Connect with us

Featured

Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో సంచలనం… అవినాష్ రెడ్డి నిర్దోషి… సిబిఐ కి షాక్ ఇచ్చిన హై కోర్ట్…: అనలిస్ట్ దాము బాలాజీ

Published

on

Analyst Damu Balaji : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు రోజుకో మలుపు పూటకో మలుపు తిరుగుతూనే డైలీ సీరియల్ లాగా సాగుతోంది. ఓవైపు ఎంపీ అవినాష్ రెడ్డికి హత్యతో సంబంధం ఉంది అంటూ సిబిఐ ఆయనను అరెస్టు చేయాలని భావిస్తుంటే మరోవైపు అవినాష్ రెడ్డికి ఆ కేసుతో సంబంధం లేదు అంటూ హై కోర్ట్ లో పిటిషన్స్ వేస్తూనే ఉన్నారు. తాజాగా నిన్న జరిగిన విచారణలో సిబిఐ తరుపున న్యాయవది అవినాష్ రెడ్డిని సిబిఐ కస్టడీ కోరుతూ వాదనలు వినిపించగా అసలు కేసులో అవినాష్ రెడ్డికి సంబంధం లేదంటూ అవినాష్ రెడ్డి తరుపు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. ఇక హై కోర్ట్ ఎవరికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది వంటి విషయాలను అనలిస్ట్ దాము బాలాజీ మాట్లాడారు.

Advertisement

సిబిఐ కి షాక్, అవినాష్ రెడ్డికి ఊరట…

వివేకానంద రెడ్డి కేసులో ఇప్పటికే అప్రూవర్ గా మారిన దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం అవినాష్ రెడ్డి కూడా హత్య విషయంలో ఉండగా అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాది మాత్రం అవినాష్ రెడ్డికి వివేకానంద చనిపోయిన విషయం చెప్పింది వివేకానంద కూతురు అయిన సునీత రెడ్డి భర్త నర్రి రాజశేఖర్ రెడ్డి తమ్ముడే. ఆయన ఫోన్ చేసి చెప్పిన తరువాతే అవినాష్ రెడ్డి అక్కడికి వెళ్ళాడు అంటూ వాదించారు. సిబిఐ ఆయనను విచారించడం లేదని కేవలం కేసును ఒక కోణంలో మాత్రమే దర్యాప్తు చేస్తుందంటూ గట్టిగా ఆయన వాదన వినిపించారు.

ఇక హై కోర్ట్ అవినాష్ ను అరెస్టు చేసే విషయంలో 25 తేదీ వరకు చేయకూడదని సిబిఐ కు ఆదేశించగా అలాగే విచారణకు ఎపుడు పిలిచినా అవినాష్ హాజరు కావాలని తెలిపారు. ఇక కేసులో కీలకంగా ఉన్న భాస్కర్ రెడ్డి అలాగే ఉదయ్ కుమార్ రెడ్డి లను కూడా సిబిఐ కస్టడీ కి కోరగా కోర్ట్ ఈ నేల 24 వరకు సమయం ఇచ్చింది అంటూ బాలాజీ తెలిపారు. ఇక కేసులో సిబిఐ విచారణ కేవలం ఆవినాష్ రెడ్డి వైపు నుండి మాత్రమే జరుగుతోందని అన్ని కొనాలలోనూ సిబిఐ విచారణ జరపడం లేదంటూ అభిప్రాయపడ్డారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Actor Fish venkat: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్… పట్టించుకోని కొడుకులు!

Published

on

Actor Fish venkat:మంగిలంపల్లి వెంకటేశ్ అంటే గుర్తుకు రావ‌డం క‌ష్ట‌మే కానీ ఫిష్ వెంక‌ట్ అందరికీ టక్కున గుర్తుకు వస్తారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా ద్వారా ఈయన నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అయితే ఎన్నో సినిమాలలో కామెడీ పాత్రలలో నటించడం మరికొన్ని సినిమాలలో విలన్ పాత్రలలో కూడా నటించారు.

