అయ్యప్పమాల ధరిస్తావా.. అయితే పాఠశాలకు రాకు. రావాలంటే ఆ పని చెయ్యి!

ఏమైనా కష్టాలు తీరినా.. కోరికలు తీరాలని మనకు అనిపించినా.. దేవుడికి పూజలు చేస్తాం. పూజకు సంబంధించి అన్ని సామాగ్రితో పూజలు చేస్తుంటారు. అయితే అయ్యప్ప భక్తులు మాత్రం మాలాధారణ ధరించి పూజలు చేస్తారు. ఇలా వయస్సుతో సంబంధం లేకుండా అయ్యప్ప మాల వేస్తారు. ఆ మాల ధరించినంత మాత్రానా ఏం పని చేయకుండా ఉంకూడదు అనేది కాదు.

ఏ పని అయినా చేసుకోవచ్చు. విద్యార్థులు అయితే అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వెళ్లొచ్చు. ఇక్కడ జరిగిన ఓ ఘటనలో అయ్యప్ప మాల ధరించి పాఠశాలకు వచ్చిన విద్యార్థిని ప్రిన్సిపాల్‌ పాఠశాలలోకి అనుమతించలేదు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో చోటు చేసుకుంది. దీనిపై అయ్యప్ప స్వామి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సెయింట్‌ మేరీస్‌ హైస్కూల్‌లో పదో తరగతి చదువుకుంటున్న విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. అతడు ఇటీవల మాలధారణలో పాఠశాలకు వెళ్లాడు. మాల ధరించి పాఠశాలకు వచ్చినందుకు పాఠశాల ప్రిన్సిపాల్ క్లాస్ రూంలోకి రానివ్వలేదు. ఒక వేళ క్లాస్ రూంకి రావాలంటే.. ఆ మాల తీసేసి రండి అంటూ ఆదేశించారు.

ఇలా ఏం చేయలేక అతడు.. దాదాపు 40 నిమిషాల పాటు బయటనే నిలబెట్టారు. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప మాలధారులు పాఠశాలకు వచ్చి.. పాఠశాల ఎదుట ఆందోళనకు దిగారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన పాఠశాల యాజమాన్యంపై కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని అయ్యప్ప మాలధారులు హెచ్చరించారు.