జియో కస్టమర్లకు శుభవార్త.. ఉచితంగా 300 జీబీ డేటా..?

0
259

టెలీకాం రంగంలో జియో సృష్టించిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. దేశంలో తక్కువ సమయంలో ఎక్కువ కస్టమర్లను సొంతం చేసుకున్న జియో కొత్తకొత్త ఆఫర్ల ద్వారా వినియోగదారులకు మరింత చేరువవుతోంది. వినియోగదారుల కోసం ఎప్పటికప్పుడు కొత్తకొత్త ప్లాన్స్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. తాజాగా జియో మరో కొత్త ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త పోస్ట్ పెయిడ్ ప్లస్ పేరుతో తెచ్చిన ఈ ప్లాన్ వల్ల వినియోగదారులకు అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి.

జియో పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ ధర కనిష్టంగా 399 రూపాయల నుంచి ప్రారంభం కానుండగా గరిష్టంగా 1,499 రూపాయల వరకు ఉంది. జియో యూజర్లు పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్లను తీసుకుంటే వారు జియో అందించే ఇతర సర్వీసులను కూడా పొందే అవకాశం ఉంటుంది. జియో పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు అమెజాన్ ప్రైమ్, డిస్నీ + హాట్ స్టార్, నెట్ ఫ్లిక్స్ లాంటి సబ్ స్క్రిప్షన్లను ఉచితంగా అందిస్తోంది.

పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్ల ద్వారా 300 జీబీ హైస్పీడ్ డేటా కూడా పొందే అవకాశం ఉంటుంది. యూజర్లు డేటా అయిపోయిన తర్వాత 10 రూపాయలకు 1 జీబీ డేటా చొప్పున పొందవచ్చు. 300 జీబీ డేటాను నెల రోజుల్లో వినియోగించలేకపోతే తరువాత నెలలో ఆ డేటాను వినియోగించుకోవచ్చు. పోస్ట్ పెయిడ్ ప్లస్ ప్లాన్లను ఎంచుకునే వాళ్లు జియో ప్రైమ్ కోసం అదనంగా 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. జియో వినియోగదారులు అమెరికా, యూఏఈ వంటి దేశాలకు సైతం ఉచితంగా కాల్స్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

దేశీయ టెలీకాం రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన జియో త్వరలో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెచ్చే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే జియో ఫోన్ ద్వారా ఫీచర్ ఫోన్ల అమ్మకాల్లో సంచలనం సృష్టించిన జియో స్మార్త్ ఫోన్ అందుబాటులోకి తెస్తే మాత్రం సామాన్య, మధ్య తరగతి వర్గాల ప్రజలకు తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్లు సొంతమయ్యే అవకాశం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here