Rana Naidu: రానా నాయుడు వెబ్ సిరీస్ పై కామెంట్స్ చేసిన నటుడు శివకృష్ణ… ఇది మన సంస్కృతి కాదంటూ కామెంట్స్!

0
21

Rana Naidu: కరోనా సమయంలో థియేటర్లు మూతపడటంతో ఓటీటీలకు మంచి ఆదరణ వచ్చింది. అయితే సినిమాలకు మాదిరిగా ఓటీటీలలో ప్రసారమయ్యే సినిమాలు వెబ్ సిరీస్ లకు సెన్సార్ లేకపోవడంతో అడల్ట్ కంటెంట్ మొత్తం ఓటీటీలలో ప్రసారమవడంతో ఎంతోమంది ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు వెబ్ సిరీస్ లను చూసి చెడిపోతున్నారంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఒకప్పుడు సెన్సార్ సభ్యుడిగా ఉన్నటువంటి నటుడు శివకృష్ణ తాజాగా ఒక వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ తాను తాజాగా ఒక వెబ్ సిరీస్ చూశానని, ఆ వెబ్ సిరీస్ చాలా దారుణంగా ఉందని ఆల్మోస్ట్ అది ఒక బ్లూ ఫిలిం లా ఉందని ఈయన మండిపడ్డారు.

ఈ మధ్యకాలంలో ఇలాంటి దారుణమైన సినిమాలు వెబ్ సిరీస్ తాను చూడలేదని ఇలాంటి వెబ్ సిరీస్ లు మన సంస్కృతి సాంప్రదాయాలు కాదంటూ ఈయన మండిపడ్డారు.భార్యాభర్తలు పడక గదిలో పడుకున్నప్పుడు తలుపులు తీసేయడం పిల్లలు చూడటం ఏంటి? ఇది అసలు మన సంస్కృతేనా? ఇలాంటివి చూసి పిల్లలు చెడిపోతున్నారని ఈయన మండిపడ్డారు.

Rana Naidu: వెబ్ సిరీస్ లకు సెన్సార్ తప్పనిసరి….

ఒక దేశం ఆర్థికంగా నష్టపోతే తిరిగి కోలుకోవచ్చు కానీ సంస్కృతి సాంప్రదాయాలను కనుక నష్టపోతే తిరిగి తిరిగి దేశాన్ని కాపాడటం చాలా కష్టమని తెలిపారు. అందుకే ఓటిటిలలో కూడా ప్రసారమయ్యే సినిమాలు వెబ్ సిరీస్ లకు కూడా సెన్సార్ తప్పనిసరి అంటూ ఈ సందర్భంగా ఈయన తెలిపారు. ఇక ఈయన వెబ్ సిరీస్ పేరు ప్రస్తావించకుండా సంచలన వ్యాఖ్యలు చేయడంతో ప్రతి ఒక్కరు ఈయన రానా నాయుడు వెబ్ సిరీస్ గురించి మాట్లాడారని భావిస్తున్నారు.