Work From Home: ఇంటి దగ్గర పని చేసింది చాలు..! ఇక ఆఫీస్ లకు వచ్చేయండి..!

Work From Home: ఇంటి దగ్గర పని చేసింది చాలు..! ఇక ఆఫీస్ లకు వచ్చేయండి..!

Work From Home: చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అతలాకుతలం చేసింది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో దాడులు చేస్తూనే ఉంది.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఓమిక్రాన్ కేసులు పెరగుతున్నాయి.  కరోనా కారణంగా చాలా దేశాల ఆర్థిక వ్యవస్థలు తలకిందులయ్యాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలు కూడా కోల్పోయారు. ఇక సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రెండేళ్ల నుంచి ఇంటి నుంచే వర్క్ చేస్తున్నారు.

కరోనా కారణంగా ఆఫీసులంతా మూతపడ్డాయి. వరసగా ఫస్ట్, సెకండ్, థర్డ్ వేవ్ లు ఇలా వస్తూనే ఉన్నాయి. దీంతో ఐటీ ఉద్యోగులు ఇళ్లకు పరిమితం అయ్యారు. ఇంటి నుంచే పనులు కొనసాగిస్తున్నారు. ఇటీవల డిసెంబర్, జనవరి నుంచి ఉద్యోగులంతా ఆఫీసులకు రావాలని కంపెనీలు ఆదేశాలు జారీ చేశాయి. అయితే ఆ సమయంలో థర్డ్ వేవ్ రావడంతో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా..


అయితే తాజాగా ఏప్రిల్ నుంచి మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా ఉద్యోగులకు ఇప్పటికే ఆదేశాలు అందాయి. ఇక తెలంగాణ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రావు కూడా ఇక కరోనా ముగిసిందని, ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులను ఆఫీసులకు పిలవాలని తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పటికే రెండేళ్ల నుంచి ఐటీ కంపెనీలు తెరుచుకోకపోవడంతో.. ఆ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. మళ్లీ ఐటీ కంపెనీలు తెరుచుకుంటే.. ఉపాధి లభిస్తుందనే ఆలోచనలో ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే చాలా మంది ఉద్యోగులు సొంతూళ్లకు వెళ్లి వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నారు. వీరందరిని మళ్లీ ఆఫీసులకు రావాల్సిందిగా కంపెనీలు కబురు పెట్టాయి.