Connect with us

Health News

కాకి మీ ఇంటి ముందు పదే పదే అరిస్తే ఏమిజరుగుతుందో తెలుసా?

Published

on

హిందూ సంప్రదాయం ప్రకారం మన బందువులు చనిపోయినప్పుడు కాకులకు పిండం పెడతాం. మూడవ రోజు నుండి పదవ రోజు వరకు పక్షులకు అంటే కాకులకు పిండం అంటే ఆహారం పెట్టడం చూస్తూ ఉంటాం. మరణించిన వారు కాకి రూపం లో కుటుంబ సభ్యులు పెట్టిన ఆహారాన్ని తినడానికి వస్తారు అనే నమ్మకం మన ముత్తతల కాలం నుండే ఉంది. ఈ కారణం గానే ఎవరైనా పెద్దలు లేదా కుటుంబ సభ్యులు కాలం చేసినప్పుడు పిండం పెట్టడం ఆచారం అయింది. కర్మకాండలో బాగంగా కాకులకు అన్నం పెడ్తూ ఉంటారు.ఆ ఆహారాన్ని కాకి తింటే తమ పెద్దలు సంతృప్తి చెందారు అని ఒక వేళ కాకి ముట్టక పోయినట్టైతే వారికీ ఇష్టమైన కోరిక ఏదో తాము తీర్చనందువల్ల వాళ్ళ అసంతృప్తి కి గురియ్యారు అనుకుంటారు.

Advertisement

దానికి పురాణంలో ఒక వృతాంతం ఉంది ఎందుకు అంటే రావణబ్రహ్మ నవ గ్రహాలను భందించడానికి వచ్చినప్పుడు రవణుణ్ణి చూసి యమధర్మరాజు బయపడ్తాడు. తనను బంధిస్తాడు అని తెలిసి వేరే దారి లేక అక్కడ కాకి ఉంటే పారిపోయే మార్గం ఉంటే చూపమంటాడు. కాకి తనలో ప్రవేశించమని చెప్తుంది .అల తనలో ప్రవేశించగానే కాకి ఎగిరి దూరంగా రావణబ్రహ్మ నుండి కాపాడుతుంది. అప్పుడు యముడు కాకికి ఒక వరం ఇస్తాడు నీకు ఎవరు అయితే అమావాస్య నాడు కానీ భందువ్లులు చనిపోయిన థిదులో కానీ ఆహారం పెడతారో ఆ ఆహారం నువ్వు తింటే వారి పితృదేవతలు నరకంలో కూడా ఆనందం పొందుతారు. అందు వలన కాకికి ఆహారం పెట్టడం ఆచారంగా వస్తుంది .మనం ఏమైనా వ్రతాలు చేసినప్పుడు కూడా మనం తినక పోయిన మూగా జీవాలకు ఆహారం పెట్టాలి. కాకి శని దేవుని అనుగ్రహం పొందింది కాకికి ఆహారం పెడ్తే శని దేవుని అనుగ్రహం పొందినట్టే. ఇక మరి కొందరి కధనం ప్రకారం కాకి మనకు సంకేతాలు ఇస్తుంది అని నమ్ముతారు. మన పూర్వికులు మనుషుల జీవితం, మరణం కాకి తో ముడి పడినట్లు విశ్వసిస్తారు. చనిపోయిన మన పూర్వికులే కాకి రూపంలో ఉంటారు అని కూడా చాలా మందికి నమ్మకం. శ్రాద్ధ కర్మల సమయంలో కాకి పిండం తింటే చనిపోయిన వారి ఆత్మ సంతృప్తి పొందింది అని కూడా చెప్తూ ఉంటారు.

