Featured
మీ ఇంట్లో కరోనా రోగులు ఉన్నారా.. అయితే ఇవి తప్పనిసరి!
Published
4 years agoon
By
lakshanaప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న విపత్కర పరిస్థితులలో ప్రతి ఒక్కరు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ నేపథ్యంలోనే మీ కుటుంబంలో ఎవరైనా కరోనా బారిన పడినట్టుయితే వారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఇక్కడ తెలుసుకుందాం. కరోనా వ్యాపించడానికి ప్రతి ఒక్కరు ఆస్పత్రిలో చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉండదు. మన ఇంట్లోనే ప్రత్యేకంగా ఒక గదిలో ఉండటం ద్వారా ఈ వైరస్ నుంచి విముక్తి పొందవచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ప్రత్యేక గది సదుపాయం ఉండకపోవచ్చు.ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఈ జాగ్రత్తలను పాటించడం ద్వారా కరోనా మహమ్మారి నుంచి విముక్తి పొందవచ్చు.
పాటించాల్సిన పద్దతులు:
*కరోనా సోకిన వ్యక్తి మన ఇంట్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం ఎల్లప్పుడు మాస్కు ధరించి ఉండాలి. ఎలాంటి పరిస్థితులలో కూడా మాస్క్ తొలగించకూడదు.
*కరోనా సోకిన వ్యక్తి ధరించిన బట్టలు ప్రత్యేకమైన క్రిమిసంహారక రసాయనాలతో ఉతకాలి. అతను ఉపయోగించిన వస్తువులను ఇతర కుటుంబ సభ్యులు ఎలాంటి పరిస్థితులలో ఉపయోగించకూడదు.
- ఒకవేళ మన ఇంట్లో ప్రత్యేకమైన టాయిలెట్ లేకపోతే తరచూ టాయిలెట్ ను క్రిమిసంహారక మందులతో పిచికారీ చేస్తూ శుభ్రం చేస్తుండాలి.
- కరోనా వ్యాపించిన వ్యక్తి వాడి పడేసిన వస్తువులను ఒక పసుపు రంగు బయో హజర్డాస్ బాక్స్‌లో వేయాలి.
చేయకూడని పనులు:
- కరోనా బారిన పడిన వ్యక్తి గదిలోకి ఇతర కుటుంబ సభ్యులు నేరుగా ప్రవేశించకూడదు. ఎందుకంటే అతను నివశించే ఆ గది మొత్తం ఇన్ఫెక్షన్ అయి ఉంటుంది. దీని వల్ల వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం ఉంటుంది.
- తరచూ చేతులను శానిటైజర్ చేస్తూ ఉండాలి. భోజనానికి ముందు చేతులను శుభ్రంగా సబ్బుతో కడగాలి. ఎలాంటి పరిస్థితులలోనూ రోగి వాడి పడేసిన వస్తువులను చేతులతో తాకకూడదు.
- కరోనా సోకిన వ్యక్తి ఇంట్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడంటే ఇతర కుటుంబ సభ్యులు ఎవరు బయట వ్యక్తులతో కాంటాక్ట్ అవ్వకూడదు. ఈ విధమైనటువంటి జాగ్రత్తలను పాటించినప్పుడే వైరస్ ఇతరులకు వ్యాపించకుండా ఉంటుంది.
You may like
Vijaykantha: ఇండస్ట్రీలో విషాదం కరోనాతో నటుడు విజయ్ కాంత్ మృతి?
Posani Krishna Murali: మూడోసారి కరోనా బారిన పడిన పోసాని ఆస్పత్రికి తరలింపు!
Health Tips: నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారికి .. అద్భుతమైన చిట్కాలు ఇవే!
Corona Variant: ఒమిక్రాన్ తరువాత వేరియంట్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన డబ్ల్యూహెచ్‌వో!
Home Remedies For Cough: కఫం సమస్యతో బాధపడుతున్నారా… ఈ ఇంటి చిట్కాలతో విముక్తి పొందండి!
Breaking: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరోనా..! తనను కలిసిన వారు కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచన..!
Featured
Keerthy Suresh: డిసెంబర్ 11న కీర్తి సురేష్ వివాహం..అధికారికంగా ప్రకటించిన కీర్తి సురేష్ తండ్రి!
