ఇలా చేస్తే 2 నిమిషాల్లో మీ చెవిలో ఉన్న గులిమి బయటకి కారి వచ్చేస్తుంది

0
1767

చెవిలో ఉన్న గులిమి బయటకు తీయడానికి మనలో చాలా మంది కాటన్ బడ్స్ ని వాడుతుంటారు. ఇలా వాడటం చాలా ప్రమాదకరం దుమ్ము, ధూళి, నీరు వంటివి చెవిలోకి చేరి దురద వంటివి ఏర్పడతాయి. అలా వాటిని తొలిగించడానికి కాటన్ బడ్స్ ని వాడుతుంటారు. అలా వాడటం మంచిది కాదు అని చాలా మంది నిపుణులు అంటున్నారు మన శరీరంలో అత్త్యంత సున్నితం అయిన చెవి బాగం ఒకటి. చెవిలో గులిమిని తీయడానికి లేదా నీరు వెళ్ళినప్పుడు దురద వల్లో వాటిని బయటకు తీయడానికి ఇయర్ బడ్స్ ని వాడుతుంటారు. ఇలా వాడేటప్పుడు ఒక్కొక్క సారి చెవిలోన నరాలు దెబ్బ తింటాయి. దీని వల్ల వినికిడి తగ్గిపోవడం లేదా గులిమిను చెవి లోపలి బాగంలోకి వెళ్ళడం జరుగుతుంటాయి. కాబట్టి చెవిలోని గులిమిని తీయడానికి పిన్నిస్ గాని ఇయర్ బడ్స్ ని గాని వాడటం అంత మంచిది కాదు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. సాదారణంగా మన అందరి చెవిలో గులిమి ఏర్పడడం మామూలే అది చెవిలో ఉండే నరాలకు ప్రొటెక్షన్ లాగా ఉంటుంది. పది రకాల చెడు ఇన్ఫెక్షన్ లు రాకుండా కాపాడుతుంది.

ఈ గులిమిలో యాంటీ ఆక్సిడెంట్ లు కలిగి ఉంటాయి అవి చెవులు శుభ్రం అవ్వడానికి తాయారు అవుతాయి. ఇలా తాయారు అయిన గులిమికి దాని అంతట అదే బయటకు వెళ్తుంది. కానీ కొంత మంది ఇలా గులిమి ఏర్పడం అంత మంచిది కాదు అని బయటకు తీయడానికి పిన్నిస్ లని కాటన్ బడ్స్ తో తీయడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది మందిలో సాధారణస్థాయి కంటే గులిమి ఎక్కువగా తయారు అవుతుంది. అలా తయారు అవ్వడం కాస్తా ఇబ్బందితో కూడుకున్నదే మరి ఆ గులిమిని తీయడానికి ఒక నచురల్ చిట్కా ఉంది. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం: చెవిలో గులిమి సాదారణ స్తితి కంటే ఎక్కువగా తయారు అయిన వారు గోరు వెచ్చని నిలల్లో కాస్త ఉప్పు వేసి బాగా కలపాలి. ఈ నీటిలో ఒక దూది ఉండను ముంచి ఒక చెవిని వంచి మరొక చెవిలో ఆ దూది ఉండను ఉంచి ఆ ఉప్పు నీటిని పిండాలి. ఒక ఐదు నిమిషాల తర్వాత వంపి ఉన్న చెవిని వంపడం ద్వారా చెవిలో ఉన్న గులిమి తొలిగిపోతుంది.ఇలా రెండు చెవులను బాగా క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత ఉప్పు కలపని గోరు వెచ్చని నీల్ల తో శుభ్ర పరుచుకోవాలి. ఇలా చేయడం ద్వారా చెవిలోన గులిమి తొలిగి పోతుంది.ఇదే విధంగా బేబీ ఆయిల్ ని కూడా ఉపయోగించుకోవచ్చు. బేబీ ఆయిల్ ని ఎలాంటి ఎలర్జీ లేనివారే ఉపయోగించడం ఉత్తమం..