కాకులు మన భవిష్యత్ ను అంచనా వేస్తాయి అని ఇంట్లో కాకి అరిచిన కొన్ని ప్రదేశాలపై వాలిన, కాకి తాకినా, తన్నిన అది కొన్ని జరగబోయే అంశాలకు సూచకాలు అని కొన్ని నమ్మకాలూ ఉన్నాయి. ఒకవేల మీరు బయటకు వెళ్ళేటప్పుడు కాకి వచ్చి గట్టిగా అరిచి వెళ్ళింది అంటే మీరు వెళ్తున్న పని లేదా మీ ప్రయాణం సక్సెస్ అవ్తుంది అని సంకేతం. నీళ్ళు నిండుగా ఉన్న కుండపై కూర్చొని ఉండడం ఎవరు అయితే చూస్తారో వాళ్ళు ధనవంతులు కాబోతున్నారు అని సంకేతం. ఒక వేల కాకి తన నోట్లో రోటి లేదా బ్రెడ్ లేదా మాంసం ముక్క పట్టుకొని వెళ్ళడం చూసారంటే మీరు ఏదో శుభవార్త వినబోతున్నారు అని మంచి జరగబోతుంది అని సంకేతం. ఇంటి దెగ్గర లేదా ఆఫీస్ దెగ్గర లేదా ఒక ఊర్లో అరిస్తే అది అశుభ వార్తకు సంకేతం. అలాగే ఆప్రాంతం ఓనర్ సమస్యల్లో పడతారు అని సంకేతం. ఒక వ్యక్తీ తలపై కాకి వాలితే వాళ్ళు అవమానాల వల్ల సమాజంలో గౌరవాన్ని కోల్పోతారు అని సంకేతం. ఒక వేల కాకి మహిళా తలపై లేదా ఆమెపై కూర్చుంటే ఆమె భర్త సమస్యల్లో పడతారు అని సూచిస్తుంది. ఒక వేల సాయంత్రం పూట కాకి ఆగ్నేయం వైపు నుండి రావడం చూసారు అంటే ద్రవ్య లాభం పొందుతారు అని సూచనా. ఇంటి దెగ్గర లేదా ఆఫీస్ దెగ్గర లేదా ఒక ఊర్లో కాకి అరిస్తే అది అశుభ వార్త కి సంకేతం. ఇక పిండం ఇవి పలు రకాలు కర్మకాండలకు రకరకాల పిండాలు పెట్టడం హిందూ సంస్కృతీ లో ఉంది. కొందరు మాత్రమే పాటిస్తున్నారు కొందరు రాను రాను విసర్జించి ఉంటారు. కొందరు తొలినాళ్ళ నుంచి పాటించి ఉండకపోవచ్చు వాయుసం పిండం కాకికి పిండం పక్షి జాతికి భోజనం పెట్టడం అనేది ఇందులో పరమార్దం.

పూర్వం మనుషులు నివసించే ప్రాంతాలలో కాకులే ఎక్కువగా జీవించేవి అందుకే మన పూర్వికులు పిండ ప్రదానం చేసిన తర్వాత కాకులకు ఆహారం పెట్టె వారు అదే ఆనవాయితీగా వస్తుంది. చనిపోయిన వారి ఆత్మ పక్షి రూపంలో వచ్చి ఆహారాన్ని స్వీకరిస్తుందని కొన్ని శాస్త్రాలలో ఉంది. రామాయణం ప్రకారం రాముడు ఒక భక్తుడికి నీ పూర్వికులు కాకి రూపంలో విహరిస్తూ ఉంటారు. కాకులకి ఆహారం పెడ్తే నీ పూర్వీకులకు చేరుతుంది అని ఒక వరం ఇస్తాడు. రాముడి వరం ప్రకారమే నేటికి కాకులకి ఆహారం పెడతారు అనే నానుడి కూడా ఉంది. విగ్ర పిండం నీటిలో వదిలే పిండం నీటిలో ఉండే జలచెరాలకు ఆహారాన్ని పెట్టడం అనేది అందులో ఉండే పరమార్దం. చాల మంది చనిపోయిన వారి అస్తికలను నది దెగ్గరకు తీసుకువెళ్లి పిండ ప్రదానం చేసి నదిలో వదిలేస్తారు. అస్తికలతో పాటు ఆహారాన్ని కూడా నదిలో వేస్తారు ఇలా చేస్తే చనిపోయిన వారు ఆత్మకు శాంతి చేకూరుతుంది అని నమ్మకం.

Advertisement

గోవుకి పెట్టె పిండం పిండాన్ని గోవులకు పెట్టనియ్యడం లేదు అనే విమర్సు కూడా ఉంది. అది చాలా తప్పు అపోహ కూడా ఆవుకి బలమైన ఆహారం అందించడమే పిండ ప్రదానం లోని గుణం. ఆవులకి పెట్టె పిండాలలో పాలు పాలపదర్దాలయినవి. జంతువు అంటే గోవు మాత్రమేనా ఇంకేం లెవా కుక్కకో పిల్లికో పెట్టవచ్చు కదా అని సందేహం రావచ్చు.వీటికి కూడా సమాదానం లేకపోలేదు ఆవు ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మేలుజాతి పశువు అని గుర్తించారు మన పూర్వికులు. అంతే కాదు ప్రతి ఇంటిలో కుక్క ఉన్న లేకపోయినా ఆవు మాత్రం ఉండేది. అందుకే ఆ కాలం వారు సుబిక్షంగా ఉన్నారు అనడంలో సందేహం లేదు అన్నిఇల్లలో ఆవులు ఉంటాయి కాబట్టి వాటికీ కూడా భోజనం పెట్టడమే ముఖ్య ఉద్దేశం. ఇంకా చనిపోయిన వారి పేరిట వారి ఆత్మకు శాంతి చేకూరాలని అని బంధువులకు ఊరి ప్రజలందరికి అన్నదానం చేస్తారు. మన హిందూ ధర్మంలో ఆచరించే ప్రతి ఆచారం వెనుక సైన్సుతో పాటు మనుషుల జీవనానికి ఉపయోగపడే ప్రయోజనాలు ఉన్నాయి అని అందరు తెలుసుకోవలిసిన విషయం.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Butter Milk Side Effects: ఆరోగ్యానికి మంచిదని మజ్జిగ ఎక్కువ తాగుతున్నారా… ప్రమాదంలో పడినట్లే?

