Karate Kalyani : ఎన్టీఆర్ ఎమన్నా దేవుడా… ఖమ్మం లోని యాదవులకు బుద్ధిలేదు… వాళ్లంతా పిచ్చోళ్ళు…: కరాటే కళ్యాణి

0
210

Karate Kalyani : తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ ఖమ్మం లకారం రోడ్డులో ట్యాంక్ బండ్ రోడ్డులో శ్రీకృష్ణుడు విగ్రహం ఆవిష్కరణ కు పునుకోవడం, ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్బంగా ఎన్టీఆర్ కృషుడు రూపాన్ని విగ్రహంగా పెట్టడం పట్ల హిందూత్వ సంఘంకి చెందిన సినీ నటి కరాటే కళ్యాణి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. యాదవ సంఘాలతో కలిసి విగ్రహ ఆవిష్కరణ అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఈ ఇష్యూ రోజు రోజుకి సీరియస్ అవడం కరాటే కళ్యాణి మాత్రం ఏమాత్రం నేను తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఖమ్మం యాదవ కులస్థుల మీద మండిపడ్డారు.

ఎన్టీఆర్ దేవుడు కాదు…

ఎన్టీఆర్ గారిని ఒక కళాకారుడిగా నాయకుడిగా నేను గౌరవిస్తాను కానీ శ్రీకృష్ణుడిని ఎన్టీఆర్ రూపంలో పెట్టడం అనేది వేరే విషయం, ఇది నేను ఖండిస్తున్నాను అంటూ చెప్పారు కల్యాణి. కొన్ని తరాలు పోయాక అప్పటి వారు శ్రీకృష్ణుడు అంటే ఎన్టీఆర్ అనుకునే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒక విగ్రహం జీవితకాలం దాదాపు 400 ఏళ్ళు, అన్ని సంవత్సరాలకు అప్పటి వాళ్లకు కృష్ణుడు ఎన్టీఆర్ అయిపోతాడు. అయినా ఎన్టీఆర్ ఎన్నో పాత్రలు పోషించారు. అలా అన్ని పాత్రలను విగ్రహాలుగా పెడతారా అంటూ ఫైర్ అయ్యారు.

ఆయన మనిషి దేవుడు కాదు. దేవుడి రూపం మనిషి లాగా పెట్టడం ఏమిటి?? ఆయన మీద కోపం ఉన్నవారు అయన కృష్ణుడు రూపంలో ఉన్న పోస్టర్ మీద పెడ వేస్తే అపుడు ఎన్టీఆర్ మీద వేసినట్లా లేక కృష్ణుడి మీద వేసినట్లా?? జరగబోయే ప్రమాదాల దృష్ట్యా నేను పోరాడుతున్నాను నాకు పలు కుల సంఘాల నుండి కూడా మద్దతు ఉంది. ఖమ్మంలో యాదవులు పిచ్చోళ్ళు కాబట్టే విగ్రహం ఏర్పాటుకు ఒప్పుకున్నారు అంటూ తెలిపారు.