Connect with us

Featured

Roshan: వామ్మో శ్రీకాంత్ కొడుకు రోషన్ స్పీడ్ మామూలుగా లేదుగా.. ఆ బడా బ్యానర్లలో అవకాశం!

Roshan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వారసులు రావడం సర్వసాధారణం. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ

Published

on

Roshan: సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వారసులు రావడం సర్వసాధారణం. ఇప్పటికే మెగా కాంపౌండ్ నుంచి ఎంతోమంది వారసులు ఇండస్ట్రీలోకి వచ్చి తమకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ క్రమంలోనే శ్రీకాంత్ వారసుడిగా ఆయన పెద్ద కుమారుడు రోషన్ టీనేజ్ లోనే నిర్మలా కాన్వెంట్ చిత్రం ద్వారా వెండితెర అరంగ్రేటం చేశారు.

Advertisement
Roshan: వామ్మో శ్రీకాంత్ కొడుకు రోషన్ స్పీడ్ మామూలుగా లేదుగా.. ఆ బడా బ్యానర్లలో అవకాశం!
Roshan: వామ్మో శ్రీకాంత్ కొడుకు రోషన్ స్పీడ్ మామూలుగా లేదుగా.. ఆ బడా బ్యానర్లలో అవకాశం!

ఈ సినిమా తర్వాత రోనంకి దర్శకత్వంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లిసందడి సినిమాకి సీక్వెల్ చిత్రంగా తెరకెక్కిన పెళ్లిసందD సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా పెద్దగా ప్రేక్షకులను సందడి చేలేకపోయినప్పటికీ హీరోగా ముందు ముందు మంచి అవకాశాలను అందుకుంటాడు అనే పేరు సంపాదించుకున్నారు.

Roshan: వామ్మో శ్రీకాంత్ కొడుకు రోషన్ స్పీడ్ మామూలుగా లేదుగా.. ఆ బడా బ్యానర్లలో అవకాశం!
Roshan: వామ్మో శ్రీకాంత్ కొడుకు రోషన్ స్పీడ్ మామూలుగా లేదుగా.. ఆ బడా బ్యానర్లలో అవకాశం!

ఆ రెండు బ్యానర్లలో అవకాశం దక్కించుకున్న రోషన్..

ఇలా పెళ్లి సందD సినిమా తర్వాత రోషన్ తన తదుపరి చిత్రాలను చేయడం కోసం రెండు బడా బ్యానర్లను లైన్లో పెట్టినట్లు తెలుస్తోంది. వైజయంతీ మూవీస్ వారి బ్యానర్లో ఒక సినిమా చేయడానికి రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అదేవిధంగా సితార బ్యానర్ లో మరో సినిమా చేయడానికి రోషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ బ్యానర్ లో రోషన్ తో సినిమా చేసే దర్శకులు ఎవరు అనే విషయాలు తెలియాల్సి ఉంది.ఏది ఏమైనా ఇండస్ట్రీలోకి వచ్చిన వెంటనే ఇలా పెద్ద బ్యానర్లో సినిమా చేసే అవకాశాన్ని దక్కించుకోవడం చూస్తుంటే రోషన్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకోవడం గ్యారెంటీ అని తెలుస్తోంది.

Advertisement

Featured

Sharmila: రూటు మార్చిన వైఎస్ షర్మిల.. అన్నయ్య చెంతకు చేరనున్నారా.. ఇక బాబుకి చుక్కలే?

Published

on

Sharmila: ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేక పరిస్థితులలో పీసీసీ అధ్యక్షురాలుగా నియమింపబడ్డారు. ఇక ఈమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం కంటే తన అన్నయ్య జగన్మోహన్ రెడ్డిని తొక్కేయాలనే కంకణం కట్టుకున్నారు. ఈ క్రమంలోనే తన అన్నయ్యకు ఓట్లు వేయొద్దని తనని ఓడించాలి అంటూ బహిరంగంగా ప్రచార కార్యక్రమాలలో తెలిపారు.

Advertisement

ఇక ఈమె అనుకున్నట్టుగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓటమిని చవిచూశారు. ఇక జగన్ ఓడిపోయినా ఈమె జగన్ తీరు పట్ల విమర్శలు చేస్తూనే వచ్చారు. దీంతో ఒకింత వైకాపా నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం షర్మిల రూట్ మార్చారని తెలుస్తుంది. వైయస్ జగన్మోహన్ రెడ్డి గురించి ఇటీవల కాలంలో ఎక్కడ ప్రస్తావించలేదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల గురించి ఈమె ప్రశ్నలు వేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని ముందు హామీలను నెరవేర్చాలంటూ సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి ఈమె ఆర్టిసీ బస్సు ఎక్కి మరి ప్రశ్నించారు. పక్క రాష్ట్రాలైన తెలంగాణ కర్ణాటక ప్రభుత్వాలు కొలువు దీరిన వెంటనే ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాయి.

ఉచిత బస్సు ఎక్కడ…
ఏపీలో ఎందుకు ఉచిత బస్సు ప్రయాణం పథకం ఆలస్యం అవుతుంది అంటూ ఈమె ప్రశ్నించారు. ఇలా షర్మిల స్పీడు చూస్తుంటే ఇకపై జగన్మోహన్ రెడ్డి జోలికి వెళ్ళదని చంద్రబాబు నాయుడు పాలనను ప్రశ్నించబోతున్నారని తెలుస్తోంది.

