గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.. విషయం ఏంటంటే..?

ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న జీతాల పెంపురానే వచ్చేసింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. సమగ్ర శిక్షణ, కస్తూరిభాగాంధీ విద్యాలయాల్లో ఔట్ సోర్సింగ్ కాంట్రాక్టు ప్రాతి పదికన పని చేస్తున్న ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఈ సంస్థల్లో పని చేస్తున్న ప్రతీ ఒక్క ఔట్ సోర్సింగ్ ఉద్యోగి జీతాలు పెంచుతన్నట్లు పేర్కొన్నారు. ఆ ఉద్యోగులకు జీతాలు మొదట 20 శాతం వేతనాలు పెంచాలనే ఆలోచన ఉండగా.. మరికొన్ని ఎలిమెంట్స్ ను దృష్టిలో ఉంచుకొని..30 శాతం పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కారు. అంతే కాకుండా మరో బొనాంజాను ప్రకటించారు.

ఈ పెంచిన జీతాలను ఈ నెల నుంచి కాకుడా 2021 జూన్ మాసం నుంచి అమలు చేయనున్నట్లు కూడా పేర్కొన్నారు. అంటే ఆరు నెలల జీతం అదనంగా రానుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని.. సమర్థవంతంగా పని చేస్తున్నారాని కితాబిచ్చారు. ఇక ముందు కూడా ఇలాంటి పనితనమే చూపించాలని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇక వర్క్ విషయంలో గానీ.. పని చేసే ప్రదేశంలోగానీ ఎమైనా సమస్యలు ఉంటే.. వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రభుత్వం ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీనికి సంబంధించి అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఈ నిర్ణయంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ధన్యవాదాలు అంటూ.. కృతజ్ఞతలు తెలియజేశారు. మరి కొంతమంది అయితే స్వీట్స్ పంచి పెట్టారు.