Vijay Devarakonda: అర్ధరాత్రి సమంతకు వీడియో కాల్ చేసిన విజయ్ దేవరకొండ… మండిపడుతున్న సమంత ఫ్యాన్స్!

0
37

Vijay Devarakonda:సమంత విజయ్ దేవరకొండ కాంబినేషన్లో శివ నిర్వాణ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ఖుషి. ఈ సినిమా సెప్టెంబర్ ఒకటవ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రభాస్ కార్యక్రమాల్లో భాగంగా విజయ్ దేవరకొండ వరుస ఇంటర్వ్యూలకు హాజరుకాగా సమంత మాత్రం ప్రమోషన్లకు దూరంగా అమెరికాలో ఉంటున్నారు.

సమంత అమెరికాలో ఉంటూ మయోసైటిసిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇలా ఈమె ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లడంతో ఖుషి ప్రమోషన్లకు దూరంగా ఉంటున్నారు.ఇదిలా ఉండగా తాజాగా సమంతకు విజయ్ దేవరకొండ అర్ధరాత్రి సమయంలో వీడియో కాల్ చేశారు అంటూ ఒక వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీంతో సమంత ఫ్యాన్స్ మండిపడుతున్నారు.

అర్ధరాత్రి వంటి గంట సమయంలో సమంతకు విజయ్ దేవరకొండ ఫోన్ చేసి తనకు ఒక జోక్ చెప్పాలని ఫోన్ చేశాను అంటూ ఈ వీడియోలో చెప్పుకొచ్చారు. అయితే అర్ధరాత్రి సమయంలో జోక్ చెప్పడం ఏంటి అంటూ సమంత మాట్లాడారు అదేవిధంగా విజయ్ దేవరకొండ సమంతను చాలా మిస్ అవుతున్నానని కూడా తెలిపారు.. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Vijay Devarakonda: ప్రమోషన్లలో భాగమేనా…


ఈ వీడియో పై పలువురు నేటిజన్స్ స్పందిస్తూ…విమర్శలు చేయగా మరికొందరు మాత్రం అసలు ఇది వీడియో కాల్ కాదని వీరిద్దరూ సపరేట్గా సెల్ఫీ వీడియోలు తీసుకుని ఇలా ఒక వీడియోగా రూపొందించారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.అయితే సమంత సినిమా ప్రమోషన్లకు దూరంగా నేపథ్యంలో ఈ విధంగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇలాంటి వీడియోలు చేస్తున్నారని తెలుస్తోంది.