Advertisement

ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు సినిమాలలో నటించే ప్రేక్షకులను మెప్పించిన ఫిష్ వెంకట్ ఇటీవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వెంకట్ కేవలం ఇంటికి మాత్రమే పరిమితమయ్యారు అయితే తాజాగా ఈయన ఆరోగ్య పరిస్థితి తెలిసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.

చాలా రోజుల తర్వాత ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈయన తన కష్టాల గురించి తెలిపారు. కొన్ని సమస్యల క్రితం తన కాలికి చిన్న దెబ్బ తగిలిందని తెలిపారు. అయితే అప్పటికి తనకి బీపీ షుగర్ ఉండడంతో ఇన్ఫెక్షన్ ఎక్కువ కావటం వల్ల సర్జరీ చేశారని అయినప్పటికీ తన కాలిపై చర్మం మొత్తం ఊడిపోతుందని తద్వారా తనకు నడవడానికి కూడా కుదరడం లేదని తెలిపారు.

చికిత్స కోసం లక్షలు ఖర్చు..
మరోవైపు కిడ్నీ ఫెయిల్యూర్ కావడంతో డయాలసిస్ చేయించుకుంటున్నానని అయితే తనకి ఇప్పటికీ సినిమా అవకాశాలు వస్తున్న ఆరోగ్యం సహకరించకపోవడంతో తాను నటించలేదని తెలిపారు. ఇక డయాలసిస్ కోసం లక్షలు ఖర్చు చేయాల్సి ఉందని తన కొడుకులు కూతురు ఆర్థికంగా ఎంతో మంచిగా ఉన్నప్పటికీ తనకు మాత్రం సహాయం చేయడం లేదని తెలిపారు. ఎవర్ని చేయి చాచి అడగలేను అంటూ ఫిష్ వెంక‌ట్ భావోద్వేగానికి గుర‌య్యారు. దీంతో సాయం కోసం ఎదురుచూస్తున్న ఫిష్ వెంక‌ట్ ను టాలీవుడ్ ప్ర‌ముఖులు ఆదుకోవాలి అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Ambulance: ఘోరం… ఆంబులెన్సులో మహిళకు లైంగిక వేధింపులు.. నిండు ప్రాణాన్ని బలి తీశారుగా?

Published

on

Ambulance: మనకు ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే స్పందించి సరైన సమయంలో చికిత్స అందడం కోసం అంబులెన్స్ కు ఫోన్ చేస్తాం వారు కూడా మన ప్రాణాలను నిలబెట్టడానికి వారి ప్రాణాలను కూడా లెక్కచేయరు కానీ ఓ అంబులెన్స్ డ్రైవర్ తన వృత్తిని మరిచిపోయి అంబులెన్స్ లో ఉన్నటువంటి ఓ మహిళ పట్ల లైంగిక వేధింపులకు దిగారు. దీంతో పేషంట్ గా ఉన్న ఆమె భర్త ప్రాణాలను వదిలిన ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

Advertisement

పూర్తి వివరాలలోకి వెళ్తే..ఈ ఘటన లోరి ఘజిపుర్‌లో చోటుచేసుకుంది. మహిళ భర్త అనారోగ్యంతో బాధపడుతున్న తరుణంలో చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. అయితే అక్కడ తగినంత డబ్బు చెల్లించలేకపోవడంతో తిరిగి తన భర్తను ఇంటికి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఒక ప్రైవేట్ అంబులెన్స్ ను మాట్లాడి తన భర్తను అందులో ఎక్కించి ఇంటికి తీసుకు వెళుతున్నారు.

