మాస్కులతో పిల్లలో కొత్త సమస్య.. ఏమిటంటే?

0
178

గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా వ్యాపించడంతో ప్రజలందరూ ఎంతో ఆందోళన చెందుతూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ఈ మహమ్మారి వృద్ధులలో చిన్నపిల్లలలో తొందరగా ప్రభావం చూపించడం వల్ల ఇంట్లో చిన్న పిల్లల దగ్గరికి వెళ్లే ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించి వలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా మాస్కులు ధరించడం వల్ల చిన్న పిల్లలలో మన ముఖకవళికలను పిల్లలు గుర్తించలేకపోతున్నారు.

ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత పుట్టిన పిల్లలలో ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని చిన్న పిల్లల వైద్యులు తెలుపుతున్నారు.వారి దగ్గరికి వెళ్లిన ప్రతిసారి మనం మాస్కులు ధరించడం వెళ్ళడం వల్ల మనం చేసే సైగలను వారు గ్రహించలేకపోతున్నారు. చిన్నపిల్లలు ముఖ్యంగా మాటల కంటే మన చేష్టలకు తొందరగా ప్రతిస్పందిస్తారు.అయితే కరోనా తర్వాత పుట్టిన పిల్లలలో ఏ విధమైనటువంటి స్పందన లేదని ఎంతో మంది తల్లిదండ్రులు డాక్టర్ల సలహా తీసుకుంటున్నట్లు తెలిపారు.

ఈ కరోనా మహమ్మారి వల్ల పిల్లలు వివిధ రకాల మార్పులకు కారణమవుతున్నాయి అంటే అవుననే అంటున్నారు నిపుణులు. ఈ మహమ్మారి ఈ కారణంగా మనం నిత్యం మాస్కులు ధరించడం వల్ల మన హావభావాలను పిల్లలు పసిగట్ట లేకపోతున్నారు. అయితే ఇది ఎప్పటికీ ఇలాగే ఉండదని నిపుణులు చెబుతున్నారు. కాకపోతే కొద్దిగా ఆలస్యంగా పిల్లలు పెద్దవారి హావభావాలను గుర్తిస్తారని తెలిపారు.

కరోనా ప్రభావం అధికంగా ఉండటం వల్ల పిల్లలను గుమ్మం దాటి బయటకు రానివ్వడం లేదు. దీంతో పిల్లల్లో ఉండాల్సిన చురుకుదనం కూడా కోల్పోతుందని నిపుణులు తెలిపారు. సాధారణంగా పిల్లలు ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటేనే వారిలో ఎంతో చురుకుదనం ఉంటుంది. అయితే కరోనా వల్ల పసి పిల్లల్లో చురుకుదనం కూడా కోల్పోతున్నట్లు తెలిపారు.

ఈ విధమైన పరిస్థితుల నుంచి బయటపడాలంటే ప్రతి ఒక్కరు తప్పకుండా మాస్కు ధరించి, ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకొని ఈ మహమ్మారిని తరిమికొట్టగలిగినపుడే స్వేచ్ఛగా బయట తిరగగలం. కనుక ప్రతి ఒక్కరు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ వ్యాధి వ్యాప్తిని కట్టడి చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here