Advertisement

Advertisement
Continue Reading

Featured

Sri Reddy Vs shyamala: శ్రీ రెడ్డి వర్సెస్ శ్యామల.. యాంకర్ పై నిప్పులు చెరిగిన శ్రీరెడ్డి!

Published

on

Sri Reddy Vs shyamala: సినీ ఇండస్ట్రీలో సంచలన తారగా గుర్తింపు పొందిన నటి శ్రీరెడ్డి వ్యవహార శైలి గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ ఈమెను బ్యాన్ చేయడంతో చెన్నైలో ఉంటూ సినిమా ఇండస్ట్రీకి రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి చాలా బోల్డ్ గా మాట్లాడుతూ వార్తలలో నిలుస్తుంటారు.

Advertisement

ఇన్ని రోజులు వైకాపా పార్టీకి మద్దతు తెలిపిన శ్రీ రెడ్డి ఇటీవల కాలంలో తమకు పార్టీ నుంచి ఏ విధమైనటువంటి మద్దతు లేదని ఎన్నో సందర్భాలలో వైకాపా నాయకులపై అధినేత జగన్మోహన్ రెడ్డి పై కూడా విమర్శలు చేశారు. ఇకపోతే తాజాగా మరో యాంకర్ శ్యామల గురించి ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం సంచలనగా మారింది.

శ్యామలకు ఇటీవల వైకాపా పార్టీ తనని అధికార ప్రతినిధిగా నియమించడంతో ఈమె పార్టీ వ్యవహారాలలో చాలా చురుగ్గా ఉంటున్నారు. వరుస ప్రెస్ మీట్ లు పెడుతున్నారు. ఇక ఈ విషయంపై శ్రీ రెడ్డి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. శ్యామలకు పార్టీలో ఇలాంటి పదవి ఇవ్వడంతో బహుశా శ్రీరెడ్డి నొచ్చుకుందేమో అందుకే నిర్మోహమాటం లేకుండా శ్యామల ఫోటోని షేర్ చేస్తూ మరి ఇలాంటి పోస్ట్ చేశారు.

మూతి వంకర..

Advertisement

అదృష్టం అంటే ఈమెదే… ఏమీ పార్టీ కోసం పని చెయ్యకపోయినా అందలం ఎక్కించారు. జై వైఎస్సార్సీపీ, బెదిరింపులు, తిట్లు ఏమో మాకు పోస్టింగులు, ప్రెస్ మీట్ లు మూతి వంకర అందగత్తెలకి అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూస్తే కనుక శ్యామలకు అలాంటి పదవి ఇవ్వడంతో శ్రీరెడ్డి చాలా హర్ట్ అయ్యారని స్పష్టంగా తెలుస్తుంది.

Advertisement
Continue Reading

Featured

Upasana: అత్తమామల ప్రవర్తన పై కన్నీళ్లు పెట్టుకున్న ఉపాసన… ఇన్నాళ్లకు బయటపెట్టిన మెగా కోడలు?

Published

on

Upasan: మెగా కోడలు ఉపాసన అందరికీ ఎంతో సుపరిచితమే. ఈమె రామ్ చరణ్ భార్యగా,మెగా ఇంటి కోడలుగా మాత్రమే కాకుండా అపోలో హాస్పిటల్ వ్యవహారాలన్నింటిని కూడా చక్కదిద్దుతూ బిజినెస్ ఉమెన్ గా కూడా గుర్తింపు పొందారు. ఇక ఉపాసన తన వృత్తిపరమైన విషయాలలో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా కనిపిస్తారు.

Advertisement

తనకు సంబంధించిన అన్ని విషయాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇదిలా ఉండగా తాజాగా ఉపాసన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె పెళ్ళికి ముందు తన గురించి వచ్చిన బాడీ షేమింగ్ కామెంట్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

పెళ్లికి ముందు నేను కాస్త బొద్దుగా ఉండే దాన్ని దీంతో తన చుట్టూ ఉండేవారు తనని ఎన్నో కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ వల్ల నేను కాస్త బాధపడ్డాను కానీ వాటిని నా మనసు వరకు తీసుకువెళ్లలేదు. మన చుట్టూ ఉన్న వందల మంది మాట్లాడే మాటలను మనం పట్టించుకుంటే చాలా కష్టం. మనల్ని ప్రేమించేవారు మాట్లాడినప్పుడే మనం వాటి గురించి ఆలోచించాలని తెలిపారు.. ఇక పెళ్లి తర్వాత కూడా నా గురించి ఎన్నో కామెంట్లు వచ్చాయి కానీ అత్తయ్య మామయ్య ఎక్కడ నన్ను ఇబ్బంది పెట్టలేదు.

చాలా కేర్ తీసుకుంటారు..
నాకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారు నన్ను చూసుకున్నారు నా పట్ల చాలా కేర్ తీసుకున్నారు. కొన్నిసార్లు చరణ్ అత్తయ్య మామయ్య చూపించే ప్రేమకు నాకు కన్నీళ్లు వస్తుంటాయి. వారు అంత ప్రేమను చూపిస్తారంటూ ఈమె ఎమోషనల్ అయ్యారు. ఇలా తన అత్తమామల గురించి భర్త చూపించే ప్రేమ గురించి ఉపాసన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Advertisement
Continue Reading
Advertisement

Trending

Don`t copy text!