Published

on

Butter Milk Side Effects: మనం ఆరోగ్యంగా ఉండడం కోసం ఎంతో పోషక విలువలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉంటాము. ఇక మనం తీసుకునే ఆహార పదార్థాలలో తప్పనిసరిగా పెరుగు లేదా మజ్జిగ ఉండటం సర్వసాధారణం అయితే పెరుగుతో పోలిస్తే చాలామంది మజ్జిగ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. మజ్జిగలో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉండడంతో ప్రతిరోజు మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం తేలికగా జీర్ణం అవుతుందని భావిస్తూ ఉంటారు.

Advertisement
1

ఇలా మజ్జిగ తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడమే కాకుండా మన శరీరం కూడా హైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుందని భావిస్తూ చాలామంది మజ్జిగ తాగుతూ ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిది కాదని మజ్జిగను ఎక్కువగా తీసుకోవడం వల్ల మనం ప్రమాదంలో పడతామని నిపుణులు చెబుతున్నారు. మజ్జిగను అధికంగా తీసుకోవడం వల్ల ఈ సమస్యలు మనల్ని వెంటాడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

పాలు పాల పదార్థాలలోనూ లాక్టోస్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది చాలామందిలో జీర్ణక్రియను పూర్తిగా మందగించేలా చేస్తుంది. ఎవరికైతే లాక్టోస్ ను జీర్ణం చేసే ఎంజైమ్‌ ఎక్కువగా ఉత్పత్తి కావు లాంటివారికి మజ్జిగ తాగటం వల్ల అవి జీర్ణం కాక వాంతులు అయ్యే పరిస్థితులు ఏర్పడుతుంటాయి అలాగే కడుపు నొప్పి రావడం కడుపు చాలా ఉబ్బర కావడం విరోచనాలు వంటి సమస్యలు ఏర్పడే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందుకే ఇలాంటి వారు ఎక్కువగా మంచిగా తీసుకోకపోవడం ఎంతో మంచిది.

చర్మంపై దద్దుర్లు ఏర్పడతాయి…

Advertisement

ముఖ్యంగా ఈ సమస్య చిన్న పిల్లలలో అధికంగా కనబడుతూ ఉంటుంది. అలాంటివారు రోజుకు కేవలం ఒక గ్లాస్ మజ్జిగ తాగడం మంచిది ఇక చాలా మంది మజ్జిగలో ఉప్పు అధికంగా వేసుకొని తాగుతూ ఉంటారు ఇలా అధికంగా ఉప్పు వేసుకొని తాగడం వల్ల మన శరీరంలో ఉప్పు నిలువలు పెరిగిపోయి హై బీపీ రావడానికి కూడా కారణం అవుతుంది. ఇక మరికొందరికి చర్మంపై దద్దుర్లు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక రోజు ఒక గ్లాస్ కి మించి మజ్జిగ తాగకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Pregnant After 40 Years: మహిళలు 40 ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం మంచిదేనా… నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Published

on

Pregnant After 40 Years: ప్రస్తుత కాలంలో మహిళలు కూడా విద్యా ఉద్యోగం అంటూ పెళ్లిళ్లు చేసుకోవడం కూడా చాలా ఆలస్యంగా చేసుకుంటున్నారు. ఇక పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వెంటనే పిల్లలని ప్లాన్ చేయడం లేదు అందుకే ప్రస్తుత కాలంలో మహిళలందరూ కూడా 30 తర్వాత దాదాపు 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో పిల్లలను కనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఇలా మహిళలు 40 కి దగ్గర పడుతున్న సమయంలో పిల్లలను కనడం వారి ఆరోగ్యానికి మంచిదేనా పిల్లల ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుందా అనే విషయానికి వస్తే…

Advertisement

40 సంవత్సరాల వయసు దగ్గర పడుతున్న సమయంలో పిల్లల్ని కనడం పెద్ద తప్పు అని నిపుణులు చెబుతున్నారు. పిల్లలను కనడానికి 20 నుంచి 30 సంవత్సరాల వయసు ఎంతో మంచిదని ఈ సమయంలో పిల్లలను కనడం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా జన్మిస్తారు. 40 సంవత్సరాలకు దగ్గర పడుతున్నటువంటి మహిళలలో విడుదల అయ్యే అండాల నాణ్యత పూర్తిగా తగ్గిపోతుంది తద్వారా పిల్లలు పుట్టడం కూడా చాలా అరుదు ఒకవేళ పుట్టిన ఎన్నో రకాల సమస్యలతో జన్మిస్తూ ఉంటారు.

