హాలీవుడ్ నటీనటులు మన భారత దేశ చలన చిత్రాల్లో చాలా తక్కువగా నటిస్తారు. చాలా అంటే చాలా తక్కువగా తెలుగు వెండితెరపై హాలీవుడ్ నటీనటులు కనపడతారు. అయితే 33 ఏళ్ల క్రితమే హాలీవుడ్ కి చెందిన వ్యక్తిని తెలుగు వెండి తెరకు పరిచయం చేశాడు టాలీవుడ్ దర్శకుడు జంధ్యాల. అవును, 1987 సంవత్సరంలో నిర్మించిన పడమటి సంధ్యారాగం సినిమాలో విజయశాంతికి ప్రేమికుడిగా, ఆపై భర్త గా నటించి మెప్పించాడు ఆ హాలీవుడ్ నటుడు. ఇక ఆయన పేరేంటి, అతడు ఏ ఏ సినిమాలో నటించాడు అన్న విషయం చూస్తే…

ఆ హాలీవుడ్ వ్యక్తి పేరు థామస్ జేన్… ఈయన ఫిబ్రవరి 22, 1969 న జన్మించాడు. జేన్ జంధ్యాల దర్శకత్వం వహించిన పడమటి సంధ్యా రాగం (1987) తో తన నటనా జీవితాన్ని ప్రారంభించాడు. ఇక ఆ తర్వాత ది హస్ట్లర్ ఇన్ ఐల్ లవ్ యు ఫరెవర్, టునైట్ (1992), జెఫ్ ఇన్ బఫీ ది వాంపైర్ స్లేయర్ (1992), బిల్లీ ఇన్ నెమెసిస్ (1992), సిటీ ఆఫ్ ఏంజిల్స్ (1996), బూగీ నైట్స్ (1997), ది థిన్ రెడ్ లైన్ (1998), థర్స్ డే (1998), మాగ్నోలియా (1999) తో సహా పలు చిత్రాలలో ఆయన సహాయక పాత్రలు పోషించారు.

అయితే ఆ తర్వాత బేస్ బాల్ ఆటగాడిగా విమర్శకుల ప్రశంసలు పొందిన తరువాత 61 సినిమాలో మిక్కీ మాంటిల్, దక్షిణాఫ్రికా చిత్రం స్టాండర్ (2003) లో ఆండ్రీ స్టాండర్ తో ప్రారంభమైన ప్రధాన పాత్రల ఆఫర్లను అందుకున్నాడు. వీటితో అతని నటన తో విమర్శకుల నుండి ప్రశంసలను పొందాడు. టెలివిజన్ పాత్రలలో చిత్రం 61 * (2001) లో మిక్కీ మాంటిల్, HBO లో వచ్చిన సిరీస్ హంగ్ (2009–2011) మరియు సిఫై అమెజాన్ వీడియో సిరీస్‌లలో నటించారు. అంతేకాదు అతను రా స్టూడియోస్ అనే వినోద సంస్థ స్థాపకుడు, అతను రాసిన కామిక్ పుస్తకాలను విడుదల చేయడానికి దానిని ఉపయోగిస్తాడు. వాటిలో మొదటిది బాడ్ ప్లానెట్. క్రైమ్ థ్రిల్లర్ డార్క్ కంట్రీ (2009) చిత్రానికి ఆయన దర్శకత్వం వహించారు, అంతేకాదు అందులో అతను కూడా నటించాడు.

ఇక ఈయనకు అవకాశాలు లేని రోజుల్లో జంధ్యాల ఒక అమెరికన్ వ్యక్తిని హీరోగా పెట్టాలి అన్న ఆశతో ఆయనను హీరోగా తీసుకున్నారు. అప్పటివరకు ఆయనకు ఎలాంటి అవకాశాలు లేవు. చివర అతనికి ఉండడానికి ఇల్లు కూడా లేదు. కార్ షెడ్ లో నిద్రపోయేవాడు. ఇక ఈయన పర్సనల్ విషయానికి వస్తే… జేన్ 1989 లో రట్జర్ హౌర్ కుమార్తె నటి ఐషా హౌర్‌ను వివాహం చేసుకున్నాడు . 1995 లో విడాకులు తీసుకునే ముందు ఈ జంట కలిసి అనేక చిత్రాలలో నటించారు. ఇక ఆ తర్వాత జేన్, ఆర్క్వెట్టి ని జూన్ 25, 2006 న వివాహం చేసుకున్నాడు. ఈమెతో కూడా 2011 లో విడిపోయాడు. ఈయనకు ఒక పాపా కూడా ఉంది. ఆ అమ్మాయి పేరు హార్లో ఒలివియా.

ఇక ఈయన పడమటి సంధ్యారాగం సినిమాలో నటించినందుకు 25వేల పారితోషకాన్ని పొందాడు. అప్పట్లో అంత మొత్తం అంటే నిజంగా చాలా పెద్ద మొత్తమే. ఒక యాడ్ ఏజెన్సీలో జంధ్యాల ఆయన ఫోటోను చూసి ఆయనను సంప్రదించారు. ఆ తర్వాత ఆయన హీరోగా సెలెక్ట్ చేసి సినిమా తీశారు. ఇప్పటికీ జంధ్యాల గారిని ఆయన ఒక దేవుడిలా కొలుస్తారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో మీరు భారతదేశంలో సినిమా ద్వారా పరిచయం అయ్యారు కదా మరి ఆ సినిమాను ఎన్నిసార్లు చూశారని అడగ్గా ఆ సినిమాను చూడటానికి ఎక్కువ సమయం దొరకలేదని ఈ మధ్యకాలంలో యూట్యూబ్ లో ఆ సినిమాని ఓ సారి చూసాను అని తెలిపాడు.