Nara Lokesh: ఆ పత్రిక పై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన నారా లోకేష్! కారణం అదేనా?

Nara Lokesh: ఆ పత్రిక పై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన నారా లోకేష్! కారణం అదేనా?

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం విశాఖపట్నం వెళ్లారు. అయితే గతంలో తన గురించి ఓ వార్తాపత్రిక అసత్య వార్తలను ప్రచారం చేయడంతో ఆయన ఈ విషయం పై పరువు నష్టం దావా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ విచారణలో భాగంగా క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియకు స్వయంగా నారా లోకేష్ హాజరయ్యారు.

Nara Lokesh: ఆ పత్రిక పై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన నారా లోకేష్! కారణం అదేనా?
Nara Lokesh: ఆ పత్రిక పై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన నారా లోకేష్! కారణం అదేనా?

గురువారం ఈ విచారణకు హాజరైన లోకేష్ విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన లోకేష్ గతంలో తను ప్రజాధనంతో 25 లక్షల విలువచేసే చిరుతిండ్లను తిన్నారని ప్రముఖ వార్తా పత్రిక అసత్య వార్తలను ప్రచారం చేయడమే కాకుండా మరో
మేగ‌జీన్ కూడా ఇదే త‌ర‌హా క‌థ‌నాల‌ను రా సాయి అని లోకేష్ తెలియజేశారు.

Nara Lokesh: ఆ పత్రిక పై 75 కోట్ల పరువు నష్టం దావా వేసిన నారా లోకేష్! కారణం అదేనా?

ఆ విషయం పై ఆధారాలతో సహా వాస్తవాలను తెలియజేయడంతో సదరు మేగ‌జీన్ తనకు క్షమాపణలు చెప్పిందని తెలియజేశారు. అయితే మరొక పత్రికఇప్పటివరకు తన వివరణను ప్రచురించలేదని ఈ క్రమంలోనే ఆ పత్రికపై నారా లోకేష్ 75 కోట్ల పరువు నష్టం దావా వేసి నట్లు వెల్లడించారు.

విచారణ పూర్తి కాకుండా కుట్రలు….

ఇక ఈ కేసు గత కొన్ని నెలల నుంచి విచారణ జరుగుతోందని, ఈ కేసు విచారణ పూర్తి కాకుండా కొందరు ఉద్దేశపూర్వకంగానే అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే ఈ కేసు మాత్రం ఈనెల 28వ తేదీలోగా పూర్తిచేయాలని ప్రధాన న్యాయమూర్తి భావిస్తున్నారని లోకేష్ మీడియాకు తెలియజేశారు.