జబర్దస్త్ బ్యూటీ రష్మీ గౌతమ్ కెరీర్ ఎలా మొదలైందో తెలుసా.?!

0
197

బుల్లితెర మీద పేరు గడించిన టాప్ యాంకర్లలో రష్మీ గౌతమ్ ఒకరు. సినిమాలతో ఎంట్రీ ఇచ్చినా ఆపై బుల్లితెరపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ.. వచ్చిన సినిమా ఆఫర్లనూ కూడా వదులుకోకుండా వెండితెరపై కూడా ఈమధ్య బిజీ బిజీగానే ఉంటోంది నటి రష్మీ. కెరీర్ స్టార్టింగ్ స్టేజ్‌లోనే  సిల్వర్  స్క్రీన్‌ పైకి ఎంట్రీ ఇచ్చిన వైజాగ్ బ్యూటీ రష్మి గౌతమ్.. కానీ టాలీవుడ్ లో ఊహించినంత సక్సస్ కాలేకపోవడంతో ‘జబర్దస్త్’ అంటూ స్మాల్ స్క్రీన్‌ వైపు అడుగులేసింది. అక్కడ జబర్థస్త్‌ షో బాగా క్లిక్ అవ్వడంతో పాటు తన అందాలతో యువతరాన్ని టీవీలకు అతుక్కుపోయేలా చేసింది. తెలుగు సరిగ్గా రాకపోయినా సరే పట్టుదలగా నేర్చుకుని యాంకరింగ్ చేసి చాలా తక్కువ టైంలోనే తెలుగులో టాప్ యాంకర్స్‌ లిస్ట్‌లో చేరిపోయింది ఈ ముద్దుగుమ్మ.

కెరీర్ పరంగా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నానంటూ ఈమధ్య వార్తల్లో నిలిచింది. యాంకర్‌గా నిలదొక్కుకున్నాక మళ్లీ వెండితెరపై ‘గుంటూర్ టాకీస్‌’ తో రచ్చ చేసింది. తన అందాలతో అటు టాలీవుడ్ ప్రేక్షకులను, ఇటు బుల్లితెర ప్రేక్షకులను తన వైపు తిప్పుకునేలా చేసింది రష్మీ. ప్రస్తుతం సినిమాలు, షోలు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తుంది. ఏదేమైనా ఎంతోమంది తారల మధ్య గట్టి పోటీ ఉన్న సినిమా రంగంలో భాష రాకపోయినా ఈవిధంగా సక్సెస్ కావడమంటే అది సాధారణ విషయం కాదు అందుకే.. రష్మీ ఫ్యాన్స్ అందరూ ఆమె అందానికి దాసోహమంటున్నారు. ఇదిలా వుండగా.. తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపును సంపాదించుకున్న రష్మీ గౌతమ్ కెరీర్ ప్రారంభమైన రోజులను తలుచుకుంటూ ఈమధ్య మీడియాకిచ్చిన ఓ ఇంటర్వ్యలో తన మనోభావాలను షేర్ చేసుకుంది. ఒకప్పుడు ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ కాళ్ళరిగేలా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ లోని స్టూడియోల చుట్టూ తిరిగింది ఈ జబర్దస్త్ బ్యూటీ. 10 ఏళ్ల పాటు నరకం చవి చూసింది. జూబ్లీహిల్స్.. బంజారా హిల్స్.. ఏ సినిమా ఆఫీస్ పడితే ఆ సినిమా ఆఫీసు.. రష్మీ తిరగని ఆఫీసే లేదు. ఆమె కలవని టాలీవుడ్ ప్రముఖులే లేరు. అలా ప్రతీ ఆఫీస్‌ కు వెళ్లి ఫోటోలు ఇవ్వడమే కాకుండా ఆడిషన్స్ కూడా చేసింది.

హోలీ, కరెంట్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ లో నటించినా సరే కాలం కలసిరాక రష్మికి తగినంత గుర్తింపు రాలేదు. సరిగ్గా అలాంటి టైంలో ‘జబర్దస్త్’ షో యాంకర్ అనసూయ ప్రెగ్నెంట్ కావడంతో రష్మీకి అనుకోకుండా ‘జబర్దస్త్’ షోలో యాంకర్ గా అవకాశం వచ్చింది. కొన్ని వారాల పాటు అనసూయ తప్పుకోవడంతో రష్మి గౌతమ్‌కు కలిసొచ్చింది. ఆ తర్వాత ఆ షో సూపర్ హిట్టవ్వడం.. రష్మీ క్రేజ్ పెరగడం తెలిసిందే..! బుల్లితెరపై సక్సెస్ సాధించిన ఈ బ్యూటీ వెండితెరపై కూడా హిట్ కొట్టాలన్న ధృఢ నిశ్చయంతో సినిమాల్లో నటించేందుకు ఏ చిన్న ఆఫర్ వచ్చినా కూడా కాదనకుండా చేస్తానని బంపర్ ఆఫర్ కూడా ఇచ్చింది. ఆ విధంగా కొన్ని సినిమాలలో వరుసగా హీరోయిన్ స్నేహితురాలి పాత్రల్లో నటించింది. కానీ పెద్ద దర్శకులతో పని చేసినా కూడా రష్మిని టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ పట్టించుకోలేదు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here