40 సంవత్సరాల వయసు దగ్గరకు పడే మహిళలలో రక్తపోటు, మధుమేహం వంటి సమస్యలు కూడా ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఇలాంటి సమస్యలతో బాధపడే వారు పిల్లల్ని కనుక కణాలని భావిస్తే వారి జీవితాన్ని కూడా ప్రమాదంలో పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. 30 సంవత్సరాల లోపు మొదటి బిడ్డకు జన్మనివ్వడం ఎంతో మంచిది అయితే మొదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత తిరిగి ఆరు ఏడు నెలల వ్యవధిలోని మరొకసారి గర్భం దాల్చడం చాలా ప్రమాదకరం.

18 నెలల గ్యాప్ అవసరం…

Advertisement


మొదటి బిడ్డకు రెండవ బిడ్డకు 18 నుంచి 23 నెలల గ్యాప్ అనేది తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఇలా ఉంటేనే రెండో బిడ్డకు ఏ విధమైనటువంటి ప్రమాదం ఉండదు. అలా కాకుండా ఐదు నెలల గ్యాప్ లోనే మరోసారి గర్భం దాల్చితే అది తల్లి బిడ్డల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని ఇలా గర్భం దాల్చడం వల్ల రక్తస్రావం జరగడం, తల్లి ఆరోగ్యం పై అధిక ప్రభావం చూపడం వంటివి జరుగుతుంటాయి.అందుకే పిల్లల విషయంలో సరైన ప్లానింగ్ ఎంతో అవసరం అని నిపుణులు చెబుతున్నారు.

Advertisement
Continue Reading

Featured

Doctor Kiran : ఫోన్ వల్లే గుండె పోటు… వాక్సిన్ వల్ల జరుగుతోంది…: డాక్టర్ కిరణ్

Published

on

Doctor Kiran : కరోనా నీలి నీడలు ఇంకా మనల్ని వెంటాడుతూనే ఉన్నాయి. నలభై ఏళ్ల లోపు వాళ్ళు గుండె పోటుతో చాలా మంది మరణించడం కలవరపెడుతోంది. ఉన్నట్టుండి గుండె నొప్పి వచ్చి మరణిస్తుండటంతో జనాలు భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది మంది యుక్త వయసు వాళ్ళు గుండెపోటుతో అక్కడికక్కడే మరణించడం అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక అసలు యుక్త వయసు వారికి గుండెపోటు రావడం వంటివి ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి గల కారణాలు వంటి విషయాలను డాక్టర్ కిరణ్ వివరించారు.

Advertisement

వాక్సిన్ కాదు స్మార్ట్ ఫోన్ వల్లే గుండె పోటు…

మారుతున్న జీవన సరళి వల్ల ఆహారపు అలవాట్లు, పని అన్నీ మారిపోయి మనం ఊబకాయం, షుగర్ వంటి వ్యాధుల భారిన పడటం వలన ఇన్ని రోజులు గుండెపోటు మరణాలు సంభవించేవి. అయితే ఇప్పుడు యుక్త వయసులో ఉన్నవారికే ఎక్కువగా గుండెపోటు సంభవించడానికి గల కారణాలను డాక్టర్ కిరణ్ వివరించారు. యువతలో అనారోగ్యాలకు గుండె ఆరోగ్యం మీద చూపే ప్రభావాలలో మొదటిది ఫోన్ వాడకం.

గంటలు గంటలు ఫోన్లను చూస్తూ చేతులు కాళ్ళు కదల్చకుండా ఉంచడం వల్ల చాలా శరీర భాగలకు రక్త సరఫరాలో ఆటంకాలు ఏర్పడుతాయి. అపుడు రక్తం సరఫరా చేయడానికి గుండె మరింత బలంగా కొట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. అందువల్ల గుండె మీద భారం అధికమై చిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయి. ఇక బరువు ఉన్నట్టుండి తగ్గడం లేదా పెరగడం వల్ల కూడా ప్రమాదాలు ఎదురావుతున్నాయని తెలిపారు. ఇక కరోనా వాక్సిన్ వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి అనేది అపోహ మాత్రమే, ఆ వాక్సిన్లు వేయించుకున్నందుకే మనం బ్రతికి ఉన్నాం అంటూ తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!