మార్గమధ్యమంలో అంబులెన్స్ డ్రైవర్ తన హెల్పర్ ఆ మహిళ పట్ల లైంగిక వేధింపులకు గురి చేశారు. తనని ముందు సీట్లో కూర్చోవాలని బెదిరించారు. అంతేకాకుండా ఆమెను లైంగికంగా వేధించడంతో ఆంబులెన్స్ లో ఉన్నటువంటి తన భర్త తన సోదరుడు పెద్ద ఎత్తున అరవడంతో ఆంబులెన్స్ డ్రైవర్ ఆ మహిళ దగ్గర 10000 రూపాయలు విలువ చేసే బంగారం లాక్కొని పేషంటును మార్గమధ్యమంలోనే వదిలేసి ఆక్సిజన్ మాస్క్ కూడా తీసుకొని వెళ్ళిపోయారు.

ఆక్సిజన్ తొలగించి..
ఇలా ఆక్సిజన్ తొలగించడంతో సదరు మహిళ భర్త ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. అప్పటికే వేరే అంబులెన్స్ కు ఫోన్ చేసిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆయన ప్రాణాలను కోల్పోయారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ తీరుపట్ల నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి వారికి కఠినంగా శిక్షించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Vijayawada Floods: విషాదం..నలుగురిని కాపాడాడు… వరదల్లో కొట్టుకుపోయాడు! భార్య 8 నెలల గర్భిణి!

Published

on

Vijayawada Floods: ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలలో కురిసిన వర్షాల కారణంగా పెద్ద ఎత్తున వరదలు సంభవించిన సంగతి తెలిసిందే. ఇక ఆంధ్రప్రదేశ్లో విజయవాడ మొత్తం నదులను తలపిస్తోంది. భారీగా కురిసిన వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లడంతో విజయవాడ మొత్తం నీటిలో మునిగిపోయింది. దీంతో ఎంతోమంది అవస్థలు పడుతున్నారు.

Advertisement

ఈ వరదల కారణంగా ఎంతో ప్రాణ నష్టం ఆస్తి నష్టం కూడా జరిగింది. సరైన సమయంలో కనీసం తాగడానికి నీళ్లు లేక ఎంతో మంది ఆకలితో అలమటిస్తున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా హృదయ విదారక ఘటనలు చోటుచేసుకున్నాయి. అయితే ఈ వరదలలో ఎంతో మంది ఇతరులను రక్షించి వారు ప్రాణాలను కోల్పోయిన సంఘటనలను మనం చూస్తున్నాము.

కృష్ణలంకకు చెందిన పలిశెట్టి చంద్రశేఖర్‌(32)కు సింగ్‌నగర్‌లో డెయిరీఫాం ఉంది. ఆయనతో పాటు ఇద్దరు సోదరులు మరో ఇద్దరు డైరీ ఫామ్ లో పనిచేసే వర్కర్లు ఈ వరదల్లో చిక్కుకున్నారు. అయితే ఆ నలుగురిని చంద్రశేఖర్ రక్షించారు. ఇక తన ఫామ్ లో 50ఆవులను తాళ్లతో కట్టేసి ఉంటే వాటన్నింటినీ కూడా విడదీసి తాను కూడా సురక్షితంగా బయటకు రావడం కోసం షెడ్ పైకి వెళ్లడానికి ప్రయత్నం చేశారు.

నలుగురికి ప్రాణదానం..
ఇలా షెడ్ పైకి ఎక్కుతున్న సమయంలో కాలుజారి కింద పడటంతో ఆయన వరదల్లో కొట్టుకుపోయి మరణించారు. అయితే తన డైరీ ఫార్మ్ దగ్గరలోనే తన మృతదేహం కనిపించడంతో తన కుటుంబ సభ్యులు ఎంతగానో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రశేఖర్ కు రెండు సంవత్సరాల క్రితం వివాహం కాగా ప్రస్తుతం తన భార్య 8 నెలల గర్భిణీ. ఇలా తమ ప్రాణాలను రక్షించి చంద్రశేఖర్ ప్రాణాలను కోల్పోవడంతో తన సోదరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!