బ్యాంక్ అకౌంట్ ఉన్నవాళ్లు, బ్యాంకులలో తరచూ లావాదేవీలను నిర్వహించే వాళ్లు బ్యాంకు సెలవుల గురించి తప్పనిసరిగా అవగాహన ఏర్పరచుకోవాలి. కరోనా విజృంభణ, లాక్ డౌన్ అమలు వల్ల దేశంలోని పలు ప్రాంతాల్లో బ్యాంకుల టైమింగ్స్ లో సైతం మార్పులు చోటు చేసుకున్నాయి. బ్యాంకు సెలవుల గురించి అవగాహన లేకపోతే లావాదేవీల నిర్వహణ సమయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

డిసెంబర్ నెలలో ఏకంగా 7 రోజులు బ్యాంకులకు సెలవు దినాలుగా ఉన్నాయి. ప్రతి నెల రెండవ శనివారం, నాలుగవ శనివారం బ్యాంకులకు సెలవు అనే సంగతి మనందరికీ తెలిసిందే. అయితే డిసెంబర్ నెలలో క్రిస్ మస్ మినహా మరో పండుగ లేకపోవడంతో ఇతర నెలలతో పోలిస్తే ఈ నెలలో సెలవులు తక్కువగా ఉన్నాయి. ముందుగా సెలవులపై అవగాహనను ఏర్పరచుకోవడం ద్వారా అందుకు తగిన విధంగా మన ప్రణాళికలలో మార్పులు చేసుకోవడం సాధ్యమవుతుంది.

డిసెంబర్ నెలలో 12, 26 తేదీలు రెండు, నాలుగు శనివారాలు కాబట్టి బ్యాంకు సెలవులుగా ఉన్నాయి. క్రిస్టియన్లకు అతిపెద్ద పండుగలలో ఒకటైన క్రిస్ మస్ పండుగ ఈ నెల 25వ తేదీన వస్తుంది. 26వ తారీఖు నాలుగో శనివారం కావడంతో ఉద్యోగులకు శుక్ర, శని, ఆదివారాలు వరుసగా మూడు రోజులు సెలవులు వస్తాయి. 6,13,20, 27 తేదీలు ఆదివారం కాబట్టి ఆ నాలుగు రోజులు కూడా బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలుగా ఉంటాయి.

మొత్తం 31 రోజులలో ఏడురోజులు బ్యాంకు ఉద్యోగులకు సెలవు దినాలుగా ఉన్నాయి. అయితే ఇతర రాష్ట్రాల్లో ఆయా రాష్ట్రాలకు సంబంధించిన పండుగల వల్ల ఎక్కువ రోజులు సెలవు దినాలు ఉండటం గమనార్హం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here