Connect with us

Featured

Revanth Reddy: జగన్ ఓటమికి అదే ప్రధాన కారణం.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Published

on

Revanth Reddy: 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ప్రభుత్వం ఘోరమైన ఓటమిని చవి చూసింది. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వం ఈసారి కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావడంతో ఈ ఓటమిపై ఇంకా వైసీపీ అభిమానులు ఈ ఫలితాల నుంచి బయటపడలేకపోతున్నారు.

ఇక జగన్మోహన్ రెడ్డి సైతం ఈ స్థాయిలో ఓటమి ఎదుర్కోవడానికి గల కారణాలు ఏంటి అనే విషయంపై పెద్ద ఎత్తున పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులతో భేటీ అయి ఓటమికి గల కారణాలను అడిగి తెలుసుకుంటున్నారు. ఇకపోతే తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓటమికి గల కారణాలను తెలిపారు.

జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులే ఆయన ఓటమికి కారణాలని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రత్యర్థులపై కక్ష కట్టి పాలనను విస్మరించారని తెలిపారు. మనం చేసిన పాపాలు మనల్ని మింగుతాయని చెప్పటానికి ఇదే నిదర్శనమని రేవంత్ రెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పై నమ్మకంతో రాష్ట్ర ప్రజలు ఆయనకు 151 సీట్లను ఇచ్చారని తెలిపారు.

Advertisement

జగన్ తప్పు చేశారు..
ఆయన తప్పులు చేయటంతోనే అదే ప్రజలు గద్దె దించారని తెలిపారు. ఇక ఈయన తన ఎమ్మెల్యేలను ఎంపీలను కూడా దగ్గరకు రానిచ్చేవారు కాదని తద్వారా వారంతా ఇతర పార్టీలలోకి వెళ్లి నేడు ఎంపీలుగా మంత్రులుగా కూడా కొనసాగుతున్నారని తెలిపారు. జగన్ నిర్ణయాలతో ఏపీలో పరిశ్రమలు కుప్పకూలాయన్నారు. ఫలితంగా రాష్ట్రం పైన ప్రభావం చూపిందని చెప్పారు. చంద్రబాబు తనకు ఫోన్ చేస్తేనే హైదరాబాద్ లో జగన్ ఇంటి వద్ద కూల్చివేతలు జరిపించాననే విమర్శల్లో వాస్తవం లేదని తెలిపారు.

Advertisement
Continue Reading
Advertisement

Featured

Pawan Kalyan: తెలంగాణ రాజకీయాలపై పవన్ కామెంట్స్.. ఇక్కడ కూడా బీజేపీతో పొత్తు అంటూ?

Published

on

Pawan Kalyan: సినీ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈయనకు భక్తి భావం ఎక్కువ అనే సంగతి మనకు తెలుసు. ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్న పవన్ కళ్యాణ్ కొండగట్టు అంజన్న ఆలయానికి వెళ్లి స్వామి వారి ఆశీస్సులు తీసుకొని తన పనులను ప్రారంభిస్తూ ఉంటారు..

ఈ క్రమంలోనే ఈయన రాజకీయాలలో సంచలన విజయం అందుకోవడమే కాకుండా ఉపముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారి ఉపముఖ్యమంత్రి హోదాలో కొండగట్టు అంజన్న ఆలయానికి వచ్చారు. ఈ ఆలయంలో పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఇక పవన్ కళ్యాణ్ వస్తున్నారనే విషయం తెలియడంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున భద్రత చర్యలను చేపట్టారు.

ఇక స్వామివారి దర్శనం పూజా కార్యక్రమాల అనంతరం పవన్ కళ్యాణ్ తెలంగాణలో తన పార్టీ ఏర్పాటుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలపై జనసేన ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పవన్ మాట్లాడుతూ..తెలంగాణలో కూడా బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పనిచేస్తాయని పవన్ పేర్కొన్నారు. జై జనసేన జై బీజేపీ జై తెలంగాణ అంటూ పవన్ కల్యాణ్ నినాదాలు చేయడం గమనార్హం.

