టాలీవుడ్ లో మళ్ళీ చాలాకాలం తర్వాత తన సత్తా ఏంటో చూపించాడు మన నట సింహం నందమూరి బాలకృష్ణ.. గత కొంతకాలంగా వరస ప్లాపులతో బాలయ్య మార్కెట్ పూర్తిగా పడిపోయింది.. దీంతో బాలయ్య పనైపోయింది అనుకున్నారంతా.. కానీ అది రాంగ్ అని ప్రూవ్ చేసాడు బాలయ్య.. కచ్చితంగా ఈ క్రెడిట్ బోయపాటి శ్రీనుకే దక్కుతుంది. ఏది ఏమైనా వృద్ధ సింహంగా మిగిలిపోయిన బాలయ్య చేత మళ్ళీ గర్జించేలా చేయడం అంటే మాములు విషయం కాదు.

ఇక ఇప్పటికే అఖండ టీజర్ సృష్టిస్తోన్న సంచలనాల గురించి తెలిసిందే.వ్యూస్ పరంగా యూట్యూబ్ లో కొత్త రికార్డ్స్ ను సృష్టిస్తోంది.కాగా ఇప్పుడు శాటిలైట్ డీల్ కూడా కుదుర్చుకొని బాలయ్యకి ఇంకా మార్కెట్ ఉంది, ఆయన డేట్స్ కోసం నిర్మాతలు ఇంకా ఆశగా ఎదురుచూడొచ్చు అనేలా భారీ మొత్తానికి అనగా 19 కోట్ల రూపాయలకు స్టార్ మా సంస్థ ‘అఖండ’ శాటిలైట్ రైట్స్ చేజిక్కించుకొంది.

నిన్నే డీల్ లాక్ అయిందని టాక్. బాలయ్య సినిమాలకు టీవీల్లో మంచి రేటింగ్స్ వస్తుంటాయి. అలాగే బోయపాటి సినిమాకి కూడా పల్లెటూరి జనంలో మంచి క్రేజ్ ఉంది.బోయపాటి అట్టర్ ప్లాప్ అయిన ‘వినయ విధేయ రామ’ టీవీల్లో ఎప్పుడు ప్రసారం అయిన భారీ రేటింగ్ పొందుతుంది అంటే.. దానికి బోయపాటి బ్రాండ్ కూడా ఒక కారణం. మొత్తానికి బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూడో మూవీకి భారీ రేట్లు పలుకుతుండటంతో.. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డికి పెద్ద రిలీఫ్ లా ఉంది.ఎందుకంటే.. అసలు రవీందర్ రెడ్డికి బాలయ్యతో సినిమా చేయడం ఇష్టం లేదట.

కేవలం బోయపాటితో ఉన్న అగ్రిమెంట్ కారణంగా తప్పక బాలయ్యతో సినిమాకి ఒప్పుకున్నాడు రవీందర్ రెడ్డి. కానీ చాల సంవత్సరాల తరువాత బాలయ్య బాక్సాఫీస్ వద్ద తన పంజా రుచి చూపించడంతో రవీందర్ రెడ్డికి కాసుల పంట పండేలా కనిపిస్తోంది. అలాగే బాలయ్య పని అయిపొయింది అనుకున్న వారు అంతా… ఇప్పుడు బాలయ్యతో సినిమా చేయడానికి అగ్ర నిర్మాతలు, దర్శకులు సైతం ముందుకు వస్తున్నారంట.ఇప్పటికే బాలయ్య కోసం కథలు సిద్ధం చేసే పనిలో ఉన్నారట పలువురు దర్శకులు.!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here