కామ్నా జెఠ్మలానీ.. ప్రేమికులు చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమైన ఈ భామ పేరు చెప్పగానే అల్లరి నరేష్ కత్తి కాంతారావు, బెండు అప్పారావు వంటి కామెడీ చిత్రాలతో పాటు గోపిచంద్ రణం, నాగార్జన భాయ్ సినిమాలే గుర్తుకొస్తాయి. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి కామ్నా జెఠ్మలానీ. తెలుగులో ఎక్కువ సంఖ్యలోనే సినిమాలు చేసిన కూడా ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో గుర్తింపు అయితే రాలేదు. చిన్న సినిమాలకి, ఐటెం సాంగ్స్ కి పరిమితం అయిపోయిన ఈ అమ్మడు ఆరేళ్ళ క్రితం పెళ్లి చేసుకొని సినిమాలకి దూరం అయిపొయింది.

ప్రముఖ వ్యాపారవేత్త సూరజ్ నాగపాల్‌ను బెంగళూరులో రహస్యంగా వివాహం చేసుకున్న కామ్నా ఆ తరువాత కూడా అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే వుంది ఆసక్తికరమైన విషయమేమిటంటే.. ప్రముఖ న్యాయ కోవిదుడు రాం జెఠ్మలానీకి ఈమె మనవరాలు అనే విషయం చాలా తక్కువ మందికి తెలియదు. ఇక అసలు విషయానికొస్తే ఈమధ్యనే కామ్నా తన ఫ్యామిలీతో చాలా హ్యాపీగా వున్నట్టు కొన్ని ఫోటోలను ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలో భర్త సూరజ్ తోపాటు పిల్లలూ కూడా వున్నారు. మొత్తానికి కామ్నా ఒక మంచి గృహిణిగా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతున్నట్టు ఆ ఫోటోలను చూస్తే ఎవరికైనా ఇట్టే అర్ధమైపోతుంది. కానీ చాలా రోజుల తర్వాత కామ్నా మళ్ళీ ఇలా సోషల్ మీడియా లో రీ ఎంట్రీ ఇవ్వడం వెనుక మతలబు ఏమిటా.?

అని ఎంక్వయిరీ చేస్తే అందరూ ఊహించే నిజాలే వెలుగులోకి వచ్చాయి. అవేమిటంటే.. గతంలో హీరోయిన్స్ గా చేసిన అందాల భామలు మళ్ళీ సినిమాలలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్ళకు తగ్గ పాత్రలు చేస్తూ సందడి చేస్తున్నారు. ఇప్పుడు అదే దారిలో కామ్నా జెఠ్మలానీ కూడా రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యింది. కామ్న తాజాగా తెలుగులో ఓ సినిమాలో నటించడానికి ఓకే చెప్పేసింది. నూతన దర్శకుడు ప్రభు దర్శకత్వంలో రూపొందే చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషించనుంది. ఈ సినిమాలో హీరో, హీరోయిన్స్
కొత్తవాళ్ళు నటిస్తారని తెలుస్తుంది. మరి హీరోయిన్ గా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయిన కామ్నా జెఠ్మలానీ రీ ఎంట్రీ ద్వారా ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది తెరపైనే చూడాలి.




