Advertisement

బీజేపీతో పొత్తు..
కొండగట్టు పర్యటన ముగించుకొని వచ్చిన తరువాత తెలంగాణ జనసేన పార్టీ నేతలతో పవన్ భేటీ అవుతారని సమాచారం. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ బలోపేతం అవుతుంది. ఇటీవల ఎంపీ ఎన్నికల్లో ఏకంగా ఎనిమిది నియోజకవర్గాల్లో ఆ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. ఈ క్రమంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అక్కడ కూడా బిజెపి జనసేన పార్టీని బలోపేతం చేయడం కోసం పవన్ కళ్యాణ్ పావులు కదుపుతున్నారని తెలుస్తోంది.

Advertisement
Continue Reading

Featured

Sneha Reddy: ప్రభాస్ బుజ్జికి ఫిదా అయిన బన్నీ వైఫ్.. ఏం చేసిందంటే?

Published

on

Sneha Reddy: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మహా భారతంతో పాటు కలియుగ అంతం రెండింటినీ కనెక్ట్ చేస్తూ ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఆదరణ సొంతం చేసుకుంది.

ఇలా ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో సెలబ్రిటీల నటన ఓక ఎత్తు అయితే బుజ్జి పాత్ర కూడా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచిందని చెప్పాలి. ఈ బుజ్జి కారు సినిమాలో వింత విన్యాసాలు చేస్తూ సినిమా హైలైట్ అవ్వడానికి ప్రధాన కారణం కూడా అయింది.

ఈ సినిమాలో ప్రభాస్ ఉపయోగించిన ఈ బుజ్జి కారు దేశవ్యాప్తంగా వివిధ నగరాలలో తిరుగుతూ సినిమాని భారీ స్థాయిలో ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కూడా బుజ్జి కారును చూడటానికి పెద్ద ఎత్తున ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి బుజ్జి కారులో ఎక్కి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు.

Advertisement

ఏడు కోట్ల రూపాయలు..
ఇదిలా ఉండగా తాజాగా అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహారెడ్డి సైతం బుజ్జి కారులో ఎక్కి తన సంతోషాన్ని వ్యక్తం చేసుకున్నారు. ఇలా ఇటీవల బుజ్జి కారు ఎక్కిన ఈమె అక్కడ దిగిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఇక ఇందులో స్నేహ రెడ్డి స్నేహితులతో పాటు డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా ఉన్నారు. ఇక ఈ కారు టెక్ మహేంద్ర వారి సహాయంతో సుమారు ఏడు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాగ్ అశ్విన్ ప్రత్యేకంగా తయారు చేయించిన సంగతి తెలిసిందే.

Advertisement
Continue Reading

Featured

Amani: ఆరుసార్లు అబార్షన్.. నరకం చూసాను.. ఆమని సంచలన వ్యాఖ్యలు!

Published

on

Amani: తెలుగు సినీ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు నటి ఆమని. ఈమె సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున రాజేంద్రప్రసాద్ వంటి స్టార్ హీరోలు అందరి సరసన నటించి మెప్పించారు. ఇలా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలుగుతున్నటువంటి ఆమని అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చారు.

ఇలా పెళ్లి తర్వాత కొంతకాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్నటువంటి ఈమె ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న ఆమని ఇటీవల మ్యూజిక్ షాప్ మూర్తి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఈమె వరస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన విషయాల గురించి కూడా తెలియజేస్తున్నారు.

ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ తాను సినిమాలు చేసే సమయంలో హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను ముఖ్యంగా చాలా డైట్ ఫాలో కావటం వల్ల నాకు తెలియకుండానే నేను చాలా వీక్ అయిపోయానని తెలిపారు. ఇలా నా బాడీలో ప్రోటీన్‌ ఎస్‌ అనేది తక్కువగా ఉండటంతో పిల్లలు కలగలేదు ఏకంగా ఆరుసార్లు తాను ప్రెగ్నెంట్ అయినప్పటికీ అబార్షన్ అయిందని తెలిపారు.

Advertisement

మానసికంగా నలిగిపోయాను..
ఎందుకు ఇలా జరుగుతుందో తెలియక డాక్టర్లు కూడా తలలు పట్టుకున్నారు అయితే తనకు ఇన్నిసార్లు అబార్షన్ కావడంతో నరకం అనుభవించానని, మానసికంగా ఎంతో కృంగిపోయానని తెలిపారు అయితే చివరికి ఒక డాక్టర్ నా సమస్యను గుర్తించి ట్రీట్మెంట్ చేశారు అప్పుడు తనకు పిల్లలు కలిగారు అంటూ ఈమె తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!