కొత్తగా ఎదుగుతున్న కరోనా వైరస్.. అందుకే వేగంగా వ్యాప్తి..!

0
132

కరోనా వైరస్ వల్ల గడిచిన 7 నెలల నుంచి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుందో ప్రపంచ ఆరోగ్య సంస్థ దగ్గర స్పష్టమైన ఆధారాలు లేవు. వైరస్ గురించి ఖచ్చితమైన విషయాలు తెలుసుకోవడానికి శాస్త్రవేత్తల పరిశోధనలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత ప్రయత్నిస్తున్నా కట్టడి చేయలేకపోతున్నాయి.

వైద్యులు, శాస్త్రవేత్తలు గతంలో ఏ వైరస్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందలేదని చెబుతున్నారు. అయితే తాజాగా శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో కరోనా వైరస్ ఇంత వేగంగా వ్యాప్తి చెందడానికి సరికొత్త కారణాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికా వైద్య పరిశోధకులు నిన్న కొత్త పరిశోధనలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించారు. కరోనా వైరస్ యొక్క 5,000 జెనిటిక్ సీక్వెన్ లపై ప్రయోగాలు చేసి ఈ విషయాలు తెలిపారు.
 
వైరస్ క్రమంగా మ్యుటేట్ అవుతూ ఉండటంతో పాటు మ్యుటేషన్ వల్ల కరోనా వైరస్ లోనే కొత్తరకం జెనిటిక్ సీక్వెన్సులు తయారవుతున్నాయని వెల్లడించారు. మనుషుల్లో కరోనా వైరస్ లోడ్ ఎక్కువగా కనిపించడానికి వైరస్ మ్యుటేషన్ లోడ్ ఎక్కువ కావడమేనని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మ్యుటేషన్ వల్ల స్పైక్ ప్రోటీన్ మారిపోయి వైరస్ ను కట్టడి చేయడం కష్టమవుతోందని చెప్పారు.
 
అయితే వైరస్ మ్యుటేషన్ చెందినా ప్రమాదకరం కాదని వెల్లడిస్తున్నారు. ప్రతి వైరస్ లోనూ చిన్నచిన్న మార్పులు సహజమేనని వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని వెల్లడిస్తున్నారు. వైరస్ కు ప్రతి రోగి మ్యుటేషన్ కు అవకాశం కల్పిస్తాడని ఎన్ని లక్షల కేసులు నమోదైతే అన్ని ఎక్కువ మ్యుటేషన్లు నమోదు కావచ్చని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here