Connect with us

General News

రేవ్ పార్టీలు ఎలాగుంటాయో ఇక్కడ ఎం చేస్తారో మీరే లైవ్ చుడండి

Published

on

రేవ్ పార్టీలు ఎలాగుంటాయో ఇక్కడ ఎం చేస్తారో మీరే లైవ్ చుడండి

Advertisement
Continue Reading
Advertisement

Featured

ITR FIling : గడువు పెంచలేదు.. ఫేక్ న్యూస్ నమ్మొద్దు.. “జూలై 31వ తేదీలోపు మీ ITR ఫైల్ చేయండి”.. కీలక ప్రకటన చేసిన ఐటీ శాఖ

Published

on

ITR ఫైలింగ్ : పన్ను చెల్లింపుదారులకు ముఖ్యమైన గమనిక. మీరు FY 2023-2024 కోసం మీ ఆదాయపు పన్ను రిటర్న్‌ను ఇంకా ఫైల్ చేయలేదా? ఆదాయపు పన్ను శాఖ మరో కీలక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 31లోగా ఐటీ రిటర్నులు సమర్పించాలని కోరింది ఐటీ శాఖ. మరో నెల రోజులు గడువు పెంపుపై వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. పన్ను చెల్లింపుదారులు ఇలాంటి ఫేక్ న్యూస్ నమ్మవద్దని సోషల్ మీడియా ఎక్స్ లో సూచించింది.

గడువు 4 రోజులు మాత్రమే. జూలై 31వ తేదీలోపు ITR ఫైల్ చేయాలి. ఈ క్రమంలో ప్రతి ఒక్కరూ వీలైనంత త్వరగా రిటర్నులు సమర్పించాలని ఐటీ శాఖ సూచించింది. పన్ను పోర్టల్ లో ఎటువంటి సాంకేతిక సమస్య లేదు. మీరు గడువు సమయంలోపు ITR ఫైల్ చేయకపోతే, మీరు సెక్షన్ 234A కింద వడ్డీని మరియు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 234F కింద జరిమానా చెల్లించవలసి ఉంటుంది.

మరోవైపు ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసి వాపసు కోరుతున్న వారిని కూడా ఐటీ శాఖ హెచ్చరించింది. సైబర్ నేరగాళ్లు ఫోన్లలో మెసేజ్ లు పంపుతూ మోసాలకు పాల్పడుతున్నట్లు తెలిసిందని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఇలాంటి ఫేక్ మెసేజ్‌లను చూసి మోసపోకండి మరియు రీఫండ్ కోసం మీ బ్యాంక్ ఖాతా వివరాలు మరియు వన్-టైమ్ పాస్‌వర్డ్‌లను అడుగుతూ మీకు కాల్ వస్తే అప్రమత్తంగా ఉండండి. అటువంటి లింక్‌లపై క్లిక్ చేయవద్దు. ఇప్పటి వరకు 5 కోట్ల మంది పన్ను రిటర్నులు దాఖలు చేసినట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే 1.8 మిలియన్ల రిటర్న్‌లు ప్రాసెస్ చేయబడి, రీఫండ్ ఖాతాలకు జమ అయినట్లు కూడా తెలిపింది.

Advertisement

Continue Reading

Featured

Viral News: పీత డెక్క పై నరసింహ స్వామి రూపం.. వైరల్ అవుతున్న ఫోటో?

Published

on

Viral News: సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఎన్నో వింతలు విశేషాలు ప్రతి ఒక్కరికి క్షణాలలో తెలిసిపోతున్నాయి. తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక అరుదైన పీత ఫోటో వైరల్ అవుతుంది. ఈ పీత డెక్క పై సాక్షాత్తు లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించడంతో ఇది కాస్త వైరల్ గా మారింది.

కోనసీమ జిల్లా, సకినేటి పల్లిలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది. ఈ గ్రామానికి చెందిన కాగితం కృష్ణ అనే వ్యక్తికి గోదావరి ఒడ్డున ఈత కనిపించడంతో దానిని తీసుకుని ఇంటికి వెళ్లారు. అయితే ఆపీతను కృష్ణ కుమార్తె నీళ్లలో వేయగా ఆ సమయంలో పీత డెక్కపై లక్ష్మీనరసింహస్వామి ప్రతిరూపం కనిపించింది.

నరసింహస్వామి రూపం..
ఈ విధంగా పీత డెక్కపై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే ఈ విషయం తెలిసిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆపీతను చూడటానికి వచ్చారు అయితే ఆ పీత డెక్క పై నరసింహస్వామి రూపం కనిపించడంతో వెంటనే కృష్ణ దానిని తిరిగి గోదావరి నదిలో వదిలివేశారు. ప్రస్తుతం ఈ పీతకు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

Continue Reading

General News

ఏపీలో ఆ న్యూస్ ఛానల్ ప్రసారానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Published

on

ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అతిపెద్ద బిజినెస్ లలో సెటప్ బాక్స్ బిజినెస్ కూడా ఒకటి ఏపీలో సుమారు 65 లక్షల కుటుంబాలు ఏపీ ఫైబర్ సెటప్ బాక్స్ ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయాల కారణంగా జూన్ 6వ తేదీ నుంచి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారం ఆగిపోయాయి.

జూన్ ఆరవ తేదీ నుంచి సాక్షి టీవీతో పాటు ఎన్ టీవీ, టీవీ9 వంటికి కొన్ని న్యూస్ చానల్స్ ప్రసారాలు ఆగిపోయాయి. ఇలా న్యూస్ ఛానల్ లో ప్రసారం నిలిపివేయడంతో ఇది చట్టపరంగా విరుద్ధమని తిరిగి ప్రసారాలను పునరుద్ధరించాలని 15 మంది మల్టీ సిస్టమ్ ఆపరేటర్‌లను ఢిల్లీ హైకోర్టు ఆదేశించడాన్ని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రశంసించింది.న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ ఫెడరేషన్ ప్రకటన విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్లో చట్ట విరుద్ధంగా కొన్ని న్యూస్ ఛానల్ లను నిలిపివేయడం జరిగింది. ఇలా నిలిపివేయటాన్ని న్యాయస్థానం పూర్తిగా ఖండించింది. కేవలం రాజకీయ న్యాయకత్వం పరంగా మార్పులు రావడంతోనే కేబుల్ ఆపరేటర్ల పై ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయాలని ఒత్తిడి తీసుకురావడం తగదని చెప్పారు.

Advertisement

ఇలా సుమారు 62 లక్షల కుటుంబాలకు ఈ న్యూస్ ఛానల్ ప్రసారం నిలిపివేయటం చట్టపరంగా విరుద్ధమని, ఈ విధంగా ఈ న్యూస్ ఛానల్ ను నిలిపివేయటం అనేది ప్రేక్షకుల సమాచార హక్కుని నిరాకరించే ప్రయత్నం జరగటం దురదృష్టకరమైన తెలిపారు. ఈ క్రమంలోనే నిలిపివేసిన ఈ చానల్లను తిరిగి పునరుద్ధరించాలని హైకోర్టు తీర్పును వెల్లడించింది.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!