Nayanthara-Vignesh: పెళ్లి కాలేదు కానీ..అన్నీ జరిగిపోతున్నాయిగా..!

Nayanathara -Vignesh Shivan: పిల్లల విషయంలో క్లారిటీ ఇవ్వాలి..నయన్ దంపతులకు నోటీసులు జారీ చేసిన ప్రభుత్వం?

Nayanathara -Vignesh Shivan: నయనతార విగ్నేష్ దంపతులు పెళ్లయినప్పటి నుంచి ఏదో ఒక వివాదం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.తాజాగా ఈ దంపతులు కవల పిల్లలకు జన్మనిచ్చామంటూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో ఈ వ్యవహారం కాస్త తీవ్ర వివాదంగా మారింది.నయనతార దంపతులు కవలలకు జన్మనిచ్చామని సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈమె ప్రెగ్నెంట్ అయిన దాఖలాలు కూడా లేవు అలాగే తను పెళ్లి చేసుకొని నాలుగు నెలలు మాత్రమే అయింది. ఇలా పిల్లలకు జన్మనివ్వడం ఎలా సాధ్యమైంది అంటూ కామెంట్ చేశారు.

Nayanthara-Vignesh: పెళ్లి కాలేదు కానీ..అన్నీ జరిగిపోతున్నాయిగా..!

అయితే నయనతార విగ్నేష్ పెళ్లికి ముందే సరోగసి విధానం ద్వారా పిల్లలను ప్లాన్ చేసినట్టు స్పష్టం అవుతుంది.ఇక ఈ విషయంపై నటి కస్తూరి 2022 నుంచి ఇండియాలో సరోగసి విధానాన్ని బ్యాన్ చేశారంటూ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపింది.ఇలా ఈమె నయనతార విగ్నేష్ పేర్లు ప్రస్తావించకపోయిన వారి గురించే ఇలాంటి ట్వీట్ చేశారనీ అభిమానులు మండిపడ్డారు.

ఇకపోతే ఈ విషయంపై ఏకంగా తమిళనాడు ప్రభుత్వం కూడా స్పందించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.సాధారణంగా సరోగసి విధానం ద్వారా పిల్లలకు జన్మనివ్వలంటే వారి పెళ్లి జరిగే ఐదు సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి అలాగే పిల్లలు కోసం దంపతులలో ఎవరికైనా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే డాక్టర్ల ధ్రువీకరణ పత్రంతో సరోగసి విధానంలో పిల్లలను కనడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు.

Nayanathara -Vignesh Shivan: నయనతార దంపతులు నిబంధనలను పాటించారా…

కానీ నయనతార విగ్నేష్ పెళ్లి జరిగి కేవలం నాలుగు నెలలు మాత్రమే అయింది. ఈ క్రమంలోనే వారు ఎలాంటి దృవీకరణ పత్రాన్ని సమర్పించకపోవడంతో ఈ విషయంపై తమిళనాడు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి స్పందిస్తూ పిల్లలు విషయంలో ప్రభుత్వానికి క్లారిటీ ఇవ్వాలని నోటీసులు జారీ చేయడమే కాకుండా ఈ విషయంపై స్పెషల్ ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసింది.ఈ ఎంక్వైరీలో భాగంగా నయనతార దంపతులది తప్పు అని తెలిస్తే పెద్ద ఎత్తున ఈ దంపతులకు శిక్ష పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలుస్తోంది.