఒక రియాలిటీ షో అంటూ కవర్ చేసే ప్రయత్నం చేసిన వీరి ఇంట్లో ఆస్తి వివాదాలు ఉన్నాయనీ మాత్రం స్పష్టమవుతుంది.

మంచు విష్ణు ఎక్కడా కూడా మనోజ్ ప్రస్తావన తీసుకురాడు. ఇక మనోజ్ కూడా మంచు విష్ణు గురించి ఎక్కడ చెప్పకపోవడంతో వీరి మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా తాజాగా ఆస్తి విషయంలో ఈ కుటుంబంలో మరోసారి విభేదాలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది. స్కూల్ కి సంబంధించి ఆస్తుల విషయంలో మోహన్ బాబు మనోజ్ పై తన భార్యపై దాడి చేశారని దీంతో వీరిద్దరూ ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Mohan Babu: ఆస్తి విభేదాల…

ఇలా మోహన్ బాబు మనోజ్ పై చేయి చేసుకున్నటువంటి ఘటనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో మోహన్ బాబు పిఆర్ టీమ్ స్పందించింది. సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ గురించి వస్తున్న వార్తలన్నీ పూర్తిగా వాస్తవని ఇందులో నిజం లేదు అంటూ ఈ వార్తలను కొట్టి పారేసారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!