భారత్ లో థర్డ్ వేవ్ ఈ నెలలో వస్తుంది.. జాగ్రత్త అంటున్న నిపుణులు !

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రస్థాయిలో వ్యాపించి ఎంతో మంది యువకులను పొట్టన పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఎంతోమంది పసిపిల్లలు తల్లి తండ్రి లేని అనాధలుగా మిగిలిపోయారు. రెండవ దశ వ్యాపిస్తుందని నిపుణులు ముందుగానే హెచ్చరించినప్పటికీ అధికారులు నిర్లక్ష్యం కారణంగానే భారత్ భారీ మూల్యం చెల్లించింది అని తెలియజేశారు.

ఈ క్రమంలోనే రెండవదశ కరోనా భారతదేశంలో పూర్తిస్థాయిలో వ్యాపించి దేశాన్ని చిగురుటాకుల వణికించింది. అయితే ఈ వైరస్ ను కట్టడి చేయడం కోసం అన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ విధించి, వ్యాక్సినేషన్ ప్రక్రియను శరవేగం చేయటం వల్ల ప్రస్తుతం కేసుల సంఖ్య కొంత మేర తగ్గుముఖం పట్టింది.

రెండవ దశ నుంచి కొంత ఉపశమనం పొందిన భారత్ కి నిపుణులు మరోసారి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. థర్డ్ వేవ్ కరోనా రావడం తథ్యం అని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ తెలియజేశారు. ఇండియాలో థర్డ్ వేవ్ సెప్టెంబర్-అక్టోబర్ నెల మధ్యలో రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.కరోనా థర్డ్ వేవ్ ను ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉండాలని తెలిపారు.

దేశంలో థర్డ్ వేవ్ వచ్చేలోగా వీలయినంత వరకు ప్రతి ఒక్కరు వేయించుకోవాలని, వ్యాక్సిన్ ఒకటే మన ముందున్న అస్త్రమనీ, నీతి అయోగ్ సభ్యులు తెలిపారు. రెండవ దశ కంటే మూడవ దశ మరింత తీవ్రతరంగా ఉండవచ్చని, ఈ వేరియంట్ ను ఎదుర్కోవడానికి దేశం పూర్తిగా సన్నద్ధం కావాల్సిన అవసరం ఉందని తెలిపారు.