Published
53 mins agoon
22 November 2024By
lakshanaKeerthy Suresh: సినీనటి కీర్తి సురేష్ వివాహం జరగబోతోంది అంటూ గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. నేను శైలజ అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ హిందీ భాష చిత్రాలలో నటిస్తూ హీరోయిన్ గా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా కెరియర్ పరంగా బిజీగా ఉన్న కీర్తి సురేష్ పెళ్లి చేసుకోబోతోంది అంటూ గత కొద్దిరోజులుగా ఎన్నో వార్తలు వినిపించాయి.
ఈ విధంగా కీర్తి సురేష్ గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలో ఆమె ఈ వార్తలపై స్పందించి ఈ వార్తలను ఖండించారు. ఒకానొక సమయంలో కీర్తి సురేష్ తండ్రి కూడా ఈ వార్తలను తోసిపుచ్చారు. కీర్తి సురేష్ పెళ్లి గురించి వస్తున్న వార్తలలో నిజం లేదని ఒకవేళ అలా తన పెళ్లి చేసుకుంటే కనుక ముందుగా ఈ విషయాన్ని నేనే మీకు తెలియజేస్తానని తెలిపారు.
అప్పటినుంచి ఈ వార్తలకు కాస్త పులి స్టాప్ పడినా, గత మూడు రోజులుగా ఈ పెళ్లి గురించి మరోసారి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఈ పెళ్లి వార్తలపై కీర్తి సురేష్ తండ్రి స్పందించారు. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ మాట్లాడుతూ కీర్తి సురేష్ వివాహం తనకు 15 సంవత్సరాలుగా పరిచయం ఉన్నటువంటి ఆంటోని తట్టిల్ తో డిసెంబర్ నెల 11వ తేదీ గోవాలోని ఒక రిసార్ట్ లో జరగబోతుందని తెలిపారు.
Keerthy Suresh:
ఈ విధంగా ఈయన తన కుమార్తె పెళ్లి గురించి అధికారకంగా ప్రకటించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కీర్తి సురేష్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా కీర్తి ఆంటోని ఫోటోలను సోషల్ మీడియా వేదికగా వైరల్ చేస్తున్నారు. ఇక ఆంటోనీ ప్రముఖ వ్యాపారవేత్తగా ఎంతో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు.
Featured
YS sharmila: ప్రభాస్ ఎవడో నాకు ఇప్పటికీ తెలియదు.. వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు?
Published
1 hour agoon
22 November 2024By
lakshanaYS sharmila: వైయస్ షర్మిల తనకు ప్రభాస్ కి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించిన సమయంలో ఏ ప్రభుత్వంలో మహిళలు గురించి తప్పుగా మాట్లాడారనే విషయం గురించి ప్రస్తావనకు రావడంతో వైఎస్ షర్మిల గురించి గతంలో బాలకృష్ణ తన ఇంట్లో చేసిన ఆరోపణల గురించి మాట్లాడారు.
ఈ క్రమంలోనే వైయస్ షర్మిల ఈ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అన్న మాట్లాడినటువంటి వ్యాఖ్యలపై ఈమె ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ప్రభాస్ అనే వ్యక్తి ఎవరో నాకు తెలియదని తెలిపారు. ఈ వ్యాఖ్యలు బాలకృష్ణ గారు మాట్లాడలేదని జగన్మోహన్ రెడ్డి తన సైతాన్ సైన్యంతో ఇలాంటి వ్యాఖ్యలు చేయించారు అంటూ మండిపడ్డారు.
YS sharmila: ఒక్కసారి కూడా చూడలేదు..
నా పిల్లల మీద ప్రమాణం చేసి చెబుతున్న అప్పుడు ఇప్పుడు నేను ఒకే మాట చెబుతున్న ప్రభాస్ అనే వ్యక్తి ఎవడో నాకు ఇప్పటికీ తెలియదు.ఆయనని నేరుగా నేను ఒక్కసారి కూడా చూడలేదు అంటూ షర్మిల ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే గతంలో ఈమె ఇదే విషయం గురించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మండిపడిన ఒక వీడియోని కూడా వైకాపా కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ ఎవరు ఎవరిని కించపరిచారో ఒక్కసారి చూడు షర్మిల అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Featured
Roja: ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు!
