మన భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో, వాస్తు శాస్త్రానికి కూడా అంతే ప్రాముఖ్యతనిస్తారు. మనం ఏ చిన్న కార్యక్రమం మొదలు పెట్టిన , లేదా మన ఇంట్లో ఏదైనా ఒక వస్తువును పెట్టాలన్న, వాటిని వాస్తు శాస్త్ర ప్రకారం సరైన స్థలంలోనే ఉంచుతాము. అదేవిధంగా మనం ఇంటిని నిర్మించే సమయంలో వాస్తుశాస్త్రం ప్రకారం ఏవిధంగా నిర్మించుకోవాలి అడిగి నిర్మించుకుంటాము. ప్రతి ఒక్కరు వాస్తు శాస్త్రం పై ఎంతో నమ్మకం పెట్టుకుంటారు. పొరపాటున మన ఇంట్లో ఏవైనా వాస్తు లోపాలు ఉంటే ఇంట్లో కష్టాలు ఉంటాయని బావిస్తారు కాబట్టి వాస్తు లోపాలు లేకుండా ఎన్నో జాగ్రత్తలు పడుతుంటారు. అయితే కొన్ని సార్లు మన ఇంట్లో ఏర్పడే వాస్తు లోపాలకు పటిక బెల్లం ద్వారా పరిష్కారం మార్గమని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే పటిక బెల్లం ద్వారా ఏ విధంగా వాస్తు లోపాలను పరిష్కరించుకోవచ్చు ఇక్కడ తెలుసుకుందాం..

పటిక బెల్లం మనకు మార్కెట్లో విరివిగా లభిస్తుంది.ఈ పటిక బెల్లం సరైన క్రమంలో మన ఇంట్లో ఉంచుకోవడం వల్ల మన ఇంట్లో ఎలాంటి వాస్తు లోపాలు ఉండవని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం పటిక బెల్లం తీసుకొని మన ఇంటిలో ఉన్న కిటికీలు, తలుపుల దగ్గర పెట్టడం వల్ల మన ఇంట్లోకి ఎలాంటి ప్రతికూల శక్తి ప్రవేశించదని పండితులు చెబుతున్నారు. అదేవిధంగా మన ఇంటి చుట్టుపక్కల ఏవైనా శిథిలావస్థలో చేరుకున్న ఇల్లు ఉన్నప్పుడు కూడా ఈ విధంగా పటిక బెల్లం పెట్టడం ద్వారా ఆ శిథిలమైన ఇంటి నుంచి వచ్చే ప్రతికూల పరిస్థితులు మన ఇంటి లోనికి ప్రవేశించవు.

పటిక బెల్లంను ఒక నల్లటి వస్త్రంలో కత్తి మన ఇంటికి నాలుగువైపులా ఎవరికీ కనిపించని విధంగా కట్టడంవల్ల మనం ప్రారంభించే ఎటువంటి పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. అదే విధంగా 5 పటిక బెల్లం ముక్కలను తీసుకుని నీలి రంగు పువ్వులతో పూజ చేసి నలుపురంగు వస్త్రంలో కట్టి మన జోబులో పెట్టుకోవడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి పోయి ధన ప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ విధంగా పటిక బెల్లం వాస్తు దోషాలను తొలగించి ధనప్రాప్తి కలగడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.పటిక బెల్లాన్ని ఉపయోగించడం వల్ల మన శరీరంలో ఉన్న వేడి తగ్గుతుందని పండితులు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here