బ్రహ్మానందం ఒకప్పుడు రోజుకి 5 లక్షలు తీసుకునేవాడు..ఇప్పుడు చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. సినిమాలలో కనబడకపోవడానికి కారణం ఏమిటో తెలుసా?

0
984

పద్మశ్రీ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం అసలు ఏమయ్యాడు… బ్రహ్మానందం పేరు వినగానే.. బాధ‌ల్లో ఉన్న‌వారు కూడా ఆలోచించకుండా నవ్వేస్తుంటారు. ఎన్నో ద‌శాబ్దాలుగా తెలుగు సినీ హాస్యాన్ని ఒంటిచేత్తో నిల‌బెట్టిన ఈ కామెడీ కింగ్ ఇపుడు సిల్వర్ స్క్రీన్ పై ఎందుకు కనిపించడం మానేసాడు. కొద్దికాలం క్రితం వరకు సినిమా అంటే అందులో బ్రహ్మి గురించి ప్రత్యేకంగా ఒక పాత్ర రాసేవారు. అలా బ్రహ్మానందం హీరోలతో సమానంగా ఒక వెలుగు వెలిగేడు అన్న సంగతి మనకు తెలిసిందే. గత కొంతకాలంగా బ్రహ్మానందం సినిమాలలో కనబడటం లేదు.? ఈ ప్రశ్నకు చాలా రకాల సమాధానాలే టాలీవుడ్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన బడ్జెట్ పెంచడం అని కొందరు అంటే, మరికొందరు మాత్రం సినిమా లు తీసే విధానం మారిందని,ఇప్పుడు ప్రేక్షకుడి అభిరుచి కూడా మారిందని అంటున్నారు. ఏది ఏమయినా అన్ని రసాల్లోకెల్లా హాస్య రసం తెరపై పండించడం చాలా కష్టం.