స్వాతిముత్యం హాట్ అందాల బామ అవకాశాలు లేక ఇప్పుడు ఏం చేస్తుందో చూడండి

0
1533

క్రైస్తవ ప్రచారకర్తగా మారిన అలనాటి అందాల తార దీప…

ఒకప్పటి సౌత్ స్ర్కీన్ మీద ఆమె అందాల రాశి. మతిపోగొట్టే అందం ఆమె సొంతం. చక్రాల్లాంటి కళ్ళతో ఆకర్షణీయమైన ముఖంతో అప్పటి ప్రేక్షకుల హార్ట్ బీట్ వేగాన్ని పెంచేది. ముఖ్యంగా ఆమె ఎక్కువగా శృంగార భరితమైన పాత్రలు పోషించేది.

తెలుగు లో పంతులమ్మ, అమెరికా అమ్మాయి, దశతిరిగింది, కొత్తనీరు,అక్బర్ సలీం అనార్కలి, లేడీస్ టైలర్, డబ్బెవరికి చేదు, స్వాతి ముత్యం, లాంటి చిత్రాలతో బాగా పాప్యులారిటీ తెచ్చుకుంది. స్వతహాగా ఆమె మలయాళీ. మలయాళ తెరమీద ఆమె ఉన్నీ మేరి గా కొన్ని దశాబ్దాల కాలం పాటు అలరించింది. అప్పటి మాలీవుడ్ సూపర్ స్టార్స్ అందిరితోనూ తెరమీద తన అందంతో , అభినయంతో ఆకట్టుకొనేది.

1962 లో కేరళలోని ఎర్నాకుళం లో అగస్టిన్ ఫెర్నాండెజ్ , విక్టోరియా దంపతులకు జన్మించింది. అక్కడే సెయింట్ థెరిసా కాన్వెంట్ స్కూల్లో చదువుకుంది. మూడేళ్ల వయసులోనే క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకుంది. ఆమె తల్లి ప్రొఫెషనల్ బ్యాలే ట్రూప్ ను రన్ చేస్తూ ఉండేది.

1969 లో నవవధు అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. మలయాళంలో ఉన్ని మేరీ అంటే ఒక హాట్ బ్రాండ్. అప్పటి ఆమె సినిమాలు మాలీవుడ్ యూత్ ను బాగా ఎట్రాక్టివ్ చేసేవి. మలయాళ, తమిళ్, తెలుగు , కన్నడ భాషల్లో లెక్కకుమించిన చిత్రాల్లో నటించింది. 1982లో రిజాయ్ అనే కాలేజ్ ప్రొఫెసర్ ను పెళ్లి చేసుకుంది. ఆమెకు నిర్మల్ అనే ఒక కొడుకు. రిహాన్ అనే మనవడు.

1992 లో వచ్చిన ఎన్నోడిష్టం కూడామో అనే సినిమా ఆమె చివరిది. నైంటీస్ లోకి అడుగుపెట్టేసరికే దీప బాగా లావు అయిపోయింది. భారీ శరీరంతో ఆమె సినిమాల్లో చాలా ఇబ్బందిగా నటించేది. ఆ శరీరంతోనే ఆమె కొన్ని సినిమాలు చేసింది. ఆ తర్వాత సినీ రంగానికి గుడ్ బై చెప్పేసింది. స్వతహాగా ఆమె క్రిష్టియన్ కావడంతో, సినిమా రంగాన్ని వదిలేసిన నాటినుంచి స్పిరిట్యువల్ వే లో ట్రావెల్ చేస్తోంది.

చాలక్కుడి లోని పొట్ట అనే గ్రామంలో స్పిరిట్యువల్ క్యాంప్ నిర్వహిస్తూ, ఎవాంగ్లిష్ట్ గా మారిపోయింది. క్రైస్తవ మత ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ, కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది.

ఇప్పుడు దీప.. అప్పటి భారీ శరీరాన్ని కొంత వదిలించుకొని కాస్త నాజూగ్గా తయారైంది. తిరిగి సినిమాల్లోకి రావాలనుకుంటున్నారా అని అడిగితే, నేను సినిమాలు చూసి చాలా కాలమైపోయింది. ఇప్పుడు మళ్లీ ముఖానికి మేకప్ వేసుకొని రావాలంటే కొంచెం కష్టమే..

దేవుడు నాకిచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. నాజీవితాన్నిఇలాగే ఆనందంగా గడిపేస్తానని అంటోంది.