Published
1 hour agoon
22 November 2024By
lakshanaRoja: వైకాపా మాజీ మంత్రి ఆర్కే రోజా మరోసారి ఈ బియ్యం టాంపరింగ్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఎన్నికలలో భాగంగా కూటమీ ప్రభుత్వానికి ఏకంగా 164 స్థానాల విజయం సాధించింది. వైకాపా కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ ఎన్నికల ఫలితాలపై ఎన్నో సందేహాలు వ్యక్తం అయ్యాయి.
ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని అందుకే ఇలాంటి ఫలితాలు వచ్చాయి అంటూ వైకాపా నేతలు సందేహాలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే వివి ప్యాట్లనులెక్క పెట్టాలి అంటూ కొంతమంది వైకాపా నేతలు కోర్టును ఆశ్రయించారు. అయితే వివి ప్యాట్లను లెక్క పెట్టాలని చెప్పినప్పటికీ అప్పటికే వివి ప్యాట్లను నాశనం చేశారని ఎన్నికల కమిషన్ చెప్పారు. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి.
ఈ విషయం గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా సంచలన విషయాలను బయటపెట్టారు. సాధారణంగా ఎన్నికలు జరిగినా 6 నెలల వరకు ఈ వివి ప్యాట్లను కూడా జాగ్రత్తగా భద్రపరచాలి కానీ ఎన్నికలు జరిగినా నెలలోపు ఈ వివి ప్యాట్లను నాశనం చేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఎంత పెద్ద కుట్ర జరిగిందోనని ఈమె తెలిపారు.
Roja: ఈవీఎం మాయ..
ఇకపోతే ఎన్నికల సమయంలో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే విషయాలు రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇక ఎన్నికల సమయంలో కూడా అదే ఓట్లు తేలాల్సి ఉంటుంది కానీ ఎన్నికల సమయంలో ఏకంగా 45 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయి. ఈ 45 లక్షల ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయని రోజా ప్రశ్నించారు. దీన్ని బట్టి చూస్తుంటేనే ఇది ఈవీఎం ప్రభుత్వమని అర్థమవుతుంది అంటూ రోజా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Keerthy Suresh: డిసెంబర్ 11న కీర్తి సురేష్ వివాహం..అధికారికంగా ప్రకటించిన కీర్తి సురేష్ తండ్రి!
YS sharmila: ప్రభాస్ ఎవడో నాకు ఇప్పటికీ తెలియదు.. వైయస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు?
Roja: ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగింది.. మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు!
ABV: జగన్ నోరు అదుపులో పెట్టుకో… నేనేంటో నీకు పూర్తిగా తెలుసు: ఏబీ వెంకటేశ్వరరావు!
Garikapati: తగ్గేదేలే అంటావా… నువ్వేమైనా హరిశ్చంద్రుడివా.. పుష్ప 2 పై గరికపాటి షాకింగ్ కామెంట్స్!
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
Trending
- Featured3 weeks ago
Pawan Kalyan: వాటిని నాకు పరిచయం చేసిందే మా అన్నయ్య నాగబాబు.. పవన్ కళ్యాణ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!
- Featured4 weeks ago
Jamili Elections: జమిలి ఎన్నికలు వస్తే పవన్ సీఎం అవుతారా.. మరి లోకేష్ పరిస్థితి ఏంటీ?
- Featured3 weeks ago
Y.S Vijayamma: వైయస్ అభిమానులకు బహిరంగ లేఖ రాసిన విజయమ్మ?
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మందకృష్ణ మాదిగ ఫైర్.. ఇది అవమానకరం అంటూ?
- Featured2 weeks ago
RK Roja: పవన్ కళ్యాణ్ ఎక్కడ… నీకు మాత్రమే కూతుర్లు ఉన్నారా: రోజా
- Featured2 weeks ago
Pawan Kalyan: పవన్ వ్యాఖ్యల పై స్పందించిన సీఎం చంద్రబాబు.. ఏమన్నారంటే?
- Featured4 weeks ago
Chandra Babu Naidu: పొత్తు ఆలోచన ఎవరిది… జైలు గోడల మధ్య జరిగింది ఇదేనా?
- Featured4 weeks ago
AP Politics: బాబు నీ ఆస్తులు నీ తమ్ముడికి పంచావా.. సీఎంకు కౌంటర్ ఇచ్చిన పేర్ని నాని?