అక్కినేని చివరి సందేశం, నాగ్-లక్ష్మి విడిపోవడంపై…. అక్కినేని ఆఖరి రోజులు కన్నీళ్ళు తెప్పిస్తాయి.. డా.కృష్ణక్క చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు!

0
1097

అక్కినేని నాగేశ్వర రావు చివరి రోజుల్లో ఎలా చనిపోయారో చెప్పిన రచయిత్రి కృష్ణక్క..

అక్కినేని నాగేశ్వరరావు మరణించి దాదాపుగా మూడున్నర సంవత్సరాలైంది. ఆయన జ్ఞాపకాలు ఇంకా అభిమానులను వెంటాడుతూనే ఉన్నాయి. అక్కినేనికి సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు….. ఇటీవల యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో రచయిత్రి, డాక్టర్ కృష్ణకుమారి వెల్లడించారు.అక్కినేని ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలైన కృష్ణకుమారి అక్కినేనిని అన్నయ్యా అని, అన్నపూర్ణమ్మను వదినా అని పిలిస్తూ వారి కుటుంబంతో కలిసిపోయేంత చనువు ఉంది. ఆమె చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

చివరి రోజుల్లో ఎవరినీ గదిలోకి రానీయలేదు ఎప్పుడూ పదిమందితో కలిసి సరదాగా నవ్వుతూ, నవ్విస్తూ వుండే అక్కినేని, చివరి రెండు నెలలు తన గదిలోకి ఎవరినీ రానీయలేదు. ఎందుకు రానీయడం లేదని అడిగితే “నేనంటే అభిమానులకు ప్రాణం కదా .. వాళ్లు నన్ను ఈ స్థితిలో చూస్తే గుండె బద్దలైపోతుంది. వాళ్లు అలా బాధపడుతూ వుంటే నేను ఉచూస్తు భరించలేను. వాళ్లని బాధపెట్టడం ఇష్టం లేకనే ఎవరినీ రానీయడం లేదు” అని అక్కినేని అలా చేశారని కృష్ణకుమారి